Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: గెలికి మరీ తన్నించుకోవడం అంటే ఇదే బ్రో! (వీడియో)

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా యువ పేసర్ గుర్నూర్ బ్రార్, ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. సిక్సర్ బాదాడనే కొపంతో మరుసటి బంతిని రన్నప్‌లో అందుకున్న గుర్నూర్ బ్రార్.. డకెట్‌పైకి విసిరాడు. కొద్దిలో బంతి అతన్ని మిస్సై కీపర్ చేతిలో పడింది.

IND vs ENG: బ్రిటీష్ సేనకు దవడ పగిలే కౌంటర్: వన్డే సిరీస్ మనదే రాసిపెట్టుకోండి!

IND vs ENG: బ్రిటీష్ సేనకు దవడ పగిలే కౌంటర్: వన్డే సిరీస్ మనదే రాసిపెట్టుకోండి!

అయినా బెన్ డకెట్‌ కూల్‌గానే రియాక్ట్ అయ్యాడు. క్రీజులోనే ఉన్నా కదా? అని నవ్వుతూ బదులిచ్చాడు. కానీ మరుసటి బంతిని భారీ సిక్సర్ బాది గుర్నూర్ బ్రార్‌కు దిమ్మతిరిగే షాకిచ్చాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 8వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

IND vs ENG 1st ODI Sledge Backfires as Ben Duckett Destroys Gurnoor Brar Following Heated Exchange

అసలేం జరిగిందంటే..?

ఈ ఓవర్‌ రెండో బంతిని బౌండరీ బాదిన డకెట్.. నాలుగో బంతిని కీపర్ పై నుంచి సిక్సర్ తరలించాడు. మరుసటి బంతిని గుర్నూర్.. ఔట్ సైడ్ ఆఫ్ లెంగ్త్‌లో వేయగా.. డకెట్ డిఫెన్స్ చేశాడు. ఫాలో రన్నప్‌లో బంతిని అందుకున్న బ్రార్.. కోపంగా బంతిని డకెట్‌పైకి విసిరాడు. డకెట్ క్రీజులో నుంచి కదలకపోయినా.. బంతి విసరడం అందర్నీ విస్మయపరిచింది.

IND vs ENG: టాస్ ఓడిన భారత్! మ్యాచ్ విన్నర్‌‌పై వేటు.. ఆ దద్దమ్మకు చోటు!

IND vs ENG: టాస్ ఓడిన భారత్! మ్యాచ్ విన్నర్‌‌పై వేటు.. ఆ దద్దమ్మకు చోటు!

గుర్నూర్ బ్రార్‌ను ఒక్క మాట కూడా అనని డకెట్.. ఆఖరి బంతిని లెగ్ సైడ్ సిక్సర్ బాది ప్రతీకారం తీర్చుకున్నాడు. దాంతో ఈ ఓవర్‌లో 16 పరుగులు వచ్చాయి. బ్రార్, డకెట్ సైలెంట్ వార్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. గెలికి తన్నించుకోవడం అంటే ఇదే బ్రో అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు..

గుర్నూర్ బ్రార్ వేసిన మరుసటి ఓవర్‌లో కూడా డకెట్ రెండు బౌండరీలు బాదాడు. కానీ 13వ ఓవర్‌లో గుర్నూర్ బ్రార్.. డకెట్‌పై పైచేయి సాధించాడు. ఈ ఓవర్‌లోనే జాకోబ్ బెతెల్(14)తో పాటు బెన్ డకెట్‌(43)ను పెవిలియన్ చేర్చాడు. సుందర్ సాయంతో బెతెల్‌ను ఔట్ చేసిన బ్రార్.. బుమ్రా స్టన్నింగ్ క్యాచ్‌తో డకెట్‌ను ఔట్ చేశాడు. ఆ మరుసటి ఓవర్‌లో జస్‌ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్(0)ను స్లిప్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో ఇంగ్లండ్ 64 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.

Story first published: Tuesday, July 14, 2026, 17:08 [IST]
Other articles published on Jul 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+