Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: పాక్ మార్క్ ఫీల్డింగ్.. ఢీకొని క్యాచ్ వదిలేసిన భారత ఆటగాళ్లు!

ఆసియా గేమ్స్ 2026 ఫైనల్లో భారత ఆటగాళ్లు ఫీల్డింగ్‌లో ఘోర తప్పిదం చేశారు. శనివారం పాకిస్థాన్‌తో ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ గెలవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే చర్చంతా ఈ క్యాచ్ డ్రాప్ చుట్టూనే జరిగేది.

అంత పెద్ద మిస్టేక్ చేసింది కూడా టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీతో పాటు స్పిన్నర్ రవి బిష్ణోయ్ కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో రవి బిష్ణోయ్ బౌలింగ్ కూడా సరిగ్గా చేయలేదు. ఈ మ్యాచ్ గనుక భారత్‌ ఓడిపోయి ఉంటే బిష్ణోయ్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడేదంటే అతిశయోక్తి కాదు.

IND vs PAK: గట్టెక్కించిన శివమ్ దూబే.. ఉత్కంఠపోరు‌లో పాక్‌పై భారత్ విజయం!

IND vs PAK: గట్టెక్కించిన శివమ్ దూబే.. ఉత్కంఠపోరు‌లో పాక్‌పై భారత్ విజయం!

అసలేం జరిగిందంటే..?

211 పరుగుల భారీ లక్ష్య ఛేదను దిగిన పాకిస్థాన్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన హసన్ నవాజ్ ఇచ్చిన క్యాచ్‌ను వైభవ్ సూర్యవంశీ, రవి బిష్ణోయ్‌ ఒకరినొకరు ఢీకొని నేలపాలు చేశారు.

IND vs PAK Vaibhav Sooryavanshi Ravi Bishnoi Collide While Going for Hasan Nawaz s Catch

అభిషేక్ శర్మ వేసిన 9వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని అభిషేక్.. ఆఫ్ స్టంప్ లైన్‌లో ఫ్లైటెడ్ డెలివరీగా వేయగా.. హసన్ నవాజ్ భారీ షాట్ ఆడాడు. కానీ సరిగ్గా కనెక్ట్ అవ్వని ఆ బంతి బౌలర్ తలపై నుంచి గాల్లోకి లేవగా.. లాంగ్ ఆఫ్ నుంచి వైభవ్, లాంగ్ ఆన్ నుంచి బిష్ణోయ్ ఆ క్యాచ్ కోసం పరుగెత్తుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో వారు ఒకరినొకరు చూసుకోలేదు. కనీసం కాల్ కూడా ఇచ్చుకోలేదు.

గాయాలు కాలేదు..

వైభవ్ ముందుగా బంతి దగ్గరకు చేరి క్యాచ్‌ను పూర్తి చేశాడు. కానీ అతన్ని రవి బిష్ణోయ్ బలంగా ఢీకొట్టడంతో బంతి కాస్త అతని చేతుల నుంచి జారిపోయింది. క్యాచ్ నేలపాలైనా.. అదృష్టవశాత్తూ ఈ ఇద్దరికీ గాయాలు అవ్వలేదు. ఈ క్యాచ్ పట్టి ఉంటే హసన్ నవాజ్ 4 పరుగుల వద్దే వెనుదిరిగేవాడు. కానీ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న అతను 96 పరుగులతో భారత్‌ను ఓడించినంత పని చేశాడు.

IND vs PAK: పోరా చంటోడా.. వైభవ్‌ సూర్యవంశీని ఎగతాళి చేసిన పాక్ బౌలర్!(వీడియో)

Also Read

IND vs PAK: పోరా చంటోడా.. వైభవ్‌ సూర్యవంశీని ఎగతాళి చేసిన పాక్ బౌలర్!(వీడియో)

మరో బ్యాటర్ నుంచి అతనికి సరైన సహకారం లభించలేదు. లేకపోతే ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలయ్యేది. ఇలా ఒకే క్యాచ్ కోసం ఇద్దరు ఆటగాళ్లు పరుగెత్తడం, చివరికి వదిలిపెట్టడం ఎక్కువగా పాకిస్థాన్‌ ఆటగాళ్లు చేస్తుంటారు. ఈ తరహా ఫీల్డింగ్‌కు పాకిస్థాన్ పెట్టింది పేరు. కానీ భారత్ ఆ తరహా మార్క్ ఫీల్డింగ్ చేసి ఇబ్బందులను ఎదుర్కొంది.

Story first published: Saturday, October 3, 2026, 14:58 [IST]
Other articles published on Oct 3, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+