Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ZIM: ప్రతీకా రావల్ శతకం.. టీమిండియా ఘన విజయం!

జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా ఘనంగా ప్రారంభించింది. శుక్రవారం వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో సమష్టిగా రాణించిన భారత్ 9 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. ఓపెనర్ ప్రతీకా రావల్(96 బంతుల్లో 15 ఫోర్లతో 100 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగడంతో 137 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.

చాలా కాలంగా ఇదే తప్పు చేస్తున్నాం: హర్మన్ ప్రీత్ కౌర్

చాలా కాలంగా ఇదే తప్పు చేస్తున్నాం: హర్మన్ ప్రీత్ కౌర్

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 49.5 ఓవర్లలో 197 పరుగులకు ఆలౌటైంది. తెలుగు తేజం శ్రీచరణి(4/23) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. క్రాంతి గౌడ్(3/42) మూడు వికెట్లు పడగొట్టింది. దీప్తి శర్మ(2/44)కు రెండు వికెట్లు దక్కగా.. షెఫాలీ వర్మ ఒక వికెట్ తీసింది.

Pratika Rawal Unbeaten Century Shree Charani s 4 Wicket Haul Power India Women to 9-Wicket Win Over Zimbabwe

అనంతరం భారత్ 27.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 200 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. ప్రతీకా రావల్ అజేయ శతకానికి తోడుగా షేఫాలీ వర్మ(33 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64 నాటౌట్) విధ్వంసకర అర్ధశతకంతో చెలరేగింది. స్మృతి మంధాన(34 బంతుల్లో 4 ఫోర్లతో 32 నాటౌట్) పర్వాలేదనిపించింది. జింబాబ్వే బౌలర్లలో ఒలిండర్ చారే ఏకైక వికెట్ తీసింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

టీ20 సిరీస్ క్లీన్ స్వీప్.. స్మృతి మంధాన సెన్సేషనల్ కామెంట్స్!

Also Read

టీ20 సిరీస్ క్లీన్ స్వీప్.. స్మృతి మంధాన సెన్సేషనల్ కామెంట్స్!

ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత్.. వన్డే సిరీస్‌లోనూ అదే తరహా ప్రదర్శనను పునరావృతం చేసేందుకు సిద్దమైంది. కెప్టెన్‌గా తొలి టీ20 సిరీస్ గెలిచిన స్మృతి మంధాన.. ఇప్పుడు వన్డే సిరీస్‌పై కన్నేసింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం వడోదర వేదికగానే జరగనుంది.

షెఫాలీ వర్మ విధ్వంసం..

198 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. కెప్టెన్‌ స్మృతి మంధాన, ప్రతీకా రావల్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ప్రతీకా రావల్ కోసం షెఫాలీ వర్మ తన ఓపెనింగ్ స్లాట్‌ను త్యాగం చేసి ఫస్ట్ డౌన్‌లో బరిలోకి దిగింది. ఓపెనింగ్ జోడీ నిలకడగా ఆడగా.. ప్రతీకా రావల్ 54 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. తొలి వికెట్‌కు 94 పరుగులు జోడించిన అనంతరం కెప్టెన్ స్మృతి మంధాన ఔటైంది.

దాంతో క్రీజులోకి వచ్చిన షెఫాలీ వర్మ టీ20 తరహా బ్యాటింగ్‌తో జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడింది. తనకే సాధ్యమైన భారీ సిక్సర్లతో ఊచకోత కోసింది. కేవలం 29 బంతుల్లోనే షెఫాలీ వర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. ప్రతీకా రావల్ వరుసగా రెండు బౌండరీలు బాది 96 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుంది. కెరీర్‌లో ఆమెకు ఇది మూడో వన్డే సెంచరీ. షెఫాలీ వర్మ బౌండరీతో భారత్ విజయ లాంఛనాన్ని పూర్తి చేసింది.

Story first published: Friday, October 23, 2026, 20:22 [IST]
Other articles published on Oct 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+