న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బుమ్రాను కొనుగోలు చేయమని కోహ్లీకి ముందే చెప్పా.. కానీ నా మాట వినలేదు: పార్దివ్ పటేల్

Parthiv Patel Says I told Virat we should be picking Bumrah but then he went to MI
Parthiv Patel - 'I Told To Viart Kohli To Pick Bumrah For RCB, But He Didn't Care My Words

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రాను ఐపీఎల్ 2013 వేలంలో కొనుగోలు చేయమని విరాట్ కోహ్లీకి చెప్పానని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) వికెట్ కీపర్ పార్ధీవ్ పటేల్ తెలిపాడు. అతను అత్యుత్తమ బౌలర్ అవుతాడని తాను ముందే ఊహించానని, కానీ కోహ్లీ తన సూచనను అంత సీరియస్‌గా తీసుకోకపోవడంతో బుమ్రాను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిందని ఈ సీనియర్ క్రికెటర్ తెలిపాడు. తాజాగా సోషల్ మీడియా వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన పార్దివ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

చెప్పినా వినలేదు..

చెప్పినా వినలేదు..

ఈ సందర్భంగా జస్‌ప్రీత్ బుమ్రా విషయం గురించి మాట్లాడుతూ.. ‘జస్‌ప్రీత్ బుమ్రాను కచ్చితంగా కొనుగోలు చేయాలని అప్పట్లో కెప్టెన్ విరాట్ కోహ్లీకి చెప్పా. కానీ.. వేలంలో అతడ్ని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది'అని పార్థీవ్ పటేల్ వెల్లడించాడు. బుమ్రా జట్టులో చేరిన ఏడాదే తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై టీమ్.. ఆ తర్వాత వరుసగా 2015, 2017, 2019లో విజేతగా నిలిచింది. ఈ నాలుగు సీజన్లలోనూ డెత్ ఓవర్లలో బుమ్రా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. ఎన్నో చిరస్మరణీయ విజయాలందించాడు.

బౌలర్ల లోటే..

బౌలర్ల లోటే..

ఐపీఎల్ ప్రారంభ సీజన్ (2008) నుంచి బ్యాట్స్‌మెన్‌లపైనే ఎక్కువగా ఆధారపడిన ఆర్సీబీ.. ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. 2016లో ఫైనల్‌కు చేరి సన్‌రైజర్స్ చేతిలో ఓడింది. ఇక తమ బలహీనతలను తెలసుకున్న ఆర్సీబీ ఐపీఎల్ 2020 సీజన్ వేలంలో మాత్రం తన పంథా మార్చుకుంది. వేలంలో ఫాస్ట్ బౌలర్లు క్రిస్ మోరీస్ (రూ. 10 కోట్లు), కేన్ రిచర్డ్‌సన్ (రూ. 4 కోట్లు), డేల్ స్టెయిన్ (రూ. 2 కోట్లు)లను కొనుగోలు చేసింది. కానీ కరోనా వైరస్ కారణంగా మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ నిరవధికంగా వాయిదాపడింది.

‘పక్కా లోకల్'సాంగ్‌తో జూనియర్ ఎన్టీఆర్‌కు విషెస్ చెప్పిన డేవిడ్ వార్నర్

రాహులే వరల్డ్‌కప్ ఛాయిస్..

రాహులే వరల్డ్‌కప్ ఛాయిస్..

ఇక టీమిండియా యువ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ టీ20 ప్రపంచకప్‌కు ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ అని, అతను పరిమిత ఓవర్లకు సరిగ్గా సరిపోతాడని పార్దివ్ చెప్పుకొచ్చాడు.

‘ప్రస్తుత పరిస్థితుల్లో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో కేఎల్ రాహుల్ కీపర్‌గా సరిపోతాడనిపిస్తోంది. టీ20 ప్రపంచకప్ దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే రాహుల్‌ను షార్ట్ టైమ్ ప్లాన్‌లా చెప్పొచ్చు. మెగాటోర్నీలో అతడు కచ్చితంగా తనకు అప్పజెప్పిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు.'అని పార్దివ్ అభిప్రాయపడ్డాడు.

పంత్‌కు ఎప్పుడూ అదే చెబుతా..

పంత్‌కు ఎప్పుడూ అదే చెబుతా..

‘యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ లోనూ చాలా నైపుణ్యం ఉంది. 17-18 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు నాకూ మంచి సిరీస్‌లు లేవు. దీంతో కొన్నాళ్లు డొమెస్టిక్ సీజన్‌లో ఆడాను. అది నాకు చాలా హెల్ప్ అయింది. రిషభ్ ను కలిసిన ప్రతిసారి నేనో విషయం చెప్తా. నీలో టాలెంట్ ఉంది. అందుకే అందరూ నీ గురించి మాట్లాడుతున్నారు. ఒకవేళ నీలో ప్రతిభ లేకుంటే ఎవ్వరూ నీ గురించి మాట్లాడరు. ఈ విషయాన్ని గుర్తుంచుకో అని చెప్తుంటా. కోల్పోయిన ఫామ్‌ను దేశవాళీ క్రికెట్‌లో ఆడి తిరిగి సాధించవచ్చని తెలుపుతుంటా. 'అని పార్థివ్ చెప్పుకొచ్చాడు.

సర్ఫరాజ్ ఖాన్ పెద్ద మనసు.. వలస కూలీలకు ఫుడ్ ఫ్యాకెట్స్ అందిస్తున్న యువ క్రికెటర్

Story first published: Thursday, May 21, 2020, 13:01 [IST]
Other articles published on May 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X