Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ranji Trophy: కెప్టెన్ సిరాజ్ విఫలం.. హైదరాబాద్ ఘన విజయం!

ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ 2026-27 సీజన్‌లో హైదరాబాద్ శుభారంభం చేసింది. ఎలైట్ గ్రూప్-బీలో భాగంగా త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఇన్నింగ్స్ 40 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. హైదరాబాద్ బౌలర్లు అనికేత్ రెడ్డి(5/21), తనయ్ త్యాగరాజన్(3/37, 6/52) నిప్పులు చెరగడంతో మూడు రోజుల్లోనే విజయాన్ని అందుకుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన త్రిపుర తొలి ఇన్నింగ్స్‌లో 44 ఓవర్లలోనే 134 పరుగులకు కుప్పకూలింది. అనంతరం హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ 103.2 ఓవర్లలో 294 పరుగుల భారీ స్కోర్ చేసింది. తన్మయ్ అగర్వాల్(122 బంతుల్లో 2 ఫోర్లతో 54), రుతిక్ మెండే(150 బంతుల్లో 5 ఫోర్లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించగా.. రాహుల్ రాదేశ్(119 బంతుల్లో ఫోర్‌తో 40), చామ మిలింద్(55 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40) పర్వాలేదనిపించారు.

IND vs WI: పోలీస్ నిఘాలో ఉప్పల్ మ్యాచ్.. మఫ్టీలో షీ టీమ్స్: సీపీ సుమతి

IND vs WI: పోలీస్ నిఘాలో ఉప్పల్ మ్యాచ్.. మఫ్టీలో షీ టీమ్స్: సీపీ సుమతి
Ranji Trophy 2026-27 Mohammed Siraj s Poor Form Continues Despite Hyderabad s Innings Win Over Tripura

164 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన త్రిపుర 120 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. హైదరాబాద్ కెప్టెన్, టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. గత కొద్ది రోజులుగా పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న సిరాజ్.. రంజీ ట్రోఫీలోనూ తన వైఫల్యాన్ని కొనసాగించాడు. కీలక న్యూజిలాండ్ పర్యటనకు ముందు సిరాజ్ గాడిన పడాల్సి ఉంది.

IND vs WI: వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలి: టీమిండియా మాజీ కోచ్

Also Read

IND vs WI: వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలి: టీమిండియా మాజీ కోచ్

పట్టుబిగించిన ఆంధ్ర..

కర్ణాటకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆంధ్ర టీమ్ పట్టుబిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 144 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కర్ణాటక 274 పరుగులకు కుప్పకూలింది. కేఎల్ రాహుల్(4) తీవ్రంగా నిరాశపర్చాడు. అనంతరం ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 418 పరుగుల భారీ స్కోర్ చేసింది. సీరామ్ రాహుల్(119) సెంచరీతో రాణించగా.. రేవంత్ రెడ్డి(143 బంతుల్లో 13 ఫోర్లతో 97) తృటిలో సెంచరీని కోల్పోయాడు. షేక్ రషీద్(121 బంతుల్లో 4 ఫోర్లతో 54) హాఫ్ సెంచరీతో రాణించాడు.

అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(1) మరోసారి నిరాశపర్చగా.. కరుణ్ నాయర్(81 నాటౌట్) జట్టును ఆదుకున్నాడు.

Story first published: Tuesday, October 13, 2026, 18:33 [IST]
Other articles published on Oct 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+