Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గంగూలీ నన్ను అవమానించాడు.. కావాలనే జట్టు నుంచి వెళ్లగొట్టారు: రవి శాస్త్రి

బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. గంగూలీ తనను అవమానపర్చాడని తెలిపాడు. ఉద్దేశపూర్వకంగానే జట్టు నుంచి తనను తప్పించారని ఆవేదన వ్యక్తం చేశాడు.

2016లో టీమిండియా హెడ్ కోచ్ ఎంపిక ప్రక్రియలో భాగంగా తనను ఇంటర్వ్యూ చేయాల్సిన కమిటీలో ఉన్న గంగూలీ హాజరు కాలేదని, అది తనను తీవ్రంగా బాధించిందని రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు. ఇన్నాళ్లు ఈ ఘటనపై మౌనంగా ఉన్న రవి శాస్త్రి తాజాగా పెదవి విప్పాడు. ఆ సమయంలో గంగూలీ తీరు తనను అగౌరవపరిచినట్లు అనిపించిందని వెల్లడించాడు.

భారత ప్రపంచకప్ జట్టులోకి షమీ, భువీని తీసుకోవాలి: రవిశాస్త్రి

భారత ప్రపంచకప్ జట్టులోకి షమీ, భువీని తీసుకోవాలి: రవిశాస్త్రి

గంగూలీ హాజరవ్వలేదు..

2014లో టీమిండియా 'డైరెక్టర్ ఆఫ్ క్రికెట్'గా రవిశాస్త్రి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అతని పదవీకాలం ముగియకుండానే. 2016లో బీసీసీఐ ఆ పదవిని రద్దు చేసి, హెడ్ కోచ్ పదవికి దరఖాస్తులను ఆహ్వానించింది. రవిశాస్త్రిని కూడా దరఖాస్తు చేసుకోవాలని బోర్డు సూచించింది. ఆ సమయంలో సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్‌లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించింది. అయితే, రవిశాస్త్రి ఇంటర్వ్యూ సమయంలో సౌరవ్ గంగూలీ హాజరు కాలేదు. చివరికి, సీఏసీ రవిశాస్త్రిని కాదని అనిల్ కుంబ్లేను హెడ్ కోచ్‌గా ఎంపిక చేసింది.

Ravi Shastri Opens Up on Sourav Ganguly Controversy There Was Some Motive Behind It

ఈ వ్యవహారంపై ఇన్నాళ్లు మౌనంగా ఉన్న రవిశాస్త్రి తాజాగా స్పందించాడు. 'టీమిండియా కోసం నేను సాయశక్తులా కృషి చేశాను. అలాంటి తరుణంలో నన్ను ఇంటర్వ్యూ చేయడానికి గంగూలీ రాకపోవడం నన్ను తీవ్రంగా బాధించింది. నేను డైరెక్టర్‌గా ఉన్న సమయంలో బోర్డు సభ్యులు వచ్చి ఆ పదవిని రద్దు చేస్తున్నామని తెలిపారు. హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నన్ను కావాలనే బయటకు పంపించేందుకు కారణాల కోసం వెతికారనిపించింది. ఆ నిర్ణయం నన్ను ఎంతగానో కలచివేసింది.'అని రవిశాస్త్రి గుర్తు చేసుకున్నాడు.

కోచ్‌గా రీఎంట్రీ..

అయితే ఏడాదిన్నర వ్యవధిలోనే అనిల్ కుంబ్లే హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోవడంతో హెడ్ కోచ్‌గా రవి శాస్త్రి బాధ్యతలు చేపట్టాడు. ఈ ఏడాదిన్నర కాలంలో అతను కామెంటేటర్‌గా సేవలందించాడు. తన రీఎంట్రీపై స్పందిస్తూ.. 'జీవితంలో ఇలాంటి ఒడిదుడుకులు సహజం. వాటన్నింటినీ ఎదుర్కొని నేను ముందుకు సాగాను. ఆ విరామంలో నా కోచింగ్ నైపుణ్యాలను మెరుగుపర్చుకున్నాను. చివరకు నాకు రావాల్సిన అవకాశం మళ్లీ వచ్చింది'అని రవిశాస్త్రి తెలిపాడు.

IND vs PAK: పాక్ మార్క్ ఫీల్డింగ్.. ఢీకొని క్యాచ్ వదిలేసిన భారత ఆటగాళ్లు!

Also Read

IND vs PAK: పాక్ మార్క్ ఫీల్డింగ్.. ఢీకొని క్యాచ్ వదిలేసిన భారత ఆటగాళ్లు!

అనిల్ కుంబ్లే కోచింగ్ స్టైల్‌ను అప్పట్లో భారత ఆటగాళ్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ పట్టుబట్టి అనిల్ కుంబ్లేను హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించాడు. రవి శాస్త్రి తిరిగి హెడ్ కోచ్‌గా ఎంపికవ్వడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. 2022 టీ20 ప్రపంచకప్ వరకు రవి శాస్త్రి టీమిండియా హెడ్ కోచ్‌గా కొనసాగారు. కోహ్లీ-రవి శాస్త్రి కాంబినేషన్‌లో టీమిండియా ఒక్క ఐసీసీ టైటిల్ గెలవకపోయినా.. మెరుగైన ప్రదర్శన చేసింది. టెస్ట్‌ల్లో నెంబర్ వన్ టీమ్‌గా నిలిచింది. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరింది.

Story first published: Thursday, October 8, 2026, 21:20 [IST]
Other articles published on Oct 8, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+