Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కొత్త కుర్రాళ్లకు ఫీల్డింగ్ స్కిల్స్ లేవు: టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్

భారత్ ఫీల్డింగ్ ప్రమాణాలు అత్యంత దారుణంగా పడిపోయాయని మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ అన్నాడు. ముఖ్యంగా జట్టులోకి వచ్చే కుర్రాళ్ల‌కు ఫీల్డింగ్ స్కిల్స్ ఏ మాత్రం లేవని అభిప్రాయపడ్డాడు. భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ తరహాలోనే ఫీల్డింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పాడు.

వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో భారత ఆటగాళ్లు చాలా క్యాచ్‌లు వదిలేసారు. రెండో టీ20లో మయాంక్ యాదవ్ వదిలేసిన క్యాచ్ ఓటమికి కారణమైంది. వెస్టిండీస్‌తో మూడో టీ20లో భారత్ విజయం సాధించినప్పటికీ.. స్టార్ స్పోర్ట్స్ షోలో టీమిండియా ఫీల్డింగ్‌పై ఆర్ శ్రీధర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. గత 18 నెలలుగా భారత ఫీల్డింగ్‌ ప్రమాణాలు తగ్గిపోయాయని అభిప్రాయపడ్డాడు.

IND vs WI: అతని బ్యాటింగే గెలిపించింది: శ్రేయస్ అయ్యర్

IND vs WI: అతని బ్యాటింగే గెలిపించింది: శ్రేయస్ అయ్యర్

'భారత్ టీ20 ప్రపంచ కప్ గెలిచినప్పటికీ.. ఆ టోర్నీలో మన ఫీల్డింగ్ ఏమాత్రం గొప్పగా లేదు. మెగా టోర్నీ సెమీఫైనల్లో అక్షర్ పటేల్ ఆ అద్భుతమైన క్యాచ్ అందుకోపోయి ఉంటే భారత్ పరిస్థితి దారుణంగా ఉండేది. కాబట్టి భారత జట్టు వీలైనంత త్వరగా ఫీల్డింగ్‌పై దృష్టి పెట్టాలి.

Former India Coach R Sridhar Says Young Players Entering the Squad Are Undercooked in Fielding

జట్టు‌లో బ్యాటింగ్, బౌలింగ్‌కు ఇచ్చేంత ప్రాధాన్యత లేదా ప్రత్యేకమైన కల్చర్ ఫీల్డింగ్‌కు ఇవ్వడం లేదు. ఫీల్డింగ్ విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్‌కు, ఆటగాళ్లకు శ్రద్ధ తగ్గడం స్పష్టంగా కనిపిస్తోంది. జట్టులోకి వస్తున్న కొత్త కుర్రాళ్ల ఫీల్డింగ్ స్కిల్స్ సరిగ్గా లేకపోవడం నిజంగా ఆందోళన కలిగించే అంశం. ఈ కొత్త కుర్రాళ్లలో కొందరు ఫాస్ట్ బౌలర్లు.. కొందరు బ్యాటర్లు ఉన్నారు. కానీ ఎవరొచ్చినా కూడా విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ స్థాయిలో ఫీల్డింగ్ చేయలేకపోతున్నారు.

IND vs WI: పోలీస్ నిఘాలో ఉప్పల్ మ్యాచ్.. మఫ్టీలో షీ టీమ్స్: సీపీ సుమతి

Also Read

IND vs WI: పోలీస్ నిఘాలో ఉప్పల్ మ్యాచ్.. మఫ్టీలో షీ టీమ్స్: సీపీ సుమతి

కొత్తగా వచ్చే ప్లేయర్లు కేవలం ఒకే ఒక స్కిల్ బ్యాటింగ్ లేదా బౌలింగ్‌పైనే దృష్టి పెడుతున్నారు. ఇది కేవలం భారత టీమ్ ఆలోచించాల్సిన విషయమే కాదు. మన దేశీయ క్రికెట్ వ్యవస్థ మొత్తం మేల్కొని మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.'అని ఆర్ శ్రీధర్ అభిప్రాయపడ్డాడు.

Story first published: Monday, October 12, 2026, 21:01 [IST]
Other articles published on Oct 12, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+