టీ20 సిరీస్ క్లీన్ స్వీప్.. స్మృతి మంధాన సెన్సేషనల్ కామెంట్స్!
భారత మహిళల క్రికెట్ జట్టు జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌ను అద్భుతంగా రాణించి క్లీన్ స్వీప్ చేసింది. స్మృతి మంధాన కెప్టెన్సీలోని భారత మహిళల జట్టు చివరి మ్యాచ్‌లో 92 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. రాయ్‌పూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ అన్ని విభాగాల్లోనూ రాణించి సిరీస్‍ను కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో, రెండో మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్.. ఈ చివరి మ్యాచ్ లోనూ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ షెఫాలీ వర్మ కేవలం 37 బంతుల్లోనే 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులు చేసి అద్భుతమైన ఆరంభాన్నిచ్చింది. అలాగే అనుష్క శర్మ 20 బంతుల్లో 28 పరుగులు జోడించింది. జింబాబ్వే బౌలర్లలో బిలవడ్ బీజా 3 వికెట్లు పడగొట్టింది. భారత ఇన్నింగ్స్ లో మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి అందరినీ ఆకట్టుకున్నారు. మిడిలార్డర్‌లో బరిలోకి దిగిన హర్మన్‌ప్రీత్ కౌర్ కేవలం 41 బంతుల్లోనే 10 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 91 పరుగులు సాధించారు. ఆమె స్ట్రైక్ రేట్ 221.95గా ఉంది. ఈ దండయాత్ర కారణంగానే భారత్ సులభంగా 200 పరుగుల మార్కును దాటగలిగింది.

భారీ లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే జట్టుకు ఆదిలోని ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కేలిస్ ఖాతా తెరవకుండానే క్రాంతి గౌడ్ బౌలింగ్‌లో వెనుదిరిగింది. శారెన్ మేయర్స్(60), బిలవడ్ బీజా(44) మినహా మిగతా బ్యాటర్లందరూ విఫలమయ్యారు. జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లు అత్యంత కట్టుదిట్టంగా బౌలంగ్ చేసి జింబాబ్వేకు ఎక్కడా కోలుకునే అవకాశం ఇవ్వలేదు. బౌలింగ్‌లో నందిని శర్మ అద్భుతంగా రాణించి 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టింది. వీరితో పాటు క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, దీప్తి శర్మ, నికి ప్రసాద్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.
మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ స్మృతి మంధాన మాట్లాడుతూ.. జట్టు ఆటతీరుపై హర్షం వ్యక్తం చేశారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆటగాళ్లు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారని పేర్కొన్నారు. తొలి మ్యాచ్‌లో ఇబ్బంది పడినప్పటికీ.. తర్వాత మ్యాచ్‌లలో జట్టు పుంజుకున్న తీరు అభినందనీయమని వెల్లడించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 216 పరుగులు సాధించగా.. కెప్టెన్ స్మృతి మంధాన బ్యాటింగ్ పై ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. అనుష్కతో మొదలైన ఇన్నింగ్స్‌ను షెఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ కొనసాగించారని, ప్రతి ఒక్కరూ జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారని ఆమె పేర్కొన్నారు. ఫీల్డింగ్, బౌలింగ్‌లోనూ ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేశామని, ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అంశాలపై దృష్టి సారిస్తామని తెలిపారు.
తొలి మ్యాచ్‌లో టాపార్డర్, మిడిలార్డర్ రాణించలేకపోయినా, తర్వాత మ్యాచ్‌లలో బ్యాటర్లకు మంచి అవకాశం దక్కిందని స్మృతి మంధాన పేర్కొన్నారు. స్టేడియంలో ఎక్కువ సమయం గడపడం, పరుగుల ఖాతా తెరవడం జట్టుకు ఎంతో లాభసాటిగా మారిందని ఆమె అభిప్రాయపడ్డారు. టీ20 సిరీస్ తర్వాత అక్టోబర్ 25 నుంచి భారత్, జింబాబ్వే జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ వన్డే సిరీస్‌లోనూ ఇదే జోరును కొనసాగించాలని జట్టు భావిస్తున్నట్లు స్మృతి మంధాన తెలిపారు. తాము ప్రదర్శించిన ఆధిపత్యాన్నే వడోదర వేదికగా జరగనున్న వన్డేల్లోనూ రిపీట్ చేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


