వన్డే, టీ20 టీమ్‌లో చోటు కోల్పోయినా.. రిషభ్ పంత్‌కు బుద్ది రాలేదు: అశ్విన్
టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరోసారి పేలవ షాట్లతో తీవ్రంగా నిరాశపర్చాడని మండిపడ్డాడు. రిషభ్ పంత్‌పై పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోయాడని అసహనం వ్యక్తం చేశాడు.
ఈ తరహా ఆటతోనే అతను వన్డే, టీ20 టీమ్‌లో చోటు కోల్పోయాడని అభిప్రాయపడ్డాడు. శ్రీలంక పర్యటనలో రిషభ్ పంత్ మెరుగైన ప్రదర్శనే చేశాడు. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో రెండు హాఫ్ సెంచరీలతో 168 పరుగులు చేశాడు. అయితే క్రీజులో సెట్ అయిన తర్వాత పేలవ షాట్లతో వికెట్ పారేసుకున్నాడు.
ఇంకా బుద్ది రాలేదు..
ఇదే విషయాన్ని తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన అశ్విన్.. రిషభ్ పంత్‌కు ఇంకా బుద్ది రాలేదని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 'రిషభ్ పంత్‌పై నేను పెట్టుకున్న అంచనాలను అతను అందుకోలేకపోయాడు. 52 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన పంత్ నుంచి నేను మరింత బాధ్యతాయుతమైన ఆటను ఆశించాను. అతను ఆడే ప్రమాదకరమైన ఆట ఎప్పుడూ జట్టుకు విజయాన్ని అందించదు.

సిడ్నీ, బ్రిస్బేన్ టెస్ట్‌ల్లో రిషభ్ పంత్ బాగా ఆడాడు. కానీ వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్‌ల సహకారం లేకుంటే భారత్ ఆ మ్యాచ్‌లు గెలిచేది కాదు. ఒక్క టెస్ట్ మ్యాచ్‌ను గెలవాలంటే 11 మంది ఆటగాళ్లు కావాలి. కానీ ఓటమికి ఒక తెలివితక్కువ నిర్ణయం చాలు. రిషభ్ పంత్ తన ఆటను పరిస్థితులకు తగ్గట్లు మార్చుకోవాలి.
ఆటగాడిగా రిషభ్ పంత్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ ఫార్మాట్ పరిస్థితులకు తగ్గట్లు ఆడటమే కీలకం. సెహ్వాగ్, గిల్ క్రిస్ట్ కూడా దూకుడుగా ఆడారు. కానీ జట్టు 500 పరుగుల వెనుకంజలో ఉన్నప్పుడు నిర్లక్ష్యపు షాట్‌తో ఈ ఇద్దరూ వెనుదిరగలేదు.
ముందు పంత్‌ను లేపడం ఆపండి..
రిషభ్ పంత్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఆపేయాలి. అతను అసాధారణ ప్రతిభావంతుడు.. తరానికి ఒక్కడు అనే మాటలు కూడా మాట్లాడవద్దు. యశస్వి జైస్వాల్ కూడా గొప్ప ప్రతిభావంతుడే. జట్టులో ప్రతీ ఒక్కరికీ సమాన అవకాశాలు, మద్దతు ఇవ్వాలి.
రిషభ్ పంత్‌కు 50 టెస్ట్‌లు ఆడిన అనుభవం ఉంది. అతను బాధ్యత తీసుకొని ఆడాలి. అతని అనాలోచిత నిర్ణయాలు, షాట్ల ఎంపిక కారణంగానే టీ20, వన్డే ఫార్మాట్లకు దూరమయ్యాడు. అతనికి నిజం చెప్పిన రోజే మూడు ఫార్మాట్లలో గొప్ప ఆటగాడిగా ఎదుగుతాడు.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

