అతని బౌలింగ్ టీమిండియాకు ప్లస్ పాయింట్: అశ్విన్
టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ నమన్ ధీర్‌పై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కాకపోయినా.. నమన్ ధీర్ బౌలింగ్ చాలా మెరుగైందని కొనియాడాడు. భారత్ ప్రధాన ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్నాడని ప్రశంసించాడు.
వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో వాషింగ్టన్ సుందర్ స్థానంలో జట్టులోకి వచ్చిన నమన్ ధీర్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. తొలి టీ20లో మూడు వికెట్లు.. మూడో టీ20లో రెండు వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా మూడో టీ20లో భారత్ విజయానికి బాటలు వేసాడు.

తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా నమన్ ధీర్ బౌలింగ్ గురించి మాట్లాడిన అశ్విన్..ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నమన్ ధీర్ బౌలింగ్ భారత్‌కు అదనపు ప్రయోజనాన్ని ఇస్తుందని చెప్పాడు. 'నమన్ ధీర్ స్పెషలిస్ట్ ఆఫ్ స్పిన్నర్ కాదు. కానీ అతని బౌలింగ్‌లో గణనీయమైన మెరుగుదల కనిపిస్తోంది. అతను నిర్భయంగా బౌలింగ్ చేస్తున్నాడు. అతను భారత్‌కు మరో ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్నాడు. మూడో టీ20లో కొన్ని అదనపు పరుగులు ఇచ్చినప్పటికి షిమ్రాన్ హెట్‌మైర్‌ను ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.
అతను తన బౌలింగ్‌ను తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాననే సంకేతాలు ఇచ్చాడు. ఇండోర్ గ్రౌండ్‌లో బౌలర్ రన్‌వే కొంచెం ఒంపుగా.. పిచ్ కాస్త ఎత్తుగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో బంతిని నేలకు తాకేందుకు సమయం పడుతుంది. దాంతో బంతి కొంచెం పుల్లర్‌గా వెళ్లే అవకాశం ఉంది. అతను విభిన్నమైన పరిస్థితుల్లో బౌలింగ్ చేస్తూ.. సహజంగానే చాలా నేర్చుకుంటాడు. అన్నింటికన్నా ముఖ్యంగా.. అతనికి నేర్చుకోవాలనే తపన ఉంది.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
నమన్ ధీర్ ఇప్పటి వరకు 3 ఇన్నింగ్స్‌లు ఆడి 10.55 ఎకానమీ రేటుతో 5 వికెట్లు పడగొట్టాడు. అతని అత్యుత్తమ బౌలింగ్3/31. నమన్ ధీర్ తన తదుపరి మ్యాచ్‌ను అక్టోబర్ 14న హైదరాబాద్ వేదికగా జరిగే నాలుగో టీ20లో ఆడనున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


