Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

9 ఫోర్లు, 11 సిక్స్‌లతో అభిషేక్ ఊచకోత.. క్రికెట్ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రికార్డులు!

టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ రికార్డుల మోత మోగించాడు. క్రికెట్ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని ఘనతలను అందుకున్నాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో మంగళవారం వెల్లింగ్టన్ వేదికగా జరిగిన మూడో టీ20లో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

38 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్స్‌లతో 113 పరుగులు చేశాడు. అతని విధ్వంసంతో భారత్ 199 పరుగుల లక్ష్యాన్ని మరో 40 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. వైభవ్ సూర్యవంశీ(19 బంతుల్లో 44)తో కలిసి తొలి వికెట్‌కు 133 పరుగులు జోడించిన అభిషేక్ శర్మ.. 14 బంతుల్లో హాఫ్ సెంచరీ, 35 బంతుల్లో సెంచరీ సాధించాడు.

IND vs NZ: వారి సహకారంతోనే ఈ విధ్వంసకర సెంచరీ: అభిషేక్ శర్మ

IND vs NZ: వారి సహకారంతోనే ఈ విధ్వంసకర సెంచరీ: అభిషేక్ శర్మ

సూర్యకుమార్ యాదవ్ రికార్డ్ సమం..

అంతర్జాతీయ టీ20ల్లో వైభవ్‌కు ఇది నాలుగో సెంచరీ. ఈ ఇన్నింగ్స్‌తో అభిషేక్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన రెండో భారత బ్యాటర్‌గా సూర్యకుమార్ యాదవ్‌తో సమంగా నిలిచాడు. రోహిత్ శర్మ 5 శతకాలతో అగ్రస్థానంలో ఉన్నాడు.

Abhishek Sharma Breaks Multiple World Records With 35-ball Ton in 3rd T20I against New Zealand

40 బంతుల్లోపు మూడో శతకం..

40 బంతుల్లోపే సెంచరీ చేయడం అభిషేక్ శర్మకు ఇది మూడో సారి. అఫ్గానిస్థాన్‌పై 30 బంతుల్లోనే సెంచరీ బాది ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గా ఇప్పటికే అభిషేక్ శర్మ కొనసాగుతున్నాడు. తాజాగా 35 బంతుల సెంచరీతో ఈ ఫాస్టెస్ట్ సెంచరీ జాబితాలో మరోసారి చేరాడు.

టెస్ట్ నేషన్స్ టీమ్స్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన ఆటగాళ్లలో అభిషేక్ శర్మ అగ్రస్థానంలో ఉండగా.. సికిందర్ రాజా(33), ఫిన్ అలెన్(33), డేవిడ్ మిల్లర్(35), రోహిత్ శర్మ(35) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

టీ20ల్లో 40 బంతుల్లోపు అభిషేక్ శర్మ నాలుగు శతకాలు నమోదు చేశాడు. అతని తర్వాత ఉర్విల్ పటేల్, వైభవ్ సూర్యవంశీ 2 శతకాలతో కొనసాగుతున్నారు.

ఇషాన్ రికార్డ్ బద్దలు..

న్యూజిలాండ్‌పై ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన భారత బ్యాటర్‌గానూ అభిషేక్ శర్మ నిలిచాడు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్(42 బంతులు) పేరిట ఉన్న రికార్డ్‌ను అధిగమించాడు. న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై జరిగిన సిరీస్‌లో ఇషాన్ ఈ ఫీట్ సాధించాడు.

అంతర్జాతీయ టీ20ల్లో ఏకైక ఆటగాడిగా..

అంతర్జాతీయ టీ20ల్లో 15 బంతుల్లోపూ అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన ఏకైక ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు. అతను మొత్తం 15 బంతుల్లోపు మూడు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో 10 కంటే ఎక్కువ సిక్స్‌లు బాదడం అభిషేక్ శర్మకు ఇది మూడోసారి. టేస్ట్ ప్లేయింగ్ నేషన్స్‌లో ఏ ఆటగాడు ఈ ఫీట్ సాధంచలేదు. ఆరోన్ ఫించ్, క్రిస్ గేల్ రెండేసి సార్లు 10 కంటే ఎక్కువ సిక్సర్లు బాదారు.

IND vs NZ: అభిషేక్, వైభవ్ ఊచకోత.. చరిత్ర సృష్టించిన భారత్!

Also Read

IND vs NZ: అభిషేక్, వైభవ్ ఊచకోత.. చరిత్ర సృష్టించిన భారత్!

కోహ్లీ రికార్డ్ బద్దలు..

టీ20 క్రికెట్‌లో అత్యధిక శతకాలు బాదిన బ్యాటర్‌గానూ అభిషేక్ శర్మ నిలిచాడు. అంతర్జాతీయ టీ20లు, ఐపీఎల్, డొమెస్టిక్ క్రికెట్‌లో కలిపి అభిషేక్ 11 సెంచరీలు నమోదు చేశాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ(10 శతకాలు) రికార్డును అధిగమించాడు. కోహ్లీ ఆర్‌సీబీ తరఫున 9 శతకాలు నమోదు చేయగా.. భారత్ తరఫున ఒకే ఒక్క శతకాన్ని అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ జాబితాలో క్రిస్ గేల్ 22 శతకాలతో టాప్‌లో ఉన్నాడు. అతని తర్వాత బాబర్ ఆజామ్(13) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

Story first published: Tuesday, October 27, 2026, 18:39 [IST]
Other articles published on Oct 27, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+