Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: మలుపు తిప్పిన మానవ్ సుతార్, ప్రసిధ్ కృష్ణ.. గెలుపు ముంగిట భారత్!

శ్రీలంకతో రెండో టెస్ట్‌లో టీమిండియా గెలుపు ముంగిట నిలిచింది. 213 పరుగుల భారీ లోటుతో ఫాలో ఆన్ ఆడిన శ్రీలంక నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 72.4 ఓవర్లలో 6 వికెట్లకు 229 పరుగులు చేసింది. క్రీజులో కేశర నువాంత(3 బ్యాటింగ్), సోనాల్ దినుషా(7 బ్యాటింగ్) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో ఆకట్టుకున్న సోనాల్ దినుషాను ఔట్ చేస్తే భారత విజయం లాంఛనం కానుంది. ప్రస్తుతం శ్రీలంక 16 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఆఖరి రోజైన గురువారం శ్రీలంకను వీలైనంత త్వరగా ఆలౌట్ చేస్తే భారత్ విజయం సులువు అవుతుంది. అయితే వర్షం ముప్పు పొంచి ఉండటం టీమిండియాను ఆందోళనకు గురిచేస్తోంది. వర్షం కరుణిస్తే విజయం భారత్ సొంతమవ్వనుంది.

IND vs SL Manav Sutar and Prasidh Krishna Take Crucial Wickets as India Closer to Victory in Colombo Test

శ్రీలంక 290 ఆలౌట్..

అంతకుముందు 265/8 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 89.4 ఓవర్లలో 290 పరుగులకు కుప్పకూలింది. ఓవర్‌నైట్ బ్యాటర్ సోనాల్ దినుషా(162 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 103) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శ్రీలంక చివరి రెండు వికెట్లను అరంగేట్ర స్పిన్నర్ సారాన్ష్ జైన్ దక్కించుకున్నాడు. ప్రసిధ్ కృష్ణ(3/52), మానవ్ సుతార్(3/85) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. ఓవర్‌నైట్ స్కోర్‌కు శ్రీలంక 25 పరుగులు మాత్రమే జోడించింది.

శుభ్‌మన్ గిల్ వ్యూహం..

ఈ టెస్ట్ విజయంపై ఫోకస్ పెట్టిన భారత్ వ్యూహాత్మకంగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించకుండా శ్రీలంకను ఫాలో ఆన్ ఆడించింది. రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే శ్రీలంకకు సిరాజ్ గట్టి షాకిచ్చాడు. లాహిరు ఉడానా(3)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. పసిందు సూర్యబండార, కామిల్ మిశ్రా ఆచితూచి ఆడారు. 58 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో సెట్ అయిన ఈ జోడీని జడేజా విడదీసాడు. కామిల్ మిశ్రా(32)ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి కామిందు మెండిస్ రాగా.. శ్రీలంక 83/2 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

సెకండ్ సెషన్‌లో శ్రీలంక ఆధిపత్యం చెలాయించింది. సూర్య బండార, కామిందు మెండీస్ ఆచితూచి ఆడారు. ఈ ఇద్దరూ సాధికారికంగా బ్యాటింగ్ చేస్తూ..భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచారు.

మలుపు తిప్పిన మానవ్ సుతార్, ప్రసిధ్ కృష్ణ

పసిందు సూర్యబండార 78 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా.. కామిందు మెండీస్ 87 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. 115 పరుగుల భారీ భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని ప్రసిధ్ కృష్ణ విడదీసాడు. శుభ్‌మన్ గిల్ స్టన్నింగ్ క్యాచ్‌తో కామిందు మెండీస్‌ను పెవిలియన్ చేర్చాడు. ఈ వికెట్‌తో ప్రసిధ్ కృష్ణ మ్యాచ్‌ను భారత్‌వైపు తిప్పాడు. కెప్టెన్ ధనంజయ డిసిల్వా క్రీజులోకి రాగా.. శ్రీలంక 199/3 స్కోర్‌తో టీ బ్రేక్‌కు వెళ్లింది.

మూడో సెషన్‌లో భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. ఆచితూచి ఆడిన ధనంజయ డిసిల్వా(23)తో పాటు సెంచరీ దిశగా సాగిన పసిందు‌ సూర్యబండార(173 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 92)ను మానవ్ సుతార్ వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే నిరోషన్ డిక్‌వెల్లాను సరాన్ష్ జైన్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. సోనాల్ దినుషా, కేశర నువాంత మరో వికెట్ పడకుండా నాలుగో రోజు ఆటను ముగించారు.

Story first published: Wednesday, August 26, 2026, 18:07 [IST]
Other articles published on Aug 26, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+