సర్ఫరాజ్ ఖాన్ పెద్ద మనసు.. వలస కూలీలకు ఫుడ్ ఫ్యాకెట్స్ అందిస్తున్న యువ క్రికెటర్

లక్నో: కరోనా తెచ్చిన కష్టంతో యావత్ ప్రపంచం తల్లడిల్లుతోంది. వలస కూలీలు అల్లాడుతున్నారు. దేశంలో విధించిన లాక్‌డౌన్‌తో పనుల్లేక.. ఉండటానికి ఆశ్రయంలేక.. పస్తులుండలేక కాలి బాట పట్టారు. చంటిబిడ్డ, ముసలి అవ్వ , నెలల నిండిన గర్భిణీ అని తేడా లేకుండా అందరూ సొంతూళ్లకు పయనమయ్యారు. ఈ ఆకలితో చచ్చేకంటే సొంతూళ్లో తమవారి మధ్య ప్రాణాలు కోల్పోవడం మంచిదని వెళ్తున్నారు. దేశవ్యాప్తంగా ఏక్కడ చూసినా.. వలస కూలీల బాధే కనిపిస్తుంది. వారి ఆకలి కేకలే వినిపిస్తున్నాయి. వీరి బాధను చూడలేని కొందరు తమకు తోచిన సాయం చేస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు.

వలస కూలీలకు ఫుడ్ ప్యాకెట్స్..
ఇలానే భారత యువ క్రికెటర్, రంజీ సెన్సేషన్ సర్ఫరాజ్ ఖాన్ కుటుంబం కూడా వలస కూలీల బాధలను చూసి తల్లడిల్లింది. వెంటనే తమకు తోచిన సాయాన్ని చేయాడానికి నడుం బిగించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆజమ్‌ఘర్ జిల్లాలోని వారి సొంతగ్రామం నుంచి వెళ్తున్నా వలస కూలీలకు ఫుడ్ ప్యాకెట్స్ అందించే కార్యక్రమం చెపట్టింది. సర్ఫరాజ్ అతని తండ్రి నౌషద్, సోదరుడు ముషీర్ ఈ సహాయ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ఈ ఏడాది రంజాన్ పండుగను కూడా జరుపుకోమని ఈ యువ క్రికెటర్ కుటుంబం తెలిపింది.
ఇది మా నాన్న ఆలోచన..
‘నిత్యవసర వస్తువుల కోసం తరుచూ మార్కెట్ వెళ్లి వస్తుంటే వందల సంఖ్యలో వలస కూలీలు నడుస్తూ వెళ్లడం చూశాం. అప్పుడే వారికి సాయం చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ వలస కూలీలకు సాయం చేయాలనేంది మా నాన్న ఆలోచన.'అని సర్ఫరాజ్ ఔట్ లుక్ ఇండియాకు తెలిపాడు. ఇక వారి కుటుంబం స్థానికుల అండతో ఈ సాయం చేస్తుంది.

వెయ్యి ప్యాకెట్లు అందించాం..
సర్ఫరాజ్ తండ్రి నౌషద్ మాట్లాడుతూ.. ఇప్పటికే వెయ్యి ప్యాకెట్ల వరకు అందజేసామన్నారు. ఇంకా అందించేందుకు తాము సిద్దంగా ఉన్నామని తెలిపారు. తాము అందించే ప్యాకెట్‌లో యాపిల్, అరటిపండు, కేక్, బిస్కట్స్, వాటర్ బాటిళ్లు ఉన్నాయన్నారు. సర్ఫరాజ్ సోదరుడు మాట్లాడుతూ.. ఈ ఏడాది రంజాన్ జరుపుకోవద్దని నిర్ణయించుకున్నామన్నారు. ఆ డబ్బులను వలస కూలీలకు సహాయ కార్యక్రమాలకు ఉపయోగిస్తామన్నారు. ఇక ఈ యువ క్రికెట్ చేసే సహాయానికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అతని కుటుంబంపై క్రికెట్ అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ సీజన్ ఐపీఎల్ వేలంలో సర్ఫరాజ్ ఖాన్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కొనుగోలు చేయగా.. అతను మార్చిలో సొంతూరుకు వెళ్లి అక్కడే చిక్కుకుపోయాడు.

రంజీలో రఫ్ఫాడించిన సర్ఫరాజ్..
ఈ సీజన్ రంజీ ట్రోఫీలో సర్ఫరాజ్ పరుగుల మోత మోగించాడు. ముంబై తరఫున బరిలోకి దిగిన ఈ యూపీ కుర్రాడు.. మైదానంలో వరుస సెంచరీలతో చెలరేగాడు. ఓ ట్రిపుల్ సెంచరీ కూడా బాదాడు. తన సొంత రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ మీదనే సర్ఫరాజ్( 301 నాటౌట్) ఈ త్రిశతకం సాధించాడు. హిమాచల్ ప్రదేశ్‌పై డబుల్ సెంచరీ, మధ్యప్రదేశ్‌తో 177 పరుగులు చేశాడు. ఇదే ఫామ్‌ను ఐపీఎల్‌లో కొనసాగిద్దామనుకున్న ఈ యువ క్రికెటర్ ఆశలపై కరోనా నీళ్లు చల్లింది. ఇక 2014,2016 అండర్-19 ప్రపంచకప్ టోర్నీలతో సర్ఫరాజ్ యావత్ క్రికెట్ ప్రపంచానికి పరిచయమయ్యాడు. ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున కూడా కొన్ని మెరుపులు మెరిపించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications