న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020: కోహ్లీసేన రాత మారలేదని పేరు మారుస్తున్నారా?

IPL 2020 : Royal Challengers Bangalore To Be Renamed As Royal Challengers Bengaluru
IPL 2020: Royal Challengers Bangalore to be renamed as Royal Challengers Bengaluru

బెంగళూరు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీలో ఒక్కసారి కూడా టైటిల్‌ను నెగ్గలేదు. 2008 నుండి టోర్నీలో పాల్గొంటున్న ఆర్‌సీబీకి మాత్రం ఐపీఎల్ టైటిల్ ఓ అందని ద్రాక్షలాగే మిగిలిపోయింది. ఆర్‌సీబీ జట్టుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యం వహిస్తున్నాడు. టాప్ ప్లేయర్, కెప్టెన్ అయిన కోహ్లీ కూడా ఆర్‌సీబీ రాతను మార్చలేకపోయాడు. టీమిండియాను విజయ పథంలో నడిపిస్తున్న కోహ్లీ.. ఆర్‌సీబీని మాత్రం ఆ విధంగా ముందుకు తీసుకెళ్లలేకపోతున్నాడు.

<strong>'చేతిలో బంతి ఉంటే బుమ్రా ఎంతో ప్రమాదకరం.. ఇంకాస్త పదును పెరిగితే'</strong>'చేతిలో బంతి ఉంటే బుమ్రా ఎంతో ప్రమాదకరం.. ఇంకాస్త పదును పెరిగితే'

ప్రతిసారి నిరాశే

ప్రతిసారి నిరాశే

ఐపీఎల్ టోర్నీలో అత్యధిక మంది అభిమానులు కలిగి ఉన్న జట్లలో ఆర్సీబీ ఒకటి. కానీ.. అభిమానులకు మాత్రం ప్రతిసారి నిరాశే ఎదురవుతోంది. 2016లో ఫైనల్‌కు చేరుకున్న ఆర్సీబీ.. హైదరాబాద్ చేతిలో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది. ఐపీఎల్ టోర్నీలో ఒక్కసారి కూడా టైటిల్‌ను నెగ్గని ఆర్సీబీ.. ఈ ఏడాది ఎలాగైనా దాన్ని సాధించాలని ప్రణాళికలు చేస్తోంది. ఇందులో భాగంగానే మొదటగా తన పేరును మార్చుకునే పనిలో ఉంది.

Bangalore కాదు 'Bengaluru'

Bangalore కాదు 'Bengaluru'

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం... ఆర్‌సీబీ తన పేరును మార్చుకోనుందట. స్థానిక అభిమానులు 'Bangalore' అని పిలవడానికి అంతగా ఆసక్తి కనబరచట్లేదట. ఫాన్స్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో.. ఆర్‌సీబీ అధికారులు తమ జట్టు పేరును 'Bangalore' నుండి 'Bengaluru'గా మార్చాలని నిర్ణయించారట. లోగో మార్పు కూడా ఉంటుందని సమాచారం. ఫిబ్రవరి 16న వీటిపై అధికారిక ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. ఫేస్‌బుక్‌తో సహా సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఇప్పటికే 'Bangalore'ను తొలగించిందట. కేవలం 'రాయల్ ఛాలెంజర్స్' మాత్రమే ఉందట.

వేలంలో ఆచితూచి అడుగు

వేలంలో ఆచితూచి అడుగు

2019 ఐపీఎల్ సీజన్‌లో కనీసం ప్లేఆఫ్‌కి కూడా చేరుకోలేకపోయిన బెంగళూరు.. ఈసారి పెద్ద ఎత్తున క్రికెటర్లని వేలంలోకి వదిలి 8 మంది ఆటగాళ్లని కొనుగోలు చేసింది. ఇందులో ఎక్కువ మంది సీనియర్ క్రికెటర్లే ఉండటం విశేషం. అరోన్ ఫించ్, క్రిస్‌ మోరీస్, డేల్ స్టెయిన్, కేన్ రిచర్డ్‌సన్‌, ఇసురు ఉదాన లాంటి స్టార్ ఆటగాళ్లను గత డిసెంబర్ నెలలో జరిగిన వేలంలో ఆర్సీబీ తీసుకుంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), మొయిన్ అలీ, యుజువేంద్ర చహల్, ఏబీ డివిలియర్స్, పార్థీవ్ పటేల్ (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్, పవన్ నేగి, ఉమేశ్ యాదవ్, గురుకీరత్ మన్, దేవదత్త, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, నవదీప్ షైనీ, అరోన్ ఫించ్, క్రిస్‌ మోరీస్, డేల్ స్టెయిన్, కేన్ రిచర్డ్‌సన్‌, పవన్, షదాబ్ అహ్మద్, ఇసురు ఉదాన, పిలిప్పే.

Story first published: Wednesday, February 12, 2020, 17:21 [IST]
Other articles published on Feb 12, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X