Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జస్‌ప్రీత్ బుమ్రా 3 ఫార్మాట్లు ఆడొద్దు.. అతన్ని జట్టులోకి తీసుకోవాలి: రవి శాస్త్రి

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా వర్క్‌లోడ్‌ను జాగ్రత్తగా మేనేజ్ చేయాలని మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. అవసరం ఉంటేనే వన్డేలు, టీ20లు ఆడించాలని మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. బుమ్రాను ఎక్కువగా టెస్ట్‌లే ఆడించాలని, వన్డే ప్రపంచకప్ 2027 వరకు అతను గాయపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు.

IND vs NZ: వైభవ్ వాటర్ అందించాల్సిందే.. న్యూజిలాండ్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

IND vs NZ: వైభవ్ వాటర్ అందించాల్సిందే.. న్యూజిలాండ్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

షమీని తీసుకోవాలి..

వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ రీఎంట్రీని స్వాగతించిన రవి శాస్త్రి.. మహమ్మద్ షమీకి కూడా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. 'అనుభవానికి ప్రత్యామ్నాయం లేదు. భువనేశ్వర్ కుమార్ అసాధారణ నైపుణ్యం, అనుభవం కలిగిన బౌలర్. భారత జట్టు తరఫున గతంలో అతను ఆడిన తీరు.. ఐపీఎల్‌లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ ప్రదర్శన చూశాక న్యూజిలాండ్ కండిషన్స్‌కు సరిగ్గా సరిపోతాడు.

లిమిటెడ్ ఓవర్ల‌తో పాటు రెడ్ బాల్ క్రికెట్‌లోనూ సత్తా చాటగలడు. అందుకే అతన్ని టెస్ట్‌లు, వన్డేలకు కూడా ఎంపిక చేయాలని చెబుతున్నా. భువనేశ్వర్‌తో పాటు మహమ్మద్ షమీ కూడా పునరాగమనానికి పూర్తి అర్హుడు.

Ravi Shastri Backs Mohammed Shami s India Return Says Jasprit Bumrah Shouldn t Play All Three Formats

మూడు ఫార్మాట్లు ఆడొద్దు..

భువనేశ్వర్ రాకతో జస్‌ప్రీత్ బుమ్రాపై కాస్త ఒత్తిడి కూడా తగ్గుతుంది. ప్రపంచకప్ వరకు మూడు ఫార్మాట్లలో ఆడాలని బుమ్రా అనుకోవద్దు. గాయాల బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత టీమ్‌మేనేజ్‌మెంట్‌పైనే ఉంది. ముందుగా టెస్ట్‌లకే ప్రాధాన్యత ఇవ్వాలి. అత్యవసరమైతే తప్పా వన్డే, టీ20లు ఆడవద్దు.

న్యూజిలాండ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం బుమ్రాను ఉపయోగించుకోవాలి. న్యూజిలాండ్ పర్యటనే టీమిండియాకు చాలా కీలకమైనది. డబ్ల్యూటీసీతో పాటు వన్డే ప్రపంచకప్ సన్నాహకంగా ఈ పర్యటనను ఉపయోగించుకోవాలి. న్యూజిలాండ్‌ తరహాలోనే సౌతాఫ్రికాలోని పిచ్ కండిషన్సే ఉంటాయి.'అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

కండిషన్స్‌కు తగ్గట్లు ఆడాలి..

రిషభ్ పంత్‌కు తాను ఎలాంటి సందేశాలను ఇవ్వనని, తెలివిగా బ్యాటింగ్ చేయాలని మాత్రమే చెబుతానని రవిశాస్త్రి గుర్తు చేసుకున్నాడు. 'నేను రిషభ్ పంత్‌కు ఎలాంటి సందేశాలు ఇవ్వను. కానీ ఒకటే మాట చెబుతా. కాస్త తెలివిగా ఆడాలి. సెంచరీలు సాధించే సత్తా ఉంది.

IND vs ZIM: మేం గెలిచినా.. ఆ విషయంలో మెరుగవ్వాలి: స్మృతి మంధాన

Also Read

IND vs ZIM: మేం గెలిచినా.. ఆ విషయంలో మెరుగవ్వాలి: స్మృతి మంధాన

అలాగని ఎవరి కోసమో నీ ఆటను మార్చుకోవాల్సిన అవసరం లేదు. సహజంగా నీఆట ఆడు. అయితే మ్యాచ్‌ పరిస్థితిని కూడా కాస్త చూస్తుండు.'అని మాత్రమే చెబుతా. రిషభ్ పంత్‌కు ప్రత్యేకంగా ఏమీ చెప్పనక్కర్లేదు. అభిమానులను ఎలా అలరించాలో అతనికి బాగా తెలుసు.'అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, October 19, 2026, 15:17 [IST]
Other articles published on Oct 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+