Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: టీమిండియా కొంపముంచిన సోనాల్ దినుషా.. డ్రాతో గట్టెక్కిన శ్రీలంక!

శ్రీలంకతో రెండో టెస్ట్‌లో టీమిండియాకు అనూహ్య ఫలితం ఎదురైంది. విజయం ఖాయమనుకున్న మ్యాచ్‌‌ డ్రాగా ముగిసింది. సోనాల్ దినుషా(264 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 133 నాటౌట్) అజేయ శతకంతో టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసాడు. మరోవైపు ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో సోనాల్ దినుషా, టెయిలెండర్ల అద్వితీయమైన బ్యాటింగ్ ప్రదర్శనతో శ్రీలంక డ్రాతో గట్టెక్కింది. దాంతో ఈ రెండు టెస్ట్‌ల సిరీస్‌ను భారత్ 1-0తో కైవసం చేసుకుంది.

IND vs SL: టీమిండియాకు ఎదురుదెబ్బ..!

IND vs SL: టీమిండియాకు ఎదురుదెబ్బ..!

229/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌ను 154 ఓవర్లలో 429/9 స్కోర్ వద్ద డ్రా చేసింది. రెండో ఇన్నింగ్స్ ఆడేందుకు తగిన ఓవర్లు లేకపోవడంతో.. శుభ్‌మన్ గిల్ షేక్ హ్యాండ్ ఇచ్చి డ్రాకు అంగీకరించాడు.

IND vs SL Sonal Dinusha Fighting Century Helps Sri Lanka Force Draw India Win Series 1-0

జిడ్డు బ్యాటింగ్‌తో..

సోనాల్ దినుషా అజేయ శతకంతో పాటు పసింధు సూర్యబండార(173 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 92), కామిందు మెండీస్(92 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 55), కేశర నువాంత(150 బంతుల్లో 4 ఫోర్లతో 46) విలువైన పరుగులు చేశారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్(3/121), రవీంద్ర జడేజా(3/94) మూడేసి వికెట్లు తీయగా.. ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, సారాన్ష్ జైన్ తలో వికెట్ తీసారు.

తొలి సెషన్‌లోనే ఫలితం తేలుతుందని భారత్ భావించగా.. సోనాల్ దినుషా, కేశర నువాంత అడ్డుగోడగా నిలిచారు. భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచారు. 32 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన ఈ ఇద్దరూ.. తొలి సెషన్‌లో 100 పరుగులు జోడించారు. దాంతో శ్రీలంక 329/6 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

సెంచరీతో చెలరేగిన దినుషా..

రెండో సెషన్‌లో కేశర నువాంత ఔటవ్వడంతో ఏడో వికెట్‌కు నమోదైన 112 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే ప్రభాత్ జయసూర్య కూడా ఔటవ్వడంతో భారత శిభిరంలో ఆశలు చిగురించాయి. కానీ లాహిరు కుమారతో కలిసి సోనాల్ దినుషా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. జిడ్డుగా ఆడిన ఈ జోడీ.. భారత బౌలర్ల సహనాన్ని దెబ్బతీసింది. 383/8 స్కోర్‌తో శ్రీలంక టీ బ్రేక్‌కు వెళ్లింది.

ఆఖరి సెషన్‌లోనూ ఇదే ప్రదర్శనను కొనసాగించిన శ్రీలంక 400 పరుగుల మార్క్‌ను అందుకుంది. 196 బంతుల్లో దినూషా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 90 బంతులాడిన లాహిరు కుమారను జడేజా ఔట్ చేసినా ఫలితం లేకపోయింది. అసితా ఫెర్నాండో(0 నాటౌట్) కలిసి దినుషా మరో 10 ఓవర్లు ఆడగా.. శ్రీలంక డిక్లేర్ చేసింది. శుభ్‌మన్ గిల్ వెంటనే షేక్ హ్యాండ్ ఇచ్చి డ్రాకు అంగీకరించాడు. వర్షం అంతరాయం, పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారడం, భారత ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం లోపించడం.. గిల్ సేన విజయాన్ని అడ్డుకున్నాయి.

చరిత్ర సృష్టించిన సోనాల్ దినుషా.. 67 ఏళ్ల తర్వాత భారత్‌పై అరుదైన ఘనత!

Also Read

చరిత్ర సృష్టించిన సోనాల్ దినుషా.. 67 ఏళ్ల తర్వాత భారత్‌పై అరుదైన ఘనత!

సంక్షిప్త స్కోర్లు..

భారత్ తొలి ఇన్నింగ్స్ 503/9 డిక్లేర్డ్ (దేవదత్ పడిక్కల్ 117, ధ్రువ్ జురెల్ 115 నాటౌట్)

శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 290 ఆలౌట్(పసిందు సూర్యబండార 80, సోనాల్ దినుషా 103)

శ్రీలంక రెండో ఇన్నింగ్స్ 429/9డిక్లేర్డ్(పసిందు సూర్యబండార 92, కామిందు మెండీస్ 55, సోనాల్ దినుషా 133 నాటౌట్)

Story first published: Thursday, August 27, 2026, 17:24 [IST]
Other articles published on Aug 27, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+