Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Anvay Dravid: శతక్కొట్టిన ద్రవిడ్ చిన్న కొడుకు.. 23 బౌండరీలతో విధ్వంసం!

టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తనయుడు అన్వే ద్రవిడ్ దుమ్మురేపాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ అండర్ 19 టోర్నీ అయిన వినూ మన్కడ్ ట్రోఫీలో అన్వే ద్రవిడ్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. ఈ టోర్నీలో కర్ణాటకకు సారథ్యం వహిస్తున్న అన్వే ద్రవిడ్.. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 100 బంతుల్లో 23 ఫోర్లతో 151 పరుగులు చేశాడు. అతని విధ్వంసకర శతకంతో ఈ మ్యాచ్‌లో కర్ణాటక ఘన విజయం సాధించింది.

విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 357 పరుగులు చేసింది. సమీర్ భండారి, యశ్ పంజ్‌వాని జోడీ ఐదో వికెట్‌కు 217 పరుగుల భారీ భాగస్వామ్యంతో ఆధిపత్యం చెలాయించింది. ఆ తర్వాత కర్ణాటక టీమ్ 358 పరుగుల చేసి విజయాన్ని అందుకుంది.

IND vs WI: అయ్యర్, గంభీర్‌కు కామన్‌సెన్స్ లేదు: అశ్విన్

IND vs WI: అయ్యర్, గంభీర్‌కు కామన్‌సెన్స్ లేదు: అశ్విన్

భారీ భాగస్వామ్యంతో

ఓపెనర్లు విఫలమైనా.. కెప్టెన్ అన్వే ద్రవిడ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. గుజరాత్ బౌలర్లను చీల్చి చెండాడాడు. ధ్రువ్ కృష్ణన్‌తో కలిసి మూడో వికెట్‌కు 204 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి కర్ణాటక విజయానికి బాటలు వేసాడు. ధ్రువ్ కృష్ణన్ ఔటైన తర్వాత కూడా దూకుడు కొనసాగించిన అన్వే ద్రవిడ్.. 44వ ఓవర్‌లో 151 పరుగుల వద్ద వెనుదిరిగాడు.

Rahul Dravid s Son Anvay Dravid Smashes 151 Off 100 Balls With 23 Fours in Vinoo Mankad Trophy

అతను ఔటైనా..కర్ణాటక లక్ష్యాన్ని ఛేదించి 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఢిల్లీతో జరిగిన గత మ్యాచ్‌లో అన్వే ద్రవిడ్ 41 బంతుల్లో 85 పరుగులు చేశాడు. దాంతో ఆ మ్యాచ్‌లో కర్ణాటక 418 పరుగులు చేసి భారీ విజయాన్ని అందుకుంది. గతేడాది అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత అండర్ 19 తరఫున అరంగేట్రం చేసిన అన్వే ద్రవిడ్ తన జోరును కొనసాగిస్తున్నాడు.

IND vs WI ఆఖరి టీ20కి భువనేశ్వర్ కుమార్.. గాయంతో అర్ష్‌దీప్ సింగ్ ఔట్!

Also Read

IND vs WI ఆఖరి టీ20కి భువనేశ్వర్ కుమార్.. గాయంతో అర్ష్‌దీప్ సింగ్ ఔట్!

సెహ్వాగ్ కొడుకు సైతం..

నవంబర్‌లో జరగనున్న అండర్ 19 ఆసియా కప్ జట్టులో అన్వే ద్రవిడ్‌కు చోటు దక్కవచ్చు. ఇదే టోర్నీలో వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో 143 బంతుల్లో 19 ఫోర్లు, 8 సిక్సర్లతో 173 పరుగులు చేశాడు. అతను కూడా అండర్ 19 ఆసియా కప్‌కు ఎంపికయ్యే ఛాన్స్ ఉంది.

Story first published: Friday, October 16, 2026, 18:49 [IST]
Other articles published on Oct 16, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+