న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

‘పక్కా లోకల్’సాంగ్‌తో జూనియర్ ఎన్టీఆర్‌కు విషెస్ చెప్పిన డేవిడ్ వార్నర్

David Warner wishes Jr. NTR Birthday by dancing to ‘Pakka Local’ song
David Warner Wishes Jr.NTR On His Birthday By Dancing 'Pakka Local' Song

హైదరాబాద్: ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తెలుగు సినిమా పాటలు, డైలాగులకు టిక్‌టాక్ చేస్తూ సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాడు. ఐపీఎల్ నిరవధిక వాయిదాతో తన బ్యాట్ మూగబోయినా.. తన టిక్‌టాక్‌ వీడియోలతో అలరిస్తున్నాడు. ఇప్పటికే తెలుగు సూపర్ హిట్ సాంగ్స్‌, డైలాగ్స్‌కు టిక్ టాక్ చేసి ఆయా హీరోల, అభిమానుల మనసులు గెలుచుకున్నాడు.

ఎన్టీఆర్‌కు స్పెషల్ విషెస్..

ఇప్పటికే అల వైకుంఠపురములో.. చిత్రంలోని బుట్టబొమ్మ 'రాములో రాములా' పాటలకు తన భార్యతో కలిసి టిక్‌టాక్ చేసిన వార్నర్ తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ స్పెషల్ ట్రీట్ ఇచ్చాడు. ఎన్టీఆర్ సూపర్ హిట్ సాంగ్ ‘పక్కా లోకల్' సాంగ్‌కు సతీమణి క్యాండీస్‌తో కలిసి చిందేసాడు. అచ్చం తెలుగు స్టైల్లో ఇరగదీసిన వార్నర్ జోడీ.. చివర్లో ఎన్టీఆర్‌కు బర్త్‌డే విషెస్ తెలిపింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వార్నర్..‘ హ్యాపీ బర్త్‌డే జూనియర్ ఎన్టీఆర్.. నీకంతా మంచే జరగాలి. మేం ప్రయత్నించాం. కానీ డ్యాన్స్ చాలా ఫాస్ట్‌గా ఉంది'అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ రోజుతో( మే 20)ఎన్టీఆర్ 38వ ఏట అడుగుపెడుతున్న విషయం తెలిసిందే.

లవ్ యూ వార్నర్ అన్నా..

ఇక ఈ విషెస్‌తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. థ్యాంక్స్ వార్నర్ అన్నా.. లవ్ యూ అంటూ కామెంట్ చేస్తున్నారు. ‘భయ్యా.. యూ ఆర్ మాస్.. నీ విషెస్‌తో మా మనసు పులికించింది'అంటూ వార్నర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కొందరైతే థ్యాంక్యూ మామా అని కామెంట్ చేస్తున్నారు.

 అభిమాని కోరిక మేరకు..

అభిమాని కోరిక మేరకు..

అంతకుముందు ఓ ఎన్టీఆర్ అభిమాని మంగళవారం వార్నర్‌కు ఎన్టీఆర్ బర్త్‌డే విషయాన్ని తెలియజేస్తూ తమ అభిమాన హీరోకు విషెస్ చెప్పాలని కోరాడు. ‘డేవిడ్ భాయ్, రేపు నా ఫేవరెట్ హీరో తారక్ పుట్టినరోజు. అతనికి మీరు విషెస్ తెలుపగలరా?" అంటూ ఆ అభిమాని ట్విట్టర్ లో కోరగా.. వార్నర్ సానుకూలంగా స్పందించాడు. "హ్యాపీ బర్త్ డే బడ్డీ" అంటూ ట్వీట్ చేసి ఆ అభిమానిని సంతోష సాగరంలో ముంచెత్తాడు. ఇక బర్త్ డే రోజు సూపర్ హిట్ సాంగ్‌కు డ్యాన్స్ చేసి నందమూరి అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చాడు.

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తప్పా..

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తప్పా..

అలవైకుంఠపురం సాంగ్స్‌తో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ను.. బన్నీని ఆకట్టుకున్న వార్నర్.. మహేష్ బాబు పోకిరి చిత్రంలోని ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను అనే డైలాగ్‌తో సూపర్ స్టార్ ఫ్యాన్స్‌‌తో పాటు ఆ మూవీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాకుండా పూరీ నుంచి సినిమా ఆఫర్ కూడా అందుకున్నాడు.

ఆ తరువాత బాహుబలి చిత్రం నుంచి 'అమరేంద్రం బాహుబలి అను నేను' అనే డైలాగ్‌తో డార్లింగ్ ప్రభాస్ అభిమానులను ఆకట్టుకున్నాడు. తాజాగా ఎన్టీఆర్‌కు బర్త్‌డే విషెస్‌తో నందమూరి అభిమానులను కవర్ చేశాడు. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులను కవర్ చేస్తే టాలీవుడ్ మొత్తం కవర్ అయితుంది. వారిని ఎప్పుడు మెప్పిస్తోడో ఈ విధ్వంసకర బ్యాట్స్‌మన్.

ఆ తప్పిదమే నా కెరీర్‌ను ముంచింది: ఊతప్ప

Story first published: Wednesday, May 20, 2020, 13:39 [IST]
Other articles published on May 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X