Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన భారత మహిళలు!

సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు(2025 నంబర్ 2) భారత మహిళల వన్డే టీమ్ చరిత్ర సృష్టించింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ వన్డే ప్రపంచ‌కప్‌ను ముద్దాడింది. సౌతాఫ్రికాతో ఉత్కంఠగా సాగిన ఫైనల్లో అద్వితీయమైన ప్రదర్శనతో విజయం సాధించిన హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు విశ్వకిరిటాన్ని సొంతం చేసుకుంది.

గత రెండు ప్రయత్నాల్లో తృటిలో చేజారిన కప్‌ను భారత్ మూడో ప్రయత్నంలో ముద్దాడింది. సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్(93 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 101) సెంచరీ పోరాటం భారత్‌ను బయపెట్టినా.. షెఫాలీ వర్మ, దీప్తి శర్మ అద్బుత బౌలింగ్‌తో భారత్ చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది.

Viral Video: 'వైభవ్ నిరసన చేస్తున్నాడు!': అక్షర్ పటేల్ కామెడీ మామూలుగా లేదుగా!

Viral Video: 'వైభవ్ నిరసన చేస్తున్నాడు!': అక్షర్ పటేల్ కామెడీ మామూలుగా లేదుగా!
On This Day In 2025 How India Womens Cricket Team Created History With Its First World Cup Triumph

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 298 పరుగులు చేసింది. ప్రతికా రావల్ గాయంతో జట్టుకు దూరమవడంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన షెఫాలీ వర్మ(78 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 87) అసాధారణ ప్రదర్శన కనబర్చింది. దీప్తి శర్మ(58 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌తో 58) హాఫ్ సెంచరీతో రాణించగా.. స్మృతి మంధాన(58 బంతుల్లో 8 ఫోర్లతో 45) పర్వాలేదనిపించింది.

IND vs NZ: సిరీస్ గెలిచాం కానీ పరువు పోయింది.. కివీస్ చేతిలో ఘోర ఓటమి!

Also Read

IND vs NZ: సిరీస్ గెలిచాం కానీ పరువు పోయింది.. కివీస్ చేతిలో ఘోర ఓటమి!

అనంతరం సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. లారా వోల్వార్డ్ సెంచరీతో రాణించా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. పార్ట్ టైమ్ బౌలర్ అయిన షెఫాలీ వర్మతో బౌలింగ్ చేయించి హర్మన్‌ప్రీత్ కౌర్ ఫలితాన్ని రాబట్టింది. ఔటాఫ్ సిలబస్‌లా దూసుకొచ్చిన షెఫాలీని సౌతాఫ్రికా బౌలర్లు, బ్యాటర్లు ఎదుర్కోలేకపోయారు.

దీప్తి శర్మ(58, 5/39) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. మొత్తం ఈ టోర్నీలో 22 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డ్ గెలుచుకుంది. షెఫాలీ వర్మ(87, 2/36) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. మహిళల క్రికెట్‌లో భారత్ సాధించిన తొలి ఐసీసీ టైటిల్ ఇదే కావడం గమనార్హం. మిథాలీ రాజ్ సారథ్యంలో భారత్ రెండు సార్లు ఫైనల్ చేరినా.. ప్రపంచకప్‌ను ముద్దాడలేకపోయింది. ఈ చిరస్మరణీయానికి ఏడాది పూర్తి కావడంతో అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

Story first published: Monday, November 2, 2026, 10:02 [IST]
Other articles published on Nov 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+