ఇంగ్లండ్ గడ్డపై పాకిస్థాన్‌కు ఘోర అవమానం.. తోక ముడిచిన బాబర్ సేన!
ఇంగ్లండ్ గడ్డపై పాకిస్థాన్ జట్టుకు ఘోర అవమానం ఎదురైంది. లార్డ్స్ టెస్ట్‌ను బహిష్కరిస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చేసిన హెచ్చరికలను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) బేఖాతరు చేసింది. పాకిస్థాన్ దిగ్గజ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కుమారుల ఇంటర్వ్యూను మ్యాచ్ సందర్భంగా ప్రసారం చేయవద్దని, అలా చేస్తే రెండో టెస్ట్ మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పీసీబీ ప్రగల్బాలు పలికింది.
కానీ ఈ హెచ్చరికలను ఈసీబీ పట్టించుకోలేదు. చివరకు లార్డ్స్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ ప్రసారం కాగా.. పాకిస్థాన్ బరిలోకి దిగింది. ఈ మ్యాచ్ లంచ్ బ్రేక్ సమయంలో ఇమ్రాన్ ఖాన్ కుమారుల ఇంటర్వ్యూను స్కై స్పోర్ట్స్ ప్రసారం చేసింది. అయితే ఏం చేయలేక పాకిస్థాన్ జట్టు తమ ఆటను కొనసాగించింది.
మా నాన్నను చంపేందుకు కుట్ర..
ఈ ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ కుమారులు కాసిం, సులేమాన్ ఖాన్‌లు పాకిస్థాన్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. జైల్లో తమ తండ్రిని చంపేందుకు పాకిస్థాన్ ప్రభుత్వ కుట్ర చేస్తుందన్నారు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ అథర్టన్ నిర్వహించిన ఈ ఇంటర్వ్యూ.. 18 నిమిషాల పాటు ప్రత్యక్ష ప్రసారమైంది.

'ఇమ్రాన్ ఖాన్ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియడం లేదు. ఆయనను జైల్లో చంపేందుకు కుట్ర చేస్తున్నారు. వీలైనంత కాలం ఆయనను జైలులోనే ఉంచి.. గొంతు నొక్కేయాలని చూస్తున్నారు. చివరిసారి ఆయన మా బంధువులతో మాట్లాడినప్పుడు పరిస్థితి చాలా దాయనీయంగా ఉందని చెప్పారు. జైలులో హత్యుకు గురై, మరణించిన ఇతర రాజకీయ ఖైదీల పరిస్థితితో పోల్చారు. రోజంతా ఇమ్రాన్ ఖాన్‌ను గదిలోనే ఏకాంతంగా ఉంచుతున్నారు.'అని కాసిం, సులేమాన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఫలించని పీసీబీ ప్రయత్నాలు..
అయితే ఈ ఇంటర్వ్యూను ప్రసారం చేయవద్దని స్కై న్యూస్‌ను పీసీబీ సంప్రదించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ప్రసారం చేస్తే.. మ్యాచ్‌ను బహిష్కరిస్తామని హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ ఇంటర్వ్యూ ప్రసారమైనా.. పాక్ ఆటగాళ్లు బరిలోకి దిగారు. పాక్ బెదిరింపులను స్కై స్పోర్ట్స్‌తో పాటు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు పట్టించుకోలేదని తెలుస్తోంది.
అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ 2023లో అరెస్టైన విషయం తెలిసిందే. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ ఆటగాళ్లు పాకిస్థాన్ ప్రభుత్వానికి లేఖ రాసారు.
ఇంగ్లండ్ 248/9
గురువారం ప్రారంభమైన లార్డ్స్ టెస్ట్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 9 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. వర్షం కారణంగా తొలి రోజు 56 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. జొర్డాన్ కాక్స్(55), జేమీ స్మిత్(61) హాఫ్ సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో మహ్మద్ అబ్బాస్ నాలుగు వికెట్లు తీయగా.. మహమ్మద్ అలీ ఒక వికెట్ పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

