భారత ప్రపంచకప్ జట్టులోకి షమీ, భువీని తీసుకోవాలి: రవిశాస్త్రి
వన్డే ప్రపంచకప్ 2027 టోర్నీకి టీమిండియా వెటరన్ పేసర్లు మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్‌లను ఎంపిక చేయాలని మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. సౌతాఫ్రికా వంటి కండిషన్స్‌లో రాణించాలంటే అనుభవం కలిగిన ఆటగాళ్లు జట్టులో ఉండటం ముఖ్యమని తెలిపాడు. వన్డే ప్రపంచకప్ 2027 టోర్నీ కోసం 15 మంది సభ్యులతో కూడిన తన జట్టును రవిశాస్త్రి ప్రకటించాడు.
ఈ 15 మందిలో 10 మంది ఆటగాళ్లు 2019 వన్డే ప్రపంచకప్ ఆడటం గమనార్హం. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 1-2తో కోల్పోయిన సంగతి తెలిసిందే. చెత్త బౌలింగ్‌తోనే టీమిండియా ఈ సిరీస్ కోల్పోయింది. దాంతో టీమిండియా కాంబినేషన్, ప్రపంచకప్ ప్రణాళికలపై ప్రశ్నలు తలెత్తాయి. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోనే టీమిండియా 2027 వన్డే ప్రపంచకప్ ఆడనుంది.

శుభ్‌మన్ గిల్ సారథ్యంలోనే 15 మంది సభ్యులతో కూడిన జట్టును రవిశాస్త్రి ప్రకటించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌తో పాటు వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్‌ను రవిశాస్త్రి ఎంచుకున్నాడు. సుదీర్ఘ కాలంగా వన్డే క్రికెట్‌కు దూరంగా ఉన్న భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీలను తన జట్టులోకి తీసుకున్నాడు.
మెగా టోర్నీల్లో విజయం సాధించాలంటే అనుభవం ముఖ్యమని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్‌లను కూడా రవి శాస్త్రి ఎంపిక చేశాడు. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లను ఆల్‌రౌండర్లుగా.. కుల్దీప్ యాదవ్‌ను స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా తీసుకున్నాడు. రవి శాస్త్రి ఎంపిక చేసిన ఈ 15 మంది ఆటగాళ్లలో 10 మంది 2019 వన్డే ప్రపంచకప్ ఆడారు. ఇందులో అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ మాత్రమే కొత్తవారు.
రవిశాస్త్రి ఎంపిక చేసిన భారత ప్రపంచకప్ జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

