Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కెప్టెన్‌గా పృథ్వీ షా!

టీమిండియా వెటరన్ ఓపెనర్ పృథ్వీ షాకు సారథ్య బాధ్యతలు దక్కాయి. ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ 2026లో అతను మహరాష్ట్ర జట్టును నడిపించనున్నాడు. ఈ టోర్నీ తొలి మ్యాచ్ కోసం మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ తమ జట్టును ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. జట్టుకు దూరమవడంతో తొలి మ్యాచ్‌కు పృథ్వీ షాను కెప్టెన్‌గా ఎంపిక చేశారు.

Akriti Agarwal: మా ఆయన బంగారం: ఫృథ్వీ షా ఫియాన్సీ

Akriti Agarwal: మా ఆయన బంగారం: ఫృథ్వీ షా ఫియాన్సీ

రుతురాజ్ గైక్వాడ్ భారత్-ఏ సారథిగా.. పుదెచ్చరి వేదికగా ఆస్ట్రేలియా-ఏతో మూడు అనధికారిక వన్డేలు ఆడనున్నాడు. ఈ వన్డే సిరీస్ అక్టోబర్ 6, 9, 11 తేదీల్లో జరగనుంది. మహారాష్ట్ర ఆల్‌రౌండర్ అర్షిన్ కురకర్ణి కూడా భారత్- ఏ జట్టులోనే భాగం కావడంతో తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. అక్టోబర్ 11 నుంచి రంజీ ట్రోఫీ 2026-27 సీజన్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

Prithvi Shaw to Captain Maharashtra in Ranji Trophy 2026-27 Opener Against Services

కెప్టెన్‌గా గొప్ప రికార్డ్..

గత సీజన్‌కు ముందు పృథ్వీ షా మహారాష్ట్ర జట్టులో చేరిన సంగతి తెలిసిందే. ఆ సీజన్‌లో పృథ్వీ షా 537 పరుగులు చేసి మహారాష్ట్ర తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్‌గా పృథ్వీ షాకు మంచి రికార్డ్ ఉంది. అతని సారథ్యంలో భారత జట్టు 2018 అండర్ 19 ప్రపంచకప్ గెలిచింది. అంతేకాకుండా ముంబై జట్టును విజయ్ హాజారే ట్రోఫీ విజేతగా నిలవడమే కాకుండా.. 2021-22 రంజీ ట్రోఫీ సీజన్‌లో ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఈ రంజీ సీజన్‌లో మహారాష్ట్ర తన తొలి మ్యాచ్‌‌ను సర్వీసెస్ జట్టుతో అక్టోబర్ 11 నుంచి ఆడనుంది.

మహారాష్ట్ర రంజీ టీమ్..

పృథ్వీ షా(కెప్టెన్), సచిన్ దాస్, దిగ్విజయ్ పాటిల్, అంకిత్ బవానే, హర్షల్ కేట్, సిద్దేష్ వీర్, సౌరభ్ నవలే(కీపర్), విక్కీ ఓస్త్వాల్, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్, ముఖేష్ చౌదరి, ప్రదీప్ దాధే, తనయ్ సంఘ్వీ, వైభవ్ డార్కుండే, హితేష్ వాలుంజ్, రిషికేష్ సోనావానే, అథర్వ ధర్మాదికారి.

పాపం పృథ్వీ షా.. కెరీర్‌తో పాటు లవ‌ర్ కూడా పాయే!

Also Read

పాపం పృథ్వీ షా.. కెరీర్‌తో పాటు లవ‌ర్ కూడా పాయే!

పృథ్వీ షా పెళ్లి పెటాకులు..

నటి ఆకృతి అగర్వాల్‌తో జరగాల్సిన పృథ్వీ షా పెళ్లి రద్దయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో ఈ ఇద్దరికి నిశ్చితార్థం జరగగా.. పెళ్లి పీటలెక్కక ముందే వీరి బంధం ముగిసింది. తమ లక్ష్యాలు భిన్నంగా ఉండటంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామని ఆకృతి అగర్వాల్ తన ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చింది. పృథ్వీ షా మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు.

Story first published: Monday, October 5, 2026, 12:47 [IST]
Other articles published on Oct 5, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+