జైలు నుంచి వచ్చాక సెంచరీ.. మైదానంలోనే ఏడ్చేసిన భారత క్రికెటర్!
తీవ్రమైన అత్యాచార ఆరోపణలతో జైలుకు వెళ్లి, ఇటీవలే బెయిల్‌పై విడుదలైన బెంగాల్ వికెట్ కీపర్ అభిషేక్ పోరెల్.. అద్భుతమైన శతకంతో మైదానంలోకి రీఎంట్రీ ఇచ్చాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ 2026-27లో ఢిల్లీతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కాడు. సెంచరీ పూర్తయిన వెంటనే తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. మైదానంలోనే కుప్పకూలి కన్నీటి పర్యంతమయ్యాడు. మాటలతో కాకుండా తన ఆటతోనే సమాధానం చెప్పాలన్న తన పట్టుదలను ఈ సెంచరీతో చాటుకున్నాడు.
23 ఏళ్ల అభిషేక్ పోరెల్.. తొలి ఇన్నింగ్స్‌లో 149 బంతుల్లో 17 ఫోర్లు, సిక్స్‌తో 149 పరుగులు చేసి తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. అభిషేక్ పోరెల్ భారీ శతకంతో ఈ మ్యాచ్‌లో బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 112 ఓవర్లలో 429 పరుగులకు ఆలౌటైంది. దాంతో బెంగాల్‌కు 189 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
సెంచరీ అనంతరం కన్నీటి పర్యంతం..
అభిషేక్ పోరెల్‌కు కెరీర్‌లో ఇది రెండో ఫస్ట్-క్లాస్ సెంచరీ మాత్రమే. ఈ మైలురాయిని అందుకున్న వెంటనే పోరెల్ మోకాళ్లపై కూర్చొని కన్నీటిపర్యంతమయ్యాడు. ఆ తర్వాత తేరుకుని, బ్యాట్ పైకెత్తి అభివాదం చేశాడు. అభిషేక్ కన్నీటి పర్యంతమవ్వడం అందర్నీ కదిలించింది.

రెండో రోజు ఆట అనంతరం మాట్లాడిన పోరెల్.. సెంచరీ అనంతరం తెలియకుండా కన్నీళ్లు ఉబికి వచ్చాయని చెప్పాడు. మాటలతో కాకుండా తన ఆటతోనే సమాధానం చెప్పాలనుకుంటున్నానని, ఈ సంబరం అందులో భాగమేనని స్పష్టం చేశాడు. ఈ కష్టకాలంలో తనకు అండగా నిలిచిన కోచ్ లక్ష్మీ రతన్ శుక్లాకు, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపాడు.
పెళ్లి పేరుతో అత్యాచారం..
గత కొన్ని రోజులుగా పోరెల్ వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. కర్ణాటకకు చెందిన ఓ మెడికల్ విద్యార్థిని పెళ్లి పేరుతో మోసం చేసి అత్యాచారం చేశాడని, బెదిరింపులకు పాల్పడ్డాడనే అభియోగాలతో పోరెల్‌పై కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా అభిషేక్ పోరెల్ నెల రోజులకు పైగా జైలులో గడిపాడు. అతనికి సెప్టెంబర్‌లో చిన్సురా కోర్టు నుంచి బెయిల్ లభించింది.
ఈ అత్యాచార ఆరోపణలను అభిషేక్ పోరెల్ ఖండించాడు. ఇక బెయిల్‌తో బయటకు వచ్చిన అభిషేక్ పోరెల్‌కు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అండగా నిలిచింది. రంజీ ట్రోఫీ ఆరంభ మ్యాచ్‌కే బెంగాల్ జట్టులోకి తీసుకుంది.ఈ విషయంపై స్పందించిన బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ), అతని వ్యక్తిగత, న్యాయపరమైన విషయాలతో తమకు సంబంధం లేదని, ప్రస్తుతం జట్టు ఎంపికలో అతన్ని పరిగణనలోకి తీసుకున్నామని స్పష్టం చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


