IND vs NZ: న్యూజిలాండ్ పర్యటన.. గాయంతో స్టార్ పేసర్ ఔట్! భారత జట్లలో కీలక మార్పు!
న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్లలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. టీమిండియా పేసర్ ప్రసిధ్ కృష్ణ తొడ కండరాల గాయంతో ఐదు వన్డేల సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అతను పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో వన్డే జట్టు నుంచి సెలెక్టర్లు తప్పించారు.
ఈ విషయాన్ని బీసీసీఐ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రసిధ్ కృష్ణ మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించేందుకు మరికొంత సమయం పడుతుందని, రిటర్న్ టు ప్లే అసెస్‌మెంట్ పూర్తి చేసిన తర్వాత న్యూజిలాండ్ పర్యటనకు వస్తాడని బీసీసీఐ పేర్కొంది. రెండు టెస్ట్ సిరీస్‌కు సన్నాహకంగా న్యూజిలాండ్-ఏతో జరిగే మూడో, చివరి అనధికారిక టెస్ట్‌ల్లో భారత్-ఏ తరఫున బరిలోకి దిగుతాడని తెలిపింది.

మరోవైపు మహమ్మద్ సిరాజ్ అక్టోబర్ 31 నుంచి న్యూజిలాండ్-ఏతో జరిగే రెండో అనధికారిక టెస్ట్ ఆడేందుకు భారత్-ఏ జట్టులో చేరుతాడని బీసీసీఐ పేర్కొంది. టీ20, వన్డే, టెస్ట్ టీమ్‌లో భాగంగా ఉన్న యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని..చివరి రెండు వన్డేల నుంచి తప్పించి భారత్-ఏ జట్టులో చేర్చారు. టెస్ట్ సిరీస్‌కు సన్నాహకంగా అతను భారత్-ఏ తరఫున అనధికారిన టెస్ట్ సిరీస్ ఆడనున్నాడు.
భారత్-ఏ జట్టు(అప్‌డేటెడ్): యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, యశ్ రాథోడ్, ఆర్ స్మరణ్, ధ్రువ్ జురెల్(కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, శిఖర్ మోహన్, ముఖేష్ చౌదరి, ముఖేష్ కుమార్, మానవ్ సుతార్, కుమార్ కుశాగ్ర
తొలి మూడు వన్డేలకు భారత్ జట్టు: శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి.
చివరి రెండు వన్డేలకు భారత జట్టు: శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, నమన్ ధీర్, ఆకీబ్ నబీ, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, కుమార్ కుశాగ్ర, మహమ్మద్ సిరాజ్, యశ్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


