IND vs WI 4th T20I: ఉప్పల్ మ్యాచ్ టికెట్లు కావాలా.. అందుబాటులో 22 వేల టికెట్లు!
భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య నాలుగో టీ20 హైదరాబాద్ వేదికగా జరగనుంది. అక్టోబర్ 14న(బుధవారం) ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల విక్రయాలను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఆన్‌లైన్ వేదికగా ప్రారంభించింది. ticketgenie ఫ్లాట్‌ఫామ్ వేదికగా ఈ మ్యాచ్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఏర్పాట్లపై హెచ్‌సీఏ శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ మ్యాచ్‌కు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశామని హెచ్‌సీఏ సెక్రటరీ జీవన్ రెడ్డి తెలిపారు. ఈ మ్యాచ్ టికెట్ల ధరలు రూ.750 నుంచి రూ. 20 వేల వరకు ఉన్నాయని చెప్పారు.

తొలిసారిగా స్కూల్ స్టూడెంట్స్‌కు 2500 టికెట్లు, భారత ఆర్మీకి 250 టికెట్లను ఫ్రీగా ఇస్తున్నామని వెల్లడించారు. మొత్తం 34 వేల టికెట్స్‌ను ఆన్‌లైన్ వేదికగా విక్రయిస్తున్నామని చెప్పారు. యాప్‌లో ఒకేసారి నాలుగు టికెట్లను కొనుగోలు చేయవచ్చన్నారు. ఇప్పటి వరకు 12 వేల టికెట్లను విక్రయించామని చెప్పిన జీవన్ రెడ్డి.. ఈ రోజు(శుక్రవారం) సాయంత్రం 6.30 గంటలకు మరో 12 వేల టికెట్లు విక్రయిస్తామని చెప్పారు. మ్యాచ్‌కు 48 గంటల ముందు మరో 10 వేల టికెట్లను విక్రయిస్తామని తెలిపారు.
టికెట్స్‌కు ఫుల్ డిమాండ్ ఉందని, బ్లాక్ మార్కెట్‌లోకి టికెట్లు వెళ్లకూడదనే.. ఒకేసారి కాకుండా విడతలవారీగా విక్రయిస్తున్నామని చెప్పారు. పార్కింగ్, ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తకుండా మెట్రో రైలులో వచ్చి మ్యాచ్‌లు చూడాలని ప్రేక్షకులను కోరారు. మ్యాచ్‌కు రెండు గంటల ముందే రావాలని సూచించారు. ఐపీఎల్ తర్వాత హైదరాబాద్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే కావడంతో ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఈ ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. లక్నో వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. రెండో టీ20 రాంచీ వేదికగా శుక్రవారం జరగనుండగా.. మూడో టీ20 ఇండోర్ వేదికగా జరగనుంది. నాలుగో టీ20కి హైదరాబాద్‌లో జరగనుండగా.. చివరి టీ20కి బెంగళూరు ఆతిథ్యం ఇవ్వనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


