భారత జట్టు నుంచి తప్పించిన సెలెక్టర్లు.. 47 బంతుల్లో 125 పరుగులతో విధ్వంసం!
అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో చోటు కోల్పోయిన యువ వికెట్ కీపర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. కేవలం 47 బంతుల్లోనే 125 పరుగులతో అజేయంగా నిలిచి సెలెక్టర్లకు దిమ్మతిరిగే షాకిచ్చాడు. 14 ఫోర్లు, 8 సిక్సర్లతో పరుగుల సునామీ సృష్టించాడు.
జింబాబ్వే పర్యటనకు వెళ్లిన భారత జట్టులో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఉన్నాడు. కానీ అతనికి ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషనే మూడు మ్యాచ్‌లు ఆడటంతో ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌కు అవకాశం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ను కొనసాగిస్తారని అంతా అనుకున్నారు. కానీ సంజూ శాంసన్ రీఎంట్రీ ఇవ్వడంతో ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌కు అవకాశం లేకుండా పోయింది.

ప్రస్తుతం పంజాబ్ వేదికగా జరుగుతున్న షేర్-ఏ-పంజాబ్ టీ20 లీగ్‌లో జలంధర్ వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రభ్‌సిమ్రాన్ సింగ్.. అమృత్ సుర్మాస్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. మోహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ కేవలం 41 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అమృత్‌సర్ సుర్మాస్ కెప్టెన్ అభిషేక్ శర్మ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టి మరి సెంచరీ మార్క్ అందుకున్నాడు. అతని విధ్వంసంతో జలంధర్ వారియర్స్ టీమ్ 16.2 ఓవర్లలో కేవలం 2 వికెట్ల నష్టానికి 264 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది.
మరోవైపు జింబాబ్వే పర్యటనలో దారుణంగా విఫలమైన అభిషేక్ శర్మకు మాత్రం భారత జట్టులో చోటు దక్కింది. అయితే తుది జట్టులో ఆడే విషయంపై వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్ నుంచి అతనికి గట్టి పోటీ నెలకొంది.
ఐపీఎల్ అత్యధిక పరుగులు చేసిన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రికార్డ్ కలిగి ఉన్న ప్రభ్‌సిమ్రాన్ సింగ్.. షేర్-ఏ-పంజాబ్ టీ20 లీగ్‌లో జలంధర్ వారియర్స్ జట్టును నడిపిస్తున్నాడు. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో 42 బంతుల్లో 76 పరుగులు చేసిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్.. రెండో మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. 2023 ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధించిన భారత జట్టులో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ సభ్యుడిగా ఉన్నాడు. సెప్టెంబర్ 3న బఠిండా రాయల్స్‌తో తదుపరి మ్యాచ్ ఆడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

