Ranji Trophy: ఆంధ్రతో మ్యాచ్.. గెలుపు దిశగా హైదరాబాద్
ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ 2026-27 సీజన్‌లో శుభారంభం చేసిన హైదరాబాద్.. మరో విజయం ముంగిట నిలిచింది. ఎలైట్ గ్రూప్-బీలో భాగంగా ఆంధ్ర జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ పట్టుబిగించింది. ఆంధ్ర ముందు 398 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది.
ఈ భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆంధ్ర మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 7 పరుగులే చేసింది. ఆంధ్ర విజయానికి 391 పరుగులు అవసరం కాగా.. హైదరాబాద్ విజయానికి 8 వికెట్లు కావాలి.
సత్తా చాటిన హైదరాబాద్ బ్యాటర్లు..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 86 ఓవర్లలో 275 పరుగులకు ఆలౌటైంది. రాహుల్ రాదేష్(105 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 58 నాటౌట్), అభిరత్ రెడ్డి(108 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 67) హాఫ్ సెంచరీలతో రాణించగా.. తన్మయ్ అగర్వాల్(75 బంతుల్లో 4 ఫోర్లతో 42) పర్వాలేదనిపించాడు. ఆంధ్ర బౌలర్లలో సౌరభ్ కుమార్(3/75), లలిత్ మోహన్(3/78) మూడేసి వికెట్లు తీయగా.. త్రిపురణ విజయ్(4/90) నాలుగు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం ఆంధ్ర 63 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌటైంది. షేక్ రషీద్(114 బంతుల్లో 8 ఫోర్లతో 61) హాఫ్ సెంచరీతో రాణించగా.. రికీ భుయ్(56 బంతుల్లో 3 ఫోర్లతో 28), సీరమ్ రాహుల్(81 బంతుల్లో 2 ఫోర్లతో 27) పర్వాలేదనిపించారు. హైదరాబాద్ బౌలర్లలో తన్మయ్ అగర్వాల్(5/63) ఐదు వికెట్లు తీయగా.. అనికేత్ రెడ్డి(2/60) రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీసాడు.
91 పరుగుల ఆధిక్యంతో..
91 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ 95.3 ఓవర్లలో 306/7 స్కోర్ వద్ద డిక్లెర్ చేసింది. కొదిమెల హిమతేజ(202 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 123 నాటౌట్) అజేయ శతకంతో రాణించగా.. తనయ్ త్యాగరాజన్(64 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.
ఆంధ్ర బౌలర్లలో కావురి సాయితేజ(4/40) నాలుగు వికెట్లు తీయగా.. త్రిపురణ విజయ్(2/119) రెండు వికెట్లు పడగొట్టాడు. కేవీ శ్రీకాంత్ ఒక వికెట్ తీసాడు. చివరిదైన నాలుగో రోజు ఆటలో ఆంధ్ర పూర్తిగా బ్యాటింగ్ చేస్తే డ్రాతో గట్టెక్కుతుంది. లేదంటే ఆంధ్రపై హైదరాబాద్ విజయం నమోదవుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


