దటీజ్ విరాట్ కోహ్లీ.. పగోడైనా అభిమానించాల్సిందే!
పాకిస్థాన్ మహిళా క్రికెటర్లు మరోసారి వార్తల్లో నిలిచారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్‌లో పేలవ ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పాక్ మహిళా ప్లేయర్లు.. తాజాగా ఆటకు సంబంధం లేని వ్యవహారంలో నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు. పాకిస్థాన్ మహిళా క్రికెటర్లలో చాలా మంది టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి చెందిన ఒన్8 బ్రాండ్ షూస్ ధరించారు.
పాకిస్థాన్ లెఫ్టార్మ్ స్పిన్నర్ నష్రా సంధు, కుడిచేతి బ్యాటర్ ఐమాన్ ఫాతిమా సహా పలువురు ప్లేయర్స్ ఒన్8 బ్రాండ్ షూస్ ధరించి కనిపించారు. టీమిండియా స్టార్ బ్యాటర్‌కు చెందిన కంపెనీ షూస్ ధరించడంతో ఈ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
దటీజ్ విరాట్ కోహ్లీ..
ఈ ఫొటోలను చూసిన విరాట్ కోహ్లీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దటీజ్ విరాట్ కోహ్లీ.. పగోడైనా అభిమానించాల్సిందేనని కామెంట్ చేస్తున్నారు. పాక్ మహిళా క్రికెటర్లు కూడా విరాట్ కోహ్లీని ఆరాధిస్తున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనమని అతని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. పాకిస్థాన్‌లో కూడా విరాట్ కోహ్లీకి అభిమానులు ఉన్నారు. ఈ విషయం చాలా సందర్భాల్లో నిరూపితమైంది. పీఎస్‌ఎల్, పాకిస్థాన్ మ్యాచ్‌ల సందర్భంగా విరాట్ కోహ్లీ పేరుతో ఉన్న జెర్సీలతో పలువురు అభిమానులు హాజరయ్యారు.

ఫుట్‌వేర్, దుస్తులు, క్రీడా ఉత్పత్పులను అందించే ప్రముఖ స్పోర్ట్స్ వేర్ బ్రాండ్‌గా వన్8 సంస్థ నిలిచింది. విరాట్ కోహ్లీ కంపెనీ కావడంతో అతి తక్కువ కాలంలోనే ఈ బ్రాండ్‌కు ప్రాచూర్యం లభించింది. అజిలిటాస్ అనే సంస్థతో కలిసి విరాట్ కోహ్లీ ఈ కంపెనీని ప్రారంభించాడు. అజిలిటాస్ సంస్థలో కూడా విరాట్ కోహ్లీ 40 కోట్లు పెట్టుబడి పెట్టాడు.
సెమీస్‌కు పాకిస్థాన్..
భారత్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్థాన్ మహిళల జట్టు ఈ పరాజయం నుంచి త్వరగానే తేరుకుంది. హాంగ్ కాంగ్‌తో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారీ విజయం సాధించి గ్రూప్-ఏ నుంచి రెండో జట్టుగా సెమీస్‌కు అర్హత సాధించింది. నష్రా సంధు 6 వికెట్లతో హాంగ్ కాంగ్ పతనాన్నిశాసించింది. సెమీఫైనల్లో శ్రీలంకతో తలపడనుంది. ఈ టోర్నీలో అత్యుత్సాహం ప్రదర్శించిన పాకిస్థాన్ కెప్టెన్ సనా ఫాతిమాతో పాటు గల్ ఫెరోజాపై ఐసీసీ చర్యలు తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించింది.
భారత్‌తో జరిగిన సెమీఫైనల్లో షెఫాలీ వర్మను ఔట్ చేసిన అనంతరం ఫాతిమా సనా.. బయటకు వెళ్లు అంటూ సెండాఫ్ ఇవ్వడం వివాదాస్పదమైంది. రూల్స్‌కు విరుద్దం కావడంతో ఐసీసీ చర్యలు తీసుకుంది. మరోవైపు హాంగ్ కాంగ్ మ్యాచ్‌లో ఔటైన తర్వాత గల్ ఫెరోజా అసంతృప్తి వ్యక్తం చేసింది. దాంతో అంపైర్ల ఫిర్యాదు మేరకు మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


