Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Akriti Agarwal: మా ఆయన బంగారం: ఫృథ్వీ షా ఫియాన్సీ

టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా పెళ్లి పెటాకులైనట్లు వస్తున్న వార్తలను అతని ఫియాన్సీ(కాబోయే భార్య) ఆకృతి అగర్వాల్ ఖండించారు. పృథ్వీ షా చాలా మంచోడని, తమ పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారం ఊహాగానాలేనని కొట్టిపారేశారు. తమ మధ్య ప్రేమ తప్పా ఎలాంటి విభేదాలు లేవని, సంతోషంగా ఉన్నామని సోషల్ మీడియా వేదికగా స్పష్టతను ఇచ్చారు. పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్‌కు ఈ ఏడాది మార్చిలోనిశ్చితార్థం అయిన సంగతి తెలిసిందే.

IND vs ENG: వైభవ్ సూర్యవంశీకి గాయం.. నెట్స్‌లో కుప్పకూలిన బుడ్డోడు!(వీడియో)

IND vs ENG: వైభవ్ సూర్యవంశీకి గాయం.. నెట్స్‌లో కుప్పకూలిన బుడ్డోడు!(వీడియో)

నేను మోసపోయాను..

రెండు రోజుల క్రితం ఆకృతి అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పెట్టిన పోస్ట్‌లు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. 'నేను చాలా సార్లు మోసపోయా. కానీ ఒక్క మాట కూడా అనలేదు. అతనితో కలిసి జీవితంలో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాక ఇదంతా నమ్మలేకపోతున్నా. అతని గురించి సోషల్ మీడియాలో చూసిందంతా నిజమే. వందంతులన్నీ వాస్తవమే'అని రాసుకొచ్చింది.

Akriti Agarwal Shuts Down Breakup Rumours with Prithvi Shaw We Are Still Engaged and Happy Together

ఈ పోస్ట్‌ల్లో పృథ్వీ షాతో పాటు ఎవరి పేర్లను ఆమె ప్రస్తావించలేదు. పృథ్వీ షాను అన్‌ఫాలో చేయని ఆకృతి.. అతనితో ఉన్న ఫొటోలనూ కూడా తొలగించలేదు. కానీ పృథ్వీ షాను ఉద్దేశించే ఈ పోస్ట్‌లు పెట్టిందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఈ ఇద్దరి పెళ్లి పెటాకులైందని వార్తలు కూడా వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో ఆకృతి స్పందించింది.

అందుకే రజత్ పాటిదార్‌కు అవకాశం ఇవ్వడం లేదు: ఆకాశ్ చోప్రా

అందుకే రజత్ పాటిదార్‌కు అవకాశం ఇవ్వడం లేదు: ఆకాశ్ చోప్రా

పృథ్వీ షా గురించి కాదు..

'అపార్థం చేసుకున్నారు'అని ఒక పోస్ట్ పెట్టింది. అయినా ఈ వార్తలు ఆగకపోవడం..పృథ్వీ షా ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉండటంతో క్లారిటీ ఇచ్చింది. 'ఒక విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నాను. నేను ఎక్కడా నా కాబోయే భర్త పేరును ప్రస్తావించలేదు. అలాగే మా ఎంగేజ్‌మెంట్ రద్దయిందని గానీ, మేం విడిపోయామని గానీ చెప్పలేదు. ఆ పోస్ట్ పృథ్వీ షా గురించి పెట్టానని చాలా మంది భావించడం దురదృష్టకరం.

మేం కలిసి సంతోషంగా ఉన్నాం. మా బంధం కొనసాగుతోంది. కేవలం ఊహగానాల ఆధారంగా ఒక వ్యక్తి ప్రతిష్ట, గౌరవం ఎంత ఈజీగా దెబ్బతింటాయో ఈ సంఘన నాకు అర్థమయ్యేలా చేసింది. నేను పెట్టిన ఆ స్టోరీ నా క్లోజ్ ఫ్రెండ్స్ గురించి మాత్రమే. నేను చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల నేను అత్యంతగా ప్రేమించే వ్యక్తి తన పరువును కోల్పోయే పరిస్థితి వచ్చింది.'అని ఇన్‌స్టా స్టోరీ ఆకృతి వివరణ ఇచ్చాడు.

చెడు స్నేహాలతో..

అండర్ 19 ప్రపంచకప్ విజయంతో తారా జువ్వలా భారత క్రికెట్‌లోకి దూసుకొచ్చిన పృథ్వీ షా అంతే వేగంగా జట్టుకు దూరమయ్యాడు. గాయాలు, ఫిట్‌నెస్ సమస్యలతో పాటు చెడు స్నేహాలు పృథ్వీ షా కెరీర్‌ను నాశనం చేశాయి. దాంతో భారత క్రికెట్ ముఖ చిత్రంగా ఎదుగుతాడని భావించిన పృథ్వీ షా.. ఐపీఎల్‌ టీమ్‌లో కూడా చోటు దక్కించుకోలేని దయనీయస్థితికి చేరాడు. దేశవాళీ స్టార్‌గానే కెరీర్‌ను ముగించే దిశగా సాగుతున్నాడు. 24 ఏళ్లకే పొట్ట, బట్టతో అంకుల్‌లా మారిపోయిన పృథ్వీ షా.. తన తప్పిదాలను తెలుసుకొని టీమిండియాలోకి పునరాగమనం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.

ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలంలో రూ.75 లక్షల కనీస ధరకు పృథ్వీ షాను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసినా.. అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కలేదు. అయినా దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తూ.. టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు పృథ్వీ షా ప్రయత్నిస్తున్నాడు.

Story first published: Tuesday, July 7, 2026, 12:52 [IST]
Other articles published on Jul 7, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+