వారి వల్ల బయటకు వెళ్లడమే మానేసాను: పృథ్వీ షా
ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ 2026-27 సీజన్లో పృథ్వీ షా సారథ్యంలోని మహారాష్ట్ర శుభారంభం చేసింది. సర్వీసెస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన మహారాష్ట్ర 127 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెగ్యులర్ కెప్టెర్ రుతురాజ్ గైక్వాడ్ అందుబాటులో లేకపోవడంతో పృథ్వీ షా జట్టును నడిపించాడు. తన అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్‌తో జట్టుకు అదిరిపోయే విజయాన్ని అందించాడు.
248 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా స్పిన్నర్ల సాయంతో కాపాడుకున్నాడు. బ్యాటర్‌గానూ తొలి ఇన్నింగ్స్‌లో 70 పరుగులతో రాణించాడు. ఈ మ్యాచ్ సమయంలో చాలా హుషారుగా కనిపించిన పృథ్వీ షా.. విజయానంతరం మాత్రం ఎవర్ని కలవకుండా ఒంటరిగా వెళ్లే ప్రయత్నం చేశాడు. టీమ్ బస్‌లో కాకుండా సొంత కారులో వెనుదిరిగేందుకు సిద్దమయ్యాడు. ఈ సమయంలో ఒకరిద్దరు రిపోర్టర్స్ పలకరించగా వారితో చిట్ చాట్ చేశాడు.

బయటకు వెళ్లడమే మానేసాను..
తాను బయటకు వెళ్లడమే పూర్తిగా మానేసానని, కుటుంబం, క్రికెట్ తప్పా ఏ విషయాలను పట్టించుకోవడం లేదని పృథ్వీ షా స్పష్టం చేశాడు. 'నేను ఎన్నడూ లేనంత కష్టపడుతున్నా. ప్రస్తుతానికి సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నా. నేను, నా క్రికెట్, నా ఫ్యామిలీ... ఈ మూడింటి పైనే నా ఫోకస్ అంతా. ఇవి తప్ప మిగతా విషయాలన్నింటినీ అస్సలు పట్టించుకోవట్లేదు.
బయటకు వస్తే పాపరాజీల (ఫోటోగ్రాఫర్ల) గోల ఎక్కువైపోయింది. అందుకే నాకు బయటకు వెళ్లడమే నచ్చట్లేదు. నాకంటూ వ్యక్తిగత జీవితం ఉంది. నా పర్సనల్ లైఫ్ నా ఇష్టం. ఇది కొందరికి నచ్చొచ్చు. మరికొందరికి నచ్చకపోవచ్చు. నా పర్సనల్ లైఫ్‌లోకి కెమెరాలు రావడం.. నన్ను ఫాలో అవ్వడం నాకు అస్సలు నచ్చడం లేదు.
వీడియో గేమ్స్ ఆడుతున్నా..
ఫ్రస్టేషన్ తగ్గించుకోవడానికి ఎక్కువగా వీడియో గేమ్స్ ఆడుతున్నా. అందులో GTA, FIFA, Tekkenతో పాటు క్రికెట్ కూడా ఆడుతా. క్రికెట్లో కెరీర్ మోడ్ క్రియేట్ చేసుకొని నా క్యారెక్టర్‌తోనే నేను ఆడుకుంటా. ఒకవేళ రియల్ లైఫ్‌లో నేను డకౌట్ అయినా లేదా తక్కువ రన్స్ చేసినా... గేమ్‌లోకి వెళ్లి నా క్యారెక్టర్‌తో 400 లేదా 500 రన్స్ కొట్టేస్తా. అది నాకొక రకమైన మోటివేషన్ ఇస్తుంది. చాలా సరదాగా ఉంటుంది.
ప్రస్తుతం అయితే నేను బయటకు వెళ్లడం లేదు. పూర్తిగా రూమ్‌కే పరిమితమైపోయా. ఒకవేళ బయటకు వెళ్లినా ఏదైనా డిన్నర్ చేసి వెంటనే వచ్చేస్తున్నా. రూమ్‌లోనే ఉంటూ ప్లే స్టేషన్ ఆడుకోవడం నాకు బాగా నచ్చింది. ఎలాగో నెట్‌ఫ్లిక్స్ లాంటివి చూడడానికి ఉన్నాయి. ఎక్కువగా ఆలోచించకుండా.. నా లైఫ్‌ను ఇలా ఎంజాయ్ చేస్తున్నా.'అని పృథ్వీ షా తెలిపాడు. తన ఫియాన్సీ ఆకృతి అగర్వాల్‌తో క్యాన్సిల్ అయిన ఎంగేజ్మెంట్ మళ్లీ సెట్ అయిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


