Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐసీసీ మెగా టోర్నీల్లో మార్పు మంచిదే.. కానీ ఆ విషయం మర్చిపోకూడదు: అశ్విన్

వన్డే, టీ20 ప్రపంచకప్ ఫార్మాట్‌ను మార్చాలని ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్వాగతించాడు. ఈ మార్పులు టోర్నీల్లో పోటీతత్వాన్ని పెంచుతాయని అభిప్రాయపడ్డాడు. అయితే క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే అంశాన్ని మాత్రం మరవద్దని ఐసీసీకి అశ్విన్ సూచించాడు. అగ్రశ్రేణి దేశాలతో ఆడేలా అసోసియేట్ టీమ్స్‌కు అవకాశాలు కల్పించాలని ఐసీసీని అశ్విన్ కోరాడు.

IND vs ENG: ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన భారత్.. చిత్తుగా ఓడిన బ్రూక్ సేన!

IND vs ENG: ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన భారత్.. చిత్తుగా ఓడిన బ్రూక్ సేన!

మరింత రసవత్తరంగా ఉండేందుకు ప్రపంచకప్ ఫార్మాట్‌లను మార్చాలని ఐసీసీ తమ వార్షిక సర్వసభ్య సమావేశంలో నిర్ణయించింది. 2027 వన్డే ప్రపంచకప్ నుంచే ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం సూపర్ 8 రౌండ్ ఫార్మాట్‌లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 10 రౌండ్‌ను ప్రవేశపెట్టనున్నారు. తద్వారా భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Ravichandran Ashwin backs ICC s World Cup format changes but with one Condition for Associate Nations

ఈ మార్పులను స్వాగతిస్తూ.. అశ్విన్ ఎక్స్‌వేదికగా పలు సూచనలు చేశాడు. '2027 వన్డే ప్రపంచ కప్, 2028 టీ20 ప్రపంచ కప్ టోర్నీ ఫార్మాట్‌లో ఐసీసీ చేసిన మార్పులు పోటీతత్వం పరంగా చాలా సమంజసంగా ఉన్నాయి. కానీ అంతిమ లక్ష్యం క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించడమే అయితే.. అసోసియేట్ దేశాలకు మరిన్ని అవకాశాలు కల్పించాలి.

నెదర్లాండ్స్, స్కాట్లాండ్, నేపాల్, యూఎస్ఏ, ఐర్లాండ్ వంటి జట్లకు కేవలం క్వాలిఫయర్ టోర్నీలే సరిపోవు.వారికి మరింత అర్థవంతమైన మ్యాచ్‌లు అవసరం. ఉదాహరణకు ప్రతి ద్వైపాక్షిక సిరీస్‌లో మూడో జట్టుగా చిన్న దేశాలను చేర్చాలి. చిన్న దేశాల ఎదుగుదల ఒలింపిక్స్‌లో కూడా ఈ ఆటకు అద్భుతమైన ఆదరణ తెచ్చిపెడుతోంది.'అని అశ్విన్ తన ట్వీట్ పేర్కొన్నాడు.

IND vs ENG: గెలికి మరీ తన్నించుకోవడం అంటే ఇదే బ్రో! (వీడియో)

IND vs ENG: గెలికి మరీ తన్నించుకోవడం అంటే ఇదే బ్రో! (వీడియో)

అసోసియేట్ దేశాలకు పెద్ద టీమ్స్‌తో మ్యాచ్ ఆడే అవకాశాలు కల్పించాలని అశ్విన్ సూచించాడు. ఈ ఏడాది జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో నేపాల్, స్కాట్లాండ్, అమెరికా అద్భుతంగా రాణించాయి. సౌతాఫ్రికా వేదికగా జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్‌లో ఈసారి 14 జట్లు బరిలోకి దిగనున్నాయి. ఈ టోర్నీని మరింత ఉత్కంఠభరితంగా మార్చేందుకు ఐసీసీ గ్రూప్ దశకు ముందు సూపర్ సిరీస్ రౌండ్‌ను, సెమీఫైనల్స్‌కు ముందు సూపర్ 7 రౌండ్‌ను ప్రవేశపెట్టింది.

Story first published: Thursday, July 16, 2026, 15:28 [IST]
Other articles published on Jul 16, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+