Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మామ జడలు విప్పిన ఈ మ్యాచ్ గుర్తుందా! (వీడియో)

సరిగ్గా 19 ఏళ్ల క్రితం ఇదే రోజు(2007 సెప్టెంబర్ 24) భారత క్రికెట్ జట్టు అదిరిపోయే విజయాన్ని అందుకుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తు చేసి విశ్వవిజేతగా నిలిచింది. అరంగేట్ర టీ20 ప్రపంచకప్ 2007లో ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత్.. అద్వితీయమైన ప్రదర్శనతో తొలి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో భారత్ అదరగొట్టింది. దాయాదీ పాకిస్థాన్‌తో ఉత్కంఠగా సాగిన ఫైనల్లో ధోనీ సేన 5 పరుగుల తేడాతో గెలుపొందింది.

అది నా కోచింగ్ కెరీర్‌లోనే కఠిన నిర్ణయం.. ఆ రాత్రి నిద్ర కూడా పట్టలేదు: గంభీర్

అది నా కోచింగ్ కెరీర్‌లోనే కఠిన నిర్ణయం.. ఆ రాత్రి నిద్ర కూడా పట్టలేదు: గంభీర్

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులే చేసింది. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్, అప్పటి ఓపెనర్ గౌతమ్ గంభీర్(54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 75) హాఫ్ సెంచరీతో రాణించగా.. రోహిత్ శర్మ(16 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 30 నాటౌట్) దూకుడుగా ఆడాడు. పాకిస్థాన్ బౌలర్లలో ఉమర్ గుల్(3/28) మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ ఆసిఫ్, సోహైల్ తన్వీర్ తలో వికెట్ తీసారు.

On This Day MS Dhoni Young Team India Became T20 World Champions Do You Remember This Match

ఐకానిక్ క్యాచ్..

అనంతరం పాకిస్థాన్ 19.3 ఓవర్లలో 152 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఇమ్రాన్ నజీర్(14 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33), మిస్బా ఉల్ హక్(38 బంతుల్లో 4 సిక్స్‌లతో 43) రాణించినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో ఆర్‌పీ సింగ్(3/26), ఇర్ఫాన్ పఠాన్(3/16) మూడేసి వికెట్లు తీయగా.. జోగిందర్ శర్మ(2/20) రెండు వికెట్లు పడగొట్టాడు. శ్రీశాంత్ ఒక వికెట్ తీసాడు. జోగిందర్ శర్మ వేసిన ఆఖరి ఓవర్‌లో మిస్బా ఉల్ హక్ ఇచ్చిన క్యాచ్‌ను శ్రీశాంత్ అందుకున్నాడు. ఈ క్యాచ్‌ భారత క్రికెట్‌ చరిత్రలోనే ఐకాన్‌గా నిలిచింది.

అంచనాలు లేకుండా ..

ఈ విజయం భారత క్రికెట్ చరిత్రనే మార్చేసింది. 1983 ప్రపంచకప్ తర్వాత భారత్ గెలిచిన రెండో ప్రపంచకప్ ఇదే కావడం గమనార్హం. వాస్తవానికి టీ20 ఫార్మాట్‌ను బీసీసీఐ వ్యతిరేకించింది. దాంతోనే ఈ మెగా టోర్నీకి సచిన్, ద్రవిడ్ వంటి సీనియర్ ఆటగాళ్లను దూరంగా ఉంచి.. యువ ఆటగాళ్లను పంపించింది. మహేంద్ర సింగ్ ధోనీని సారథిగా ఎంపిక చేసింది. ఈ కుర్రాళ్ల జట్టును చూసి భారత్ లీగ్ దశలోనే వెనుదిరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ ధోనీ సేన అనూహ్య విజయంతో అందర్నీ ఆకట్టుకుంది.

Asian Games 2026: మూడో రోజు ఒక స్వర్ణం.. మరో రెండు పతకాలు ఖాయం!

Also Read

Asian Games 2026: మూడో రోజు ఒక స్వర్ణం.. మరో రెండు పతకాలు ఖాయం!

అయితే ఈ ప్రపంచకప్ మ్యాచ్‌లను చాలా మంది ప్రత్యక్ష ప్రసారం చూడలేకపోయారు. అప్పుడు ఇప్పటిలా ఓటీటీ.. ఛానెల్స్ సౌకర్యం లేకపోవడంతో రేడియోలో ఈ మ్యాచ్ కామెంట్రీని మెజార్టీ అభిమానులు విన్నారు. ఓవైపు వినాయక నిమజ్జనం.. మరోవైపు ఈ విజయంతో అభిమానులు ఊగిపోయారు. నైంటీస్ కిడ్స్‌కు అయితే ఈ మ్యాచ్ ఓ మధురానుభూతి. ఈ మ్యాచ్ మీకు గుర్తుందా..?

Story first published: Thursday, September 24, 2026, 10:11 [IST]
Other articles published on Sep 24, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+