
సర్ఫరాజ్ ఈజ్ బ్యాక్..
ఇక పాక్ క్రికెట్ జట్టు విషయానికొస్తే.. అనూహ్యంగా గతేడాది అక్టోబర్‌లో చివరిసారిగా కనిపించిన ఆ జట్టు మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కు అవకాశం దక్కింది. 29 మంది సభ్యులతో కూడి జట్టులో సర్ఫరాజ్ పేరుంది. నలుగురు ఓపెనర్లు అబిద్ అలీ, ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, షాన్ మసూద్ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇక మిడిలార్డర్‌లో వెటరన్ ఆటగాళ్లు షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్, మరో వికెట్ కీపర్‌గా మహ్మద్ రిజ్వాన్‌లను సెలెక్టర్లు ఎంపిక చేశారు.

అనామక క్రికెటర్లు..
గతేడాది జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో సత్తాచాటిన పాకిస్తాన్ యువ ప్లేయర్లు హైదర్ అలీ, ఖాసీఫ్ బట్టీల అంతర్జాతీయ అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. ఇంగ్లండ్ టూర్‌లో ఈ ఇద్దరు అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించనున్నారు. ఇక నాలుగేళ్ల తర్వాత సొహైల్ ఖాన్‌కు అవకాశం దక్కింది. పీసీబీ కాంట్రాక్ట్‌ను కోల్పోయిన పేసర్ వహాబ్ రియాజ్‌కు మరొకసారి అవకాశం ఇచ్చారు.
‘కర్రోడా'అని పిలిచిన వ్యక్తి నాతో మాట్లాడాడు: సామీ

అమిర్, సోహైల్ దూరం..
ఇక మహ్మద్ అమిర్, హారిస్ సొహైల్‌లు ఇంగ్లండ్ పర్యటనకు దూరం కానున్నారు. అమిర్ భార్య ఆగస్టులో ప్రసవించే అవకాశం ఉండటంతో అతను ఇంగ్లండ్ పర్యటన నుంచి వైదొలిగాడు. టెస్టు ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పి, కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రమే కొనసాగుతున్న అమిర్.. పీసీబీ అనుమతితో ఇంగ్లండ్ పర్యటన నుంచి వైదొలిగాడు. కుటుంబ కారణాలతో సోహైల్ దూరమయ్యాడని పీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇక కరోనా నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పీసీబీ నలుగురు రిజర్వ్ ఆటగాళ్లను ఎంపిక చేసింది. బిలాల్ ఆసిఫ్, ఇమ్రాన్ బట్, ముసా ఖాన్, మహ్మద్ నవాజ్‌లను రిజర్వ్ ఆటగాళ్లుగా పేర్కొంది. ఇంగ్లండ్ ప్రయాణానికి ముందు జూన్ 20-25 మధ్య ఎంపిక చేసిన ఆటగాళ్లలో ఎవరికైనా కరోనా పాజిటీవ్ అని తేలితో వీరితో వారి స్థానాలను భర్తీ చేయనుంది.

పాకిస్థాన్ జట్టు
అబిద్ అలీ, ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, షాన్ మసూద్, అజార్ అలీ( టెస్ట్ కెప్టెన్), బాబర్ ఆజమ్( టీ20 కెప్టెన్), అసద్ షఫీక్, ఫవద్ అలాం, హైదర్ అలీ, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్‌దిల్ షా, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), సర్ఫరాజ్ అహ్మద్(కీపర్), ఫహీమ్ అష్రఫ్, హ్యారిస్ రాఫ్, ఇమ్రాన్ ఖాన్, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ హస్నైన్, నసీమ్ షా, షాహిన్ షా అఫ్రిది, సోహైల్ ఖాన్, ఉస్మాన్ శిన్వారి, వహార్ రియాజ్, ఇమాద్ వసీం, కషీఫ్ బట్టి, షాదాబ్ ఖాన్, యాసిర్ షా


Click it and Unblock the Notifications

ఒక్క బంతికే 17 పరుగులు.. పాక్‌పై సెహ్వాగ్ అరుదైన రికార్డు!










