Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హోటల్ రూమ్ బుక్ చేయించుకుని మరీ.. బయటపడ్డ క్రికెటర్ బండారం! (వీడియో)

ఐపీఎల్ 2026 సీజన్ మైదానంలో ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తుతుంటే.. మరో వైపు ఓ షాకింగ్ ఉదంతం క్రీడా వర్గాలను ఉలిక్కిపడేలా చేస్తోంది. గుజరాత్ టైటాన్స్ జట్టుకు చెందిన ఓ ఆటగాడు తనను మోసం చేశాడని, లైంగికంగా వాడుకున్నాడని ఓ యువతి చేసిన ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తున్నాయి. ఎంతో క్రేజ్ ఉన్న ఐపీఎల్ వంటి లీగ్ సమయంలో ఇలాంటి ఆరోపణలు రావడం జట్టు ప్రతిష్టకు సవాలుగా మారింది.

నెట్టింట పరిచయం
వైరల్ అవుతున్న వీడియో కథనం ప్రకారం.. అదితి అనే యువతికి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ప్రతిరోజూ వచ్చే అనేక రిక్వెస్ట్‌లలో ఇదొకటిగా భావించిన ఆ యువతి అతనితో మాటలు కలిపింది. తొలుత అతను ఓ ప్రొఫెషనల్ క్రికెటర్ అని ఆమెకు తెలియదు. కాలక్రమేణా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, అది 'సిట్యుయేషన్‌షిప్'కు దారితీసిందని సదరు వీడియోను రూపొందించిన క్రియేటర్ వెల్లడించారు. ఆ తర్వాత అతను గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాడని ఆమెకు తెలిసింది.

Gujarat Titans Player Accused of Physical Harassment Viral Video Controversy in IPL 2026

అసలు ఆరోపణలు ఏమిటి?:
తన బంధువులు ఉండే నగరంలోనే ఆ క్రికెటర్ ఉంటున్నాడని తెలిసి అదితి అతడిని కలిసినట్లు సమాచారం. అయితే ఆ సమయంలో సదరు ఆటగాడి ప్రవర్తన వింతగా ఉందని ఆమె ఆరోపిస్తోంది. అతను తనను కేవలం శారీరక వాంఛల కోసమే వాడుకోవాలని ప్రయత్నిస్తున్నాడని గ్రహించిన అదితి.. అతనితో తీవ్రంగా గొడవపడి సంబంధాన్ని తెంచుకుంది. కేవలం వాడుకుని వదిలేసే రకం అని అర్థం కావడంతో ఆమె అతనితో మాట్లాడటం పూర్తిగా మానేసింది.

హోటల్ రూమ్ బుకింగ్ వివాదం

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభమైన తర్వాత ఆ క్రికెటర్ మళ్లీ అదితిని సంప్రదించినట్లు వీడియోలో పేర్కొన్నారు. ఈసారి తాను సెలబ్రిటీని అయిపోయానని.. బయట కలిస్తే జనం గుర్తుపడతారని చెబుతూ ఆమెను ఒక హోటల్‌లో కలవాలని కోరాడు. విచారకరమైన విషయం ఏమిటంటే, సదరు క్రికెటర్ ఆ హోటల్ రూమ్ బిల్లును కూడా ఆ యువతితోనే కట్టించాడని ఆరోపణలు వస్తున్నాయి. హోటల్ గదిలోనే తనపై లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడని, నమ్మించి మోసం చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.

నెటిజన్ల భిన్నాభిప్రాయాలు
ఈ వీడియో బయటకు రాగానే నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు ఆ క్రికెటర్ ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తూ, అతనెవరో బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ ఆరోపణలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా, కేవలం ముఖం చూపించకుండా చేసే ఇలాంటి ఆరోపణలు సోషల్ మీడియాలో వ్యూస్ కోసం సృష్టించిన కట్టుకథలు కావచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. వాస్తవాలు వెలుగులోకి వచ్చే వరకు ఎవరినీ తప్పుబట్టలేమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్ారు.

ఈ వివాదంపై గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం కానీ, లేదా ఐపీఎల్ కౌన్సిల్ కానీ ఇప్పటివరకు స్పందించలేదు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించిందా లేదా అనేది కూడా ఇంకా స్పష్టత లేదు. ఏదేమైనా కోట్లాది మంది అభిమానించే క్రికెటర్లు ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం క్రీడా స్ఫూర్తికి విఘాతం కలిగించే విషయమే. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిగితే తప్ప అసలు నిజాలు బయటకు రావు.

Story first published: Friday, April 24, 2026, 14:41 [IST]
Other articles published on Apr 24, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+