Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. మహిళల మాజీ కోచ్‌కు సెలెక్టర్ పదవి!

భారత పురుషుల క్రికెట్ టీమ్ చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా ఎంపికయ్యాడు. అజిత్ అగార్కర్ స్థానంలో ఓజా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇప్పటికే తాత్కలిక చీఫ్ సెలెక్టర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఓజా.. ఇక నుంచి పూర్తి స్థాయిలో బాధ్యతలు స్వీకరించనున్నాడు. మాజీ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవి కాలం అక్టోబర్ 4న ముగిసిన సంగతి తెలిసిందే. తన పదవి కాలాన్ని పొడిగించుకునేందుకు ఆసక్తి చూపకపోవడంతో బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది.

IND vs NZ: వైభవ్ వాటర్ అందించాల్సిందే.. న్యూజిలాండ్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

IND vs NZ: వైభవ్ వాటర్ అందించాల్సిందే.. న్యూజిలాండ్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

అజిత్ అగార్కర్ నిష్క్రమణతో ఖాళీ అయిన వెస్ట్ జోన్ సెలెక్టర్ పదవికి టీమిండియా మహిళల మాజీ కోచ్ రమేశ్ పవార్‌తో పాటు వసీం జాఫర్ దరఖాస్తు చేసుకున్నారు. కానీ రమేశ్ పవార్‌నే బీసీసీఐ ఎంపిక చేసింది. రమేశ్ పవార్ భారత్ తరఫున 2 టెస్ట్‌లు, 31 వన్డేలు ఆడాడు. భారత మహిళల జట్టుకు కోచ్‌గానూ పనిచేసిన అనుభవం ఉంది.

Pragyan Ojha replaces Ajit Agarkar as BCCI s selection committee chairman Ramesh Powar joins as West Zone Selector

వెస్ట్ జోన్ సెలెక్టర్‌గా పవార్ ఎంపికవ్వడంతో తాత్కలిక చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న ప్రజ్ఞాన్ ఓజాకు మార్గం సుముగమైంది. గతేడాది సెప్టెంబర్‌లోనే ప్రజ్ఞాన్ ఓజా సౌత్ జోన్ నుంచి సెలెక్టర్‌గా నియమితులయ్యాడు. భారత్ తరఫున 24టెస్ట్‌లు, 18 వన్డేలు, 6 టీ20లు ఆడాడు. ప్రజ్ఞాన్ ఓజా సారథ్యంలోని సెలెక్షన్ కమిటీనే 2027 వన్డే ప్రపంచకప్ జట్టును ఎంపిక చేయనుంది. ఇప్పటికే తాత్కలిక చీఫ్ సెలెక్టర్‌గా వెస్టిండీస్‌తో పాటు న్యూజిలాండ్ పర్యటనలకు ప్రజ్ఞాన్ ఓజా జట్లను ఎంపిక చేశాడు.

జీతం రూ.3 కోట్లు..?

బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ జీతానికి సంబంధించి అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ.. అజిత్ అగార్కర్‌ కోటి రూపాయాల వార్షిక వేతనం అందుకున్నట్లు వార్తలు వచ్చాయి.ఈ జీతాన్ని ప్రస్తుతం బీసీసీఐ మూడు రెట్లు చేసిందని ప్రచారం జరుగుతోంది. ది టెలిగ్రాఫ్ ఇండియా కథనం ప్రకారం.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవికి ఏడాదికి రూ. 3 కోట్ల జీతం ఇస్తున్నట్లు సమాచారం.

IND vs ZIM: మేం గెలిచినా.. ఆ విషయంలో మెరుగవ్వాలి: స్మృతి మంధాన

Also Read

IND vs ZIM: మేం గెలిచినా.. ఆ విషయంలో మెరుగవ్వాలి: స్మృతి మంధాన

ఈ జీతం గిట్టుబాటు కాదనే పార్దీవ్ పటేల్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు చేసుకోలేదని తెలుస్తోంది. చీఫ్ సెలెక్టర్ జీతాలకు సంబంధించి బీసీసీఐ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రజ్ఞాన్ ఓజాకు సంబంధించి జీతభత్యాల గురించి కూడా ఎక్కడా ప్రస్తావించలేదు.

Story first published: Monday, October 19, 2026, 19:09 [IST]
Other articles published on Oct 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+