Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అభిషేక్ శర్మ డేంజరస్‌గా మారాడు.. మిస్‌టైమ్ అయినా సిక్సర్‌గా వెళ్తోంది: రవి శాస్త్రి

టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ‌పై మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల జల్లు కురిపించాడు. అభిషేక్ శర్మ డేంజరస్‌గా మారాడని, మిస్‌టైమ్ అయిన బంతి కూడా సిక్సర్‌గా వెళ్తుందని కొనియాడాడు. అతని లెగ్ సైడ్ గేమ్ కూడా చాలా మెరుగుపర్చుకున్నాడని చెప్పాడు.

న్యూజిలాండ్‌తో మంగళవారం జరిగిన మూడో టీ20లో అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో చెలరేగిన సంగతి తెలిసిందే. 38 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్స్‌లతో 113 పరుగులు చేసి భారత్‌కు ఏకపక్ష విజయాన్ని అందించాడు. అతని ధాటికి ఈ మ్యాచ్‌లో 199 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో 40 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ ఇన్నింగ్స్ గురించి మాట్లాడిన రవి శాస్త్రి.. అభిషేక్‌‌ను ప్రత్యేకంగా కొనియాడాడు.

9 ఫోర్లు, 11 సిక్స్‌లతో అభిషేక్ ఊచకోత.. క్రికెట్ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రికార్డులు!

9 ఫోర్లు, 11 సిక్స్‌లతో అభిషేక్ ఊచకోత.. క్రికెట్ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రికార్డులు!

మిస్ టైమ్ అయినా సిక్సర్..

'ఇది ఒక గొప్ప ఇన్నింగ్స్. బౌలర్లు ఆఫ్ సైడ్‌లో పరుగులు చేయడానికి అతనికి అవకాశం ఇవ్వనప్పుడు.. ఫ్రంట్ లెగ్‌‌ను ముందుకు కదిపి భారీ షాట్స్ ఆడుతున్నాడు. బౌలర్లు బంతిని కొద్దిగా లెగ్‌ సైడ్ వేసినా ఫ్లిక్ చేసి బౌండరీకి తరలిస్తున్నాడు.

Ravi Shastri Hails Abhishek Sharma s Century Says Improved Leg-Side Game Makes and Become More Dangerous

అంతేకాకుండా అభిషేక్ శర్మకు అద్భుతమైన మణికట్టు స్వింగ్ ఉంది. బంతి బ్యాట్‌కు సరిగ్గా తగలకపోయినా.. స్క్వేర్ బౌండరీ సైడ్ సిక్సర్‌గా వెళ్తుంది. ప్రత్యర్థులు అతనికి వ్యతిరేకంగా వ్యూహాలు రచించడం మొదలు పెట్టడంతో అభిషేక్ తన ఆటను మెరుగుపర్చుకున్నాడు.

నా జీవితంలోనే ఇలాంటి బ్యాటింగ్ చూడలేదు.. పిచ్చోడినయ్యా: శ్రేయస్ అయ్యర్

Also Read

నా జీవితంలోనే ఇలాంటి బ్యాటింగ్ చూడలేదు.. పిచ్చోడినయ్యా: శ్రేయస్ అయ్యర్

యార్కర్లు వేయలేదు..

అభిషేక్ శర్మ-వైభవ్ సూర్యవంశీని నిలవరించడంలో న్యూజిలాండ్ బౌలర్లు విఫలమయ్యారు. గత రెండు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ బౌలర్లు మెరుగుపడాల్సిన విషయం ఏంటంటే.. ఓపెనింగ్ జోడీపై మరిన్ని యార్కర్లు వేయాలి. వారు తగినన్ని యార్కర్లు వేయలేదు. కానీ భారత బౌలర్లు మాత్రం పిచ్‌కు తగ్గట్లు బౌలింగ్‌ చేసి పరుగులను నియంత్రించారు.

అభిషేక్ శర్మ తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా తరలించాడు. అతని ఆఫ్ సైడ్ ఆట చాలా చూడముచ్చటగా ఉంటుంది. అతను ఒక్క చెడ్డ బంతిని కూడా వదిలేయలేదు. మైదానా పరిస్థితులకు అనుగుణంగా అతను ఆడిన తీరు అద్భుతం. ఇది ఒక గొప్ప ఇన్నింగ్స్.'అని రవిశాస్త్రి కొనియాడాడు.

Story first published: Wednesday, October 28, 2026, 10:39 [IST]
Other articles published on Oct 28, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+