Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వన్డే ఫార్మాట్ అంత ఈజీ కాదు: ప్రసిధ్ కృష్ణ

వన్డే ఫార్మాట్ ఆడటం అంత ఈజీ కాదని టీమిండియా పేసర్ ప్రసిధ్ కృష్ణ అన్నాడు. ఈ ఫార్మాట్‌లో ఆటలోని వివిధ దశలకు అనుగుణంగా మారాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. భారత టెస్ట్, వన్డే ఫార్మాట్ జట్లలో రెగ్యులర్ సభ్యుడిగా మారిన ప్రసిధ్ కృష్ణ.. వన్డే ప్రపంచకప్ 2027 జట్టులో చోటు దక్కించుకోవడంపై ఫోకస్ పెట్టాడు. వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌కు ముందు జియో హాట్‌స్టార్‌‌తో మాట్లాడిన ప్రసిధ్ కృష్ణ తన ప్రిపరేషన్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

IND vs WI: కోహ్లీ, రోహిత్ రీఎంట్రీ.. వెస్టిండీస్‌తో తొలి వన్డే ఆడే భారత తుది జట్టు ఇదే!

IND vs WI: కోహ్లీ, రోహిత్ రీఎంట్రీ.. వెస్టిండీస్‌తో తొలి వన్డే ఆడే భారత తుది జట్టు ఇదే!

వన్డే ఫార్మాట్ ఈజీ కాదు..

'వన్డే ఫార్మాట్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. గేమ్‌లోని విధ దశలకు అనుగుణంగా ఆటగాళ్లు మారాల్సి ఉంటుంది కాబట్టి.. ఈ ఫార్మాట్ ఆడటం అంత ఈజీ కాదు. వన్డే ఫార్మాట్ చాలా కఠినమైనదని నా అభిప్రాయం. బౌలర్లకు మూడు దశల్లోనూ రాణించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పవర్‌ప్లే మరింత సవాల్‌గా ఉంటుంది. కఠిన పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేవారు చాలా తక్కువ మంది ఉంటుంది. నేను ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను.

Prasidh Krishna Calls ODI Cricket the Toughest Format Ahead of West Indies Series

వన్డే క్రికెట్ ఎక్సైటింగ్‌గా ఉంటుంది. ముఖ్యంగా సౌతాఫ్రికా‌లో జరిగబోయే ప్రపంచ కప్ ఫాస్ట్ బౌలర్లకు మరింత ఉత్సాహాన్నిస్తుంది. ఈ రోజుల్లో హై స్కోరింగ్ గేమ్స్ సర్వసాధారణమైపోయాయి. 300, 350 పరుగులు ఇప్పుడు సాధారణ స్కోర్లుగా మారాయి. కానీ బౌలర్లుగా మాకు ఉన్న సవాలు ఏంటంటే.. ప్రత్యర్థిని వీలైనంత వరకు కట్టడి చేయడం, జట్టు విజయానికి కావాల్సిన విభిన్న వ్యూహాలతో ముందుకు రావడం.

IND vs SL: మలుపు తిప్పిన మానవ్ సుతార్, ప్రసిధ్ కృష్ణ.. గెలుపు ముంగిట భారత్!

Also Read

IND vs SL: మలుపు తిప్పిన మానవ్ సుతార్, ప్రసిధ్ కృష్ణ.. గెలుపు ముంగిట భారత్!

బౌలర్లకు కఠిన పరీక్ష..

న్యూజిలాండ్ పర్యటన పూర్తిగా భిన్నంగా ఉంటుంది. క్రికెట్ ఆడటానికి చాలా అందమైన ప్రదేశం. కానీ అక్కడి కండిషన్స్ బౌలర్లను అన్ని విధాలు పరీక్షిస్తాయి. బౌలర్ల నైపుణ్యం, ఓర్పు, సెషన్ తర్వాత సెషన్‌కు పుంజుకునే సామర్థ్యాలకు సవాల్ విసురుతాయి. ప్రస్తుతానికి మేం బేసిక్స్‌పైనే ఫోకస్ పెడుతున్నాం. న్యూజిలాండ్ చేరుకున్న తర్వాత అక్కడి కండిషన్స్‌‌కు తగ్గట్లు సన్నదమవుతాం.

అన్ని రకాల నైపుణ్యాలతో సన్నద్ధమవుతున్నాం. ఫాస్ట్ బౌలర్లకు న్యూజిలాండ్‌లో కఠిన పరీక్ష తప్పదు. ఉపఖండంతో పోలిస్తే న్యూజిలాండ్‌లో పేసర్ల నుంచి చాలా ఎక్కువ ఆశిస్తారు. నేను ఎదురుచూస్తున్న సవాలు కూడా అదే.'ప్రసిధ్ కృష్ణ చెప్పుకొచ్చాడు. 2021లో అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేసిన ప్రసిధ్ కృష్ణ.. ఇప్పటి వరకు 28 వన్డేలు ఆడి 50 వికెట్లు తీసాడు.

Story first published: Friday, September 25, 2026, 19:40 [IST]
Other articles published on Sep 25, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+