భారత్ నిరాకరించడంతో.. లెజెండ్స్ లీగ్ నుంచి పాకిస్థాన్ ఔట్!
క్రికెట్ దిగ్గజాల మధ్య జరిగే వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2026 టోర్నీ నుంచి పాకిస్థాన్ లెజెండ్స్ టీమ్ తప్పుకుంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నిరభ్యంతర పత్రం(ఎన్‌ఓసీ) ఇవ్వకపోవడంతో షాహిద్ అఫ్రిది సారథ్యంలోని పాకిస్థాన్ లెజెండ్స్ టీమ్ ఒక్క మ్యాచ్ ఆడకుండా వైదొలిగింది. బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో జరగాల్సిన తమ మ్యాచ్‌లు రద్దయిన అనంతరం పాకిస్థాన్ లెజెండ్స్ టీమ్ నుంచి ఈ ప్రకటన వెలువడింది.
'పీసీబీ నిరభ్యంతరం పత్రం (ఎన్‌ఓసీ) ఇవ్వడానికి నిరాకరించడంతో.. 'వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్' (డబ్ల్యూసీఎల్) టోర్నీ నుంచి వైదొలుగుతున్నాం. పీసీబీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. అయితే మా ఆటగాళ్లు ఈ టోర్నీలో ఆడలేకపోతున్నందుకు విచారిస్తున్నాం. అభిమానుల మద్దతుకు ధన్యవాదాలు'అని పాకిస్థాన్ లెజెండ్స్ టీమ్ మేనేజ్‌మెంట్ తమ ప్రకటనలో పేర్కొంది.

జాతీయ మీడియా వివరాల ప్రకారం.. పీసీబీ ఈ టోర్నీ ఆడేందుకు కొన్ని షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. గతేడాది భారత్ తమతో మ్యాచ్ ఆడటానికి నిరాకరించినందుకు గానూ.. ఆ జట్టు లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పాలని పీసీబీ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ డిమాండ్‌ను డబ్ల్యూసీఎల్ నిర్వాహకులు తిరస్కరించడంతో పాకిస్థాన్ లెజెండ్స్ తప్పుకోవాల్సి వచ్చింది.
అసలేం జరిగిందంటే..?
పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ ఘటనల నేపథ్యంలో గత ఎడిషన్‌లో పాకిస్థాన్‌తో జరగాల్సిన మ్యాచ్‌లను యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా ఛాంపియన్స్ తిరస్కరించింది. లీగ్ మ్యాచ్‌తో పాటు సెమీఫైనల్ ఆడకుండా టోర్నీ నుంచి తప్పుకుంది. దాంతో భారత్ ఫైనల్ చేరకుండానే ఇంటిదారి పట్టింది.
భారత ఆటగాళ్లు పాకిస్థాన్ ప్లేయర్లతో కరచాలనం చేయాలన్న పీసీబీ మరో ప్రతిపాదనను కూడా భారత్ అంగీకరించలేదు. అయితే పాకిస్థాన్ బోర్డు అడిగిన కొన్ని వ్యాపార,ఆర్థిక డిమాండ్లకు మాత్రం నిర్వాహకులు ఒప్పుకున్నారు. షెడ్యూల్ ప్రకారం భారత్ - పాకిస్థాన్ ఛాంపియన్స్ మధ్య అక్టోబర్ 10న మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ టోర్నీ మూడో ఎడిషన్ ప్రస్తుతం యూఏఈలోని దుబాయ్, షార్జాలలో జరుగుతోంది. తొలి రెండు ఎడిషన్లు ఇంగ్లండ్‌లో జరిగిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


