Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ENG vs PAK: ఒరేయ్ ఆజామూ.. ఏమీరా నీ వల్ల ఉపయోగం!

పాకిస్థాన్ టెస్ట్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తీవ్రంగా నిరాశపర్చాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో 10 బంతులే ఆడిన బాబర్ ఆజామ్ 8 పరుగులే చేసి జోష్ టంగ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. గాయంతో తొలి టెస్ట్‌కు దూరంగా ఉన్న బాబర్ ఆజామ్.. రెండో టెస్ట్‌లోనైనా జట్టును ఆదుకుంటాడని పాకిస్థాన్ అభిమానులు భావించారు.

IND vs SL: కోహ్లీ ఉంటే కథ వేరే ఉండేది బాస్: మాజీ క్రికెటర్

IND vs SL: కోహ్లీ ఉంటే కథ వేరే ఉండేది బాస్: మాజీ క్రికెటర్

కానీ అతను మాత్రం పేలవ బ్యాటింగ్‌తో తీవ్రంగా నిరాశపర్చాడు. దాంతో బాబర్ ఆజామ్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'ఒరేయ్ ఆజామూ.. ఏమీరా నీ వల్ల ఉపయోగం'అంటూ మండిపడుతున్నారు.

ENG vs PAK Babar Azam s Failure Adds to Pakistan s Batting Woes as They Fold for 110 in Lord s Test
Photo Credit: X (twitter)

మిగతా బ్యాటర్లు కూడా చేతులెత్తేయడంతో పాకిస్థాన్ 37.2 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌటైంది. అజాన్ అవైస్(102 బంతుల్లో 7 ఫోర్లతో 46), సౌద్ షకీల్(16) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్(4/11) నాలుగు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్(3/26) మూడు వికెట్లు పడగొట్టాడు. జోష్ టంగ్(2/27) రెండు వికెట్లు తీసాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌటైంది. జోర్డాన్ కాక్స్(55), జేమీ స్మిత్(61) హాఫ్ సెంచరీతో రాణించగా.. గస్ అట్కిన్సన్(45), జోష్ టంగ్(30 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. పాకిస్థాన్ బౌలర్లలో మహమ్మద్ అబ్బాస్(4/73) నాలుగు వికెట్లు తీయగా.. మహమ్మద్ అలీ(3/86) మూడు వికెట్లు పడగొట్టాడు. ఖుర్రమ్ షెహ్‌జాద్, అలీ ఉస్మాన్ తలో వికెట్ తీసారు.

IND vs SL: ముఖం చాటేసిన గౌతమ్ గంభీర్?

Also Read

IND vs SL: ముఖం చాటేసిన గౌతమ్ గంభీర్?

తొలి టెస్ట్‌లో పేలవ బ్యాటింగ్‌తో పాకిస్థాన్ ఇన్నింగ్స్ 103 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కనీసం 200 పరుగులు చేయలేకపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులు చేసిన పాక్.. రెండో ఇన్నింగ్స్‌లో 135 పరుగులే చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. రెండో టెస్ట్‌లోనూ పాకిస్థాన్ ఘోర పరాజయం దిశగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌కు 180 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

Story first published: Friday, August 28, 2026, 21:24 [IST]
Other articles published on Aug 28, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+