Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అభిషేక్ శర్మ రికార్డ్ బద్దలు కొట్టిన పాకిస్థాన్ నయా కెప్టెన్.. విరాట్ కోహ్లీ రికార్డ్ సమం!

పాకిస్థాన్ నయా టీ20 కెప్టెన్ సాహిబ్జాదా ఫర్హాన్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. శ్రీలంకతో సొంతగడ్డపై జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో ఫర్హాన్ ఈ ఫీట్ సాధించాడు.

ఈ క్రమంలోనే టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ పేరిట ఉన్న రికార్డ్‌ను అధిగమించాడు. విరాట్ కోహ్లీ రికార్డ్ సమం చేసి అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

IND vs WI: వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలి: టీమిండియా మాజీ కోచ్

IND vs WI: వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలి: టీమిండియా మాజీ కోచ్

కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే..

మంగళవారం జరిగిన మూడో టీ20లో పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో ఓడినా ఈ సిరీస్‌ను 2 1తో సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌లోనే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన సాహిబ్జాదా ఫర్హాన్ ఓపెనర్‌గా బరిలోకి దిగి సత్తా చాటాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు సాధించాడు. తొలి మ్యాచ్‌లో 53 బంతుల్లో 89 పరుగులు చేసిన ఫర్హాన్.. రెండో టీ20లో 73, మూడో టీ20లో 76 పరుగులతో. మొత్తం 238 పరుగులు చేసి సరికొత్త చరిత్రను లిఖించాడు.

Pakistan s Sahibzada Farhan Breaks Abhishek Sharma s World Record for Most Runs in a Three-Match T20I Series

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగుల రికార్డ్ అభిషేక్ శర్మ పేరిట ఉంది. గత నెలలో అఫ్గానిస్థాన్‌పై అతను 229 పరుగులతో ఈ ఫీట్ సాధించాడు. తాజాగా సాహిబ్జాదా ఫర్హాన్ ఈ రికార్డ్‌ను అధిగమించాడు. న్యూజిలాండ్‌కు చెందిన కోలిన్ మున్రో 223 పరుగులతో తర్వాతి స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్ 217 పరుగులతో తర్వాతి స్థానంలో ఉన్నారు.

IND vs WI: పోలీస్ నిఘాలో ఉప్పల్ మ్యాచ్.. మఫ్టీలో షీ టీమ్స్: సీపీ సుమతి

Also Read

IND vs WI: పోలీస్ నిఘాలో ఉప్పల్ మ్యాచ్.. మఫ్టీలో షీ టీమ్స్: సీపీ సుమతి

కోహ్లీ సరసన..

ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ల్లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో 50కి పైగా పరుగులు చేసిన తొలి పాకిస్థాన్ బ్యాటర్ ఫర్హాన్ నిలిచాడు. ఈ క్రమంలో ఈ ఫీట్ సాధించిన విరాట్ కోహ్లీ సరసన 8వ ఆటగాడి నిలిచాడు. విరాట్ కోహ్లీ 2016లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో తొలిసారి ఈ ఫీట్ సాధించాడు. అతని తర్వాత కొలిన్ మున్రో, డేవిడ్ వార్నర్, శ్రేయస్ అయ్యర్ కూడా ఈ ఘనతను అందుకున్నాడు. కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఆకట్టుకున్న సాహిబ్జాదా ఫర్హాన్‌పై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Story first published: Wednesday, October 14, 2026, 12:09 [IST]
Other articles published on Oct 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+