టీమిండియాలో అతను మరో బుమ్రా: హనుమ విహారి
టీమిండియా యువ పేసర్ ప్రిన్స్ యాదవ్‌పై వెటరన్ బ్యాటర్ హనుమ విహారి ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రిన్స్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని, బుమ్రా స్థాయి చేరుకుంటాడని జోస్యం చెప్పాడు. న్యూజిలాండ్ పర్యటనలో ప్రిన్స్ యాదవ్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా రెండు, మూడు మ్యాచ్‌లు ఆడిన ప్రిన్స్ యాదవ్.. కట్టడిగా బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా తన కచ్చితమైన యార్కర్లతో కివీస్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు.
ఈ సిరీస్‌ను భారత్ 3-0తో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ప్రిన్స్ యాదవ్ ప్రదర్శనపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన హనుమ విహారి..టీమిండియాను ఏలుతాడని కొనియాడాడు.

'ప్రిన్స్ యాదవ్ చాలా కీలకమైన ఓవర్లు వేస్తున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత్‌కు అతను సుదీర్ఘ కాలం సేవలు అందిస్తాడని అనిపిస్తుంది. ఇప్పుడే అతన్ని జస్‌ప్రీత్ బుమ్రాతో పోల్చను కానీ అతను కచ్చితంగా ఆ స్థాయికి చేరుకుంటాడు. మ్యాచ్‌పై మంచి ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. అతనికి కచ్చితమైన యార్కర్లు వేసే సామర్థ్యం ఉంది. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా మారగలడు.'అని హనుమ విహారి చెప్పుకొచ్చాడు.
ఇక మూడో టీ20లో వైభవ్ సూర్యవంశీని ఓపెనర్‌గా ఆడించడాన్ని విహారి ప్రత్యేకంగా కొనియాడాడు. 'వైభవ్‌తో ఓపెనింగ్ చేయించడం మంచి నిర్ణయం. ఇషాన్ కిషన్ గైర్హాజరీలో వైభవ్ సూర్యవంశీకి ఓపెనింగ్ ప్లేస్ సరైనది. రెండో మ్యాచ్‌లో మిడిలార్డర్‌లో ఆడటానికి అతను తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు.
ఆఖరి మ్యాచ్‌కు ఇషాన్ కిషన్ అందుబాటులోకి వస్తే ఏం చేస్తారో..? సంజూ శాంసన్‌ను పక్కన పెడతారా? లేక వైభవ్‌ను తప్పిస్తారా? వైభవ్‌కు ఇంకా చాలా సమయం ఉంది. కాబట్టి సంజూ శాంసన్‌ను ఆడించడమే కరెక్ట్ అనేది నా అభిప్రాయం. సంజూ నిలకడగా ఆడుతున్నాడు. చివరి రెండు సిరీస్‌ల్లో రెండు మ్యాచ్‌లకు ఒక హాఫ్ సెంచరీ నమోదు చేస్తున్నాడు. కాబట్టి మేనేజ్‌మెంట్ అతనికే అవకాశం ఇవ్వాలి.'అని హనుమ విహారి అభిప్రాయపడ్డాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


