చెప్పుడు మాటలతో నిశ్చితార్థం రద్దు చేసుకున్నా: పృథ్వీ షా ఫియాన్సీ
టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా, అతని ఫియాన్సీ ఆకృతి అగర్వాల్ మళ్లీ ఒక్కటయ్యారు. తమ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించిన కొద్ది రోజులకే మళ్లీ కలిసి జీవించాలని ఈ జంట నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని నటి ఆకృతి అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. సన్నిహితుల చెప్పుడు మాటలతో పృథ్వీ షాను అపార్థం చేసుకున్నానని, అతనితో నేరుగా మాట్లాడిన తర్వాత అసలు విషయం అర్థమైందని ఆకృతి అగర్వాల్ ఆవేదన వ్యక్తం చేసింది.
సుదీర్ఘ పోస్ట్‌తో వివరణ..
సోమవారం ఇన్‌స్టా వేదికగా వ్యక్తిగత వివరణ పేరిట సుదీర్ఘ పోస్ట్‌ను పంచుకున్నారు. 'సన్నిహితుల చెప్పుడు మాటలు నన్ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. మా బంధం గురించి మా కన్నా ఎక్కువగా వారికే తెలుసన్నట్లుగా మాట్లాడారు. నేను కూడా పృథ్వీ షాతో ఏం చర్చించకుండానే ఓ నిర్ణయానికి వచ్చేశాను.

నా అనాలోచిత నిర్ణయం కారణంగా పృథ్వీ షాకు కలిగిన బాధకు పూర్తి బాధ్యత నాదే. మేమిద్దరం ఇప్పుడు అన్ని విషయాలపై మాట్లాడుకున్నాం. ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసి ప్రయాణించాలని నిర్ణయించుకున్నాం. మా భవిష్యత్తు మా నమ్మకం ప్రేమపైనే ఆధారపి ఉంటుంది. దయచేసి మా వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవించండి. దయచేసి ఊహాగానాలు ప్రచారం చేయవద్దు.'అని ఆకృతి అగర్వాల్ విజ్ఞప్తి చేసింది.
పృథ్వీ షా సైతం..
ఈ పోస్ట్‌ను పృథ్వీ షా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నాడు. తద్వారా ఆకృతితో బంధాన్ని కొనసాగించేందుకు తన అంగీకారాన్ని తెలియజేశాడు. ఈ జంటకు 2026 మార్చిలో నిశ్చితార్థం జరగ్గా.. వ్యక్తిగత లక్ష్యాలు, పరిస్థితులు వేరంటూ ఎంగేజ్‌మెంట్ రద్దు చేసుకున్నట్లు ఆకృతి ప్రకటించింది. ఇప్పుడు తమ మధ్య ఉన్న అపార్ధాలను తొలగించుకుని తమ బంధాన్ని కొనసాగించాలనుకుంటున్నట్లు వెల్లడించారు.
ఫిట్‌నెస్ సమస్యలు, చెడు స్నేహాలతో భారత జట్టుకు దూరమైన పృథ్వీ షా రీఎంట్రీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో మహారాష్ట్ర జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. సర్వీసెస్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో పృథ్వీ షా(73 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 70) హాఫ్ సెంచరీతో రాణించాడు. అతనికి తోడుగ అకింత్ బావ్నే(118) సెంచరీతో సత్తా చాటడంతో మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 333 పరుగులు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


