భారత అత్యుత్తమ క్రికెటర్ సచిన్.. కోహ్లీ కంటే బుమ్రా బెస్ట్!
భారత అత్యుత్తమ క్రికెటర్ సచిన్ టెండూల్కరేనని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లీ కంటే జస్‌ప్రీత్ బుమ్రా గొప్ప క్రికెటర్ అని చెప్పుకొచ్చాడు. ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫోతో సరదాగా సాగిన ఇంటారక్షన్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన వివిధ తరాల ఆటగాళ్లలో గొప్ప ప్లేయర్ ఎవరని అడగ్గా.. అశ్విన్ ఆసక్తికర సమాధానం చెప్పాడు. ఆల్‌టైమ్ ప్లేయర్ల బ్రాకెట్‌లో అశ్విన్ ఆసక్తికర రీతిలో ఆటగాళ్లను ఎంచుకున్నాడు.
ప్లేయర్-టూ ప్లేయర్ మధ్య సాగిన ఈ ఆసక్తికర చర్చలో అశ్విన్ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో కోహ్లీ, బుమ్రా పేరు రాగా.. అశ్విన్ తీవ్రంగా ఆలోచించి బుమ్రాను ఎంచుకున్నాడు. 'అమ్మో.. టెస్ట్ క్రికెట్. విరాట్ కోహ్లీ ఒక అద్భుతమైన దిగ్గజం. అతను చాలా బాగా ఆడాడు. ఈసారికి నేను జస్‌ప్రీత్ బుమ్రావైపే మొగ్గు చూపుతాను. నేను కూడా ఓ బౌలర్ కావడంతోనే పక్షపాతంగా ఈ నిర్ణయాన్ని వెల్లడించానేమో'అని తెలిపాడు.

జడేజా, ధోనీలో ఎవరు బెస్ట్ అంటే.. 'ఓరి దేవుడా నాకు ఇదేం పరీక్ష. ధోనీ వర్సెస్ జడేజాలో నా ఓటు జడేజాకే వేయాలని ఉంది. కానీ కెప్టెన్సీ, వన్డే, టెస్ట్ క్రికెట్‌లో జట్టును నంబర్ వన్‌గా నడిపించిన ధోనీనే నేను ఎంచుకుంటా. జడేజాను ఎన్నుకోవాలనిపించింది. కానీ ధోనీని ఎంచుకోవడమే కరెక్ట్'అని అశ్విన్ బదులిచ్చాడు.
అయితే ఈ నిర్ణయానికి అశ్విన్ ఎక్కువసేపు కట్టుబడలేదు. క్వార్టర్ ఫైనల్లో ధోనీ, సెహ్వాగ్ పేరు రాగా.. అశ్విన్ ధోనీని విస్మరించాడు. సెహ్వాగ్‌నే ఎంచుకున్నాడు. అంతకుముందు సునీల్ గవాస్కర్, సెహ్వాగ్‌లో ఎవరు బెస్ట్ అంటే మాజీ డాషింగ్ ఓపెనర్‌కే ఓటేసాడు. మూడు ఫార్మాట్లను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. సునీల్ గవాస్కర్‌ను విస్మరించడం అన్యాయమేనని తెలిపాడు.
విజయ్ హజారే కంటే సచిన్ గొప్ప అని చెప్పిన అశ్విన్.. రోహిత్ కంటే కోమ్లీ, వినూమన్కడ్ కంటే రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే కంటే బుమ్రా, తన కంటే సౌరవ్ గంగూలీ బెస్ట్ అని చెప్పుకొచ్చాడు. ఈ ప్లేయర్ల బ్రాకెట్ ముందుకు సాగుతున్నా కొద్దీ.. సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్ ఫైనల్ చేరగా.. ఈ ఇద్దరిలే క్రికెట్ గాడ్ అత్యుత్తమ క్రికెటర్ అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

