For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మావోడు మంచోడు.. నా భార్య భోజనం కూడా చేయలేదు.. యువ క్రికెటర్ తండ్రి ఆవేదన

Ravi Bishnois father disappointed after India U19 player punished by ICC

న్యూఢిల్లీ: అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ అనంతరం శ్రుతిమించిన కుర్రాళ్ల అత్యుత్సాహంపై ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) క్రమశిక్షణ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. మైదానంలో ఏ మాత్రం ఆహ్వానించదగని ఈ ఘటనకు కారుకులైన ముగ్గురు బంగ్లాదేశ్ ఆటగాళ్లు, ఇద్దరు భారత్ ప్లేయర్లపై సస్పెన్షన్ పాయింట్లు విధిస్తూ కొరడా ఝులిపించింది.

భారత్‌కు చెందిన ఇద్దరి ఆటగాళ్లలో టోర్నీ అధ్యాంతం ఆకట్టుకున్న స్పిన్‌ బౌలర్‌ రవి బిష్ణోయ్‌ ఒకడైతే.. పేసర్ ఆకాశ్‌ సింగ్‌ రెండో వాడు. అయితే రవి బిష్లోయ్‌పై సస్పెన్షన్ పాయింట్ల విధించడంపై అతని తండ్రి మంగిలాల్‌ బిష్ణోయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై ఓ జాతీయ చానెల్‌తో ఆయన మాట్లాడారు.

షాక్‌కు గురయ్యా..

షాక్‌కు గురయ్యా..

తన కుమారుడు చాలా ప్రశాంతంగా ఉంటాడని, అతనిపై వస్తున్న ఆరోపణలను విని షాక్‌‌కు గురయ్యానన్నారు. బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు టీమిండియా ఆటగాళ్లపై దాడి చేస్తున్న సందర్భంలో సహచరుడిని కాపాడే క్రమంలో తన కుమారుడు ఆవేశానికి లోనైనట్లు తెలిపారు.

క్రికెట్ చరిత్రలోనే కనివిని ఎరుగని ఘటన.. క్రీడాస్పూర్తికి విరుద్దమంటూ మాజీల ఫైర్

ఈ సంఘటనపై కలత చెందిన బిష్ణోయ్‌ తల్లి భోజనం కూడా చేయడం లేదని వాపోయారు. ఉత్కంఠ భరితంగా సాగే మ్యాచ్‌లలో యువ ఆటగాళ్లు భావోద్వేగానికి లోనవ్వడం సహజమన్న ఆయన.. ఆటగాళ్లు ఒకరినొకరు గౌరవించుకుంటూ క్రీడా స్పూర్తిని ప్రదర్శించాలని తెలిపారు.

‘నా కొడుకు గొడవ చేశాడంటే షాక్‌కు గురయ్యా. మా ముగ్గురు పిల్లల్లో వాడే చాలా ప్రశాంతంగా ఉంటాడు(రవి బిష్టోయ్‌కు ఇద్దరు అక్కలు). దాడికి దిగిన బంగ్లాదేశ్ ప్లేయర్ల నుంచి అతని టీమ్‌మేట్‌ను కాపాడే క్రమంలోనే ఆవేశానికి లోనైనట్లు చెప్పాడు. ఈ సంఘటనతో నా భార్య నిన్నటి నుంచి భోజనం కూడా చేయడం లేదు.'అని మంగిలాల్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

హద్దులు దాటిన సంబరాలు..

హద్దులు దాటిన సంబరాలు..

గత ఆదివారం జరిగిన అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్‌లో విజయానంతరం బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు హద్దులు దాటి మరీ సంబరాలు చేసుకున్న సంగతి తెలిసిందే. తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆనందంలో బంగ్లాదేశ్‌ యువ ఆటగాళ్లు విచక్షణ కోల్పోయి ప్రవర్తించారు. విజయానికి అవసరమైన సింగిల్‌ రాగానే ఆటగాళ్లంతా ఉద్వేగంతో మైదానంలోకి పరిగెత్తుకొచ్చారు. వస్తూనే భారత ఆటగాళ్లను గేలి చేస్తూ అసభ్య పదాజాలాన్ని ఉపయోగించారు.

IPL 2020: కోహ్లీసేన రాత మారలేదని పేరు మారుస్తున్నారా?

బంగ్లా పేసర్‌ షోరిఫుల్‌ ఇస్లాం అయితే భారత ఆటగాళ్లపై అభ్యంతకర వ్యాఖ్యలతో రెచ్చిపోయాడు. ఇక ఓ రిజర్వ్‌ ఆటగాడు ఏకంగా గొడవకు దిగడంతో సహనం కోల్పోయిన భారత క్రికెటర్‌ అతడిని నెట్టివేసాడు. అక్కడే ఉన్న అంపైర్‌ జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.

క్రమశిక్షణ చర్యలు..

క్రమశిక్షణ చర్యలు..

వీడియో ఫుటేజీలను పరిశీలించిన ఐసీసీ మొత్తం ఐదుగురు ఆటగాళ్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఐసీసీ నియమావళిని ఉల్లఘించినట్లు ఆటగాళ్లు అంగీకరించారని కూడా పేర్కొంది. బంగ్లాదేశ్‌ జట్టులో తౌహిద్ హ్రిదోయ్‌, షమీమ్ హుస్సేన్‌, రకీబుల్‌ హసన్‌.. భారత జట్టులో ఆకాశ్‌ సింగ్, రవి బిష్టోయ్‌ ఐసీసీ నియమావళిని ఉల్లఘించినట్లు గుర్తించింది.

ఆకాశ్‌ సింగ్‌కు 8 సస్పెన్షన్‌ పాయింట్లు (6 డి మెరిట్‌ పాయింట్లకు సమానం), రవి బిష్ణోయ్‌కి 5 సస్పెన్షన్‌ (2 డి మెరిట్‌) పాయింట్లు విధిస్తూ చర్యలు తీసుకుంది. ఈ టోర్నీలో రవి బిష్ణోయ్‌ అత్యధిక వికెట్లను(17) పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు.

Story first published: Wednesday, February 12, 2020, 18:56 [IST]
Other articles published on Feb 12, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+