Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం: స్టార్ క్రికెటర్‌పై సంచలన ఆరోపణలు!

ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్, బ్యాటర్ అభిషేక్ పోరెల్ చుట్టూ తీవ్ర వివాదం ముసురుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మూడేళ్లుగా శారీరక సంబంధం పెట్టుకుని.. ఆపై మోసం చేశాడంటూ ఓ మహిళ అతనిపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా మొగ్రా పోలీస్ స్టేషన్లో ఆ మహిళ, తన తల్లితో కలిసి వెళ్లి ఆ క్రికెటర్‌పై ఫిర్యాదు చేశారు. పెళ్లి పేరుతో మోసం చేయడమే కాకుండా.. తనపై దాడికి పాల్పడ్డాడని, బెదిరింపులకు గురిచేశాడని సదరు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.

మూడేళ్ల బంధం.. 2025 నుంచి దూరం!
పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం.. సదరు మహిళ, అభిషేక్ పోరెల్ గత మూడేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. కొంతకాలం పాటు వీరి బంధం బాగానే సాగినప్పటికీ.. 2025లో ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత అభిషేక్ పోరెల్ ఆమెకు క్రమక్రమంగా దూరమయ్యాడు. పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు నిరాకరించడమే కాకుండా.. వివాదానికి దిగడంతో ఈ వ్యవహారం కాస్తా పోలీస్ స్టేషన్ వరకు చేరింది. ప్రస్తుతం మొగ్రా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇరు పక్షాల నుంచి వివరాలను సేకరిస్తున్నారు.

IPL Star Abhishek Porel Faces Cheating Charges Woman Files Complaint in Hooghly Full Details

స్పందించిన అభిషేక్ పోరెల్
తనపై వచ్చిన ఆరోపణలను 23 ఏళ్ల అభిషేక్ పోరెల్ తీవ్రంగా ఖండించాడు. తాను క్రికెట్లో రాణిస్తూ మంచి ఫామ్‌లో ఉన్నందుకే కొందరు కావాలనే తన పేరును వివాదాల్లోకి లాగుతున్నారని అన్నాడు. "నేను ప్రస్తుతం బాగా ఆడుతున్నాను, అందుకే ఇలాంటి విషయాలను తెరపైకి తెస్తున్నారు. పోలీసుల విచారణ పూర్తి కాగానే ఈ విషయంపై నేను పూర్తి వివరంగా మాట్లాడతాను. ఇప్పటివరకు పోలీసుల నుంచి నాకు ఎలాంటి సమాచారం రాలేదు" అని అభిషేక్ పోరెల్ స్పష్టం చేశాడు.

ఐపీఎల్, డొమెస్టిక్ కెరీర్
ఇక క్రికెట్ విషయానికి వస్తే.. ఐపీఎల్ 2026 సీజన్లో అభిషేక్ పోరెల్‌కు పెద్దగా అవకాశాలు దక్కలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన 4 ఇన్నింగ్స్‌ల్లో ఒక హాఫ్ సెంచరీతో కలిపి 108 రన్స్ చేశాడు. అయినప్పటికీ ఫ్రాంచైజీ అతడిని రూ. 4 కోట్లకు రీటైన్ చేసుకుంది. ఆ తర్వాత జరిగిన బెంగాల్ ప్రో టి20 లీగ్‌లో 6 మ్యాచ్‌ల్లో 275 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. 2022లో బెంగాల్ జట్టు తరఫున డొమెస్టిక్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన పోరెల్.. ఇప్పటివరకు 32 ఫస్ట్ క్లాస్, 23 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడాడు. ప్రస్తుతం ఈ కేసు పోలీస్ దర్యాప్తులో ఉంది. ఆరోపణలు రుజువైతేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.

Story first published: Wednesday, June 24, 2026, 16:55 [IST]
Other articles published on Jun 24, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+