Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Viral Video: 'వైభవ్ నిరసన చేస్తున్నాడు!': అక్షర్ పటేల్ కామెడీ మామూలుగా లేదుగా!

Viral Video: న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న ఐదో, చివరి టీ20 మ్యాచ్‌లో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తుది జట్టులో రెండు కీలక మార్పులు చేశాడు. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిలకు అవకాశం కల్పించినప్పటికీ.. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని మరోసారి బెంచ్‌కే పరిమితం చేశారు. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీకి సంబంధించి స్టేడియం బయట జరిగిన ఓ సరదా సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

IND vs NZ: వైభవ్‌ సూర్యవంశీని తప్పించడం సరైన నిర్ణయమే: స్టీఫెన్ ఫ్లేమింగ్

IND vs NZ: వైభవ్‌ సూర్యవంశీని తప్పించడం సరైన నిర్ణయమే: స్టీఫెన్ ఫ్లేమింగ్

హోటల్ గదిలో ఆసక్తికర దృశ్యం
న్యూజిలాండ్ తో మ్యాచ్ కు ముందు భారత ఆటగాళ్ల విశ్రాంతి సమయంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో టీమిండియా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. భారత ప్లేయర్లు ఉన్న హోటల్ గది బయట నుంచి ఉన్నట్లుండి పెద్ద శబ్ధంతో కూడిన మ్యూజిక్, గుంపు అరుపులు వినిపించాయి. ఓం జరుగుతుందో తెలుసుకునేందుకు గదిలో ఉన్న అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీలు ఆసక్తిగా కిటికీలోంచి బయటకు తొంగి చూశారు.

Axar Patel Funny Comment on Vaibhav Sooryavanshi Goes Viral During IND vs NZ T20I Video Goes Viral

అక్షర్ పటేల్ చమత్కారం
అభిషేక్, వైభవ్‌లు కిటీకీ వద్ద నిలబడి ఉండటం చూసి అక్కడ కూర్చున్న స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ చేసిన హాస్యాస్పద కామెంట్ మొత్తం వీడియోకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 'తుది జట్టులో చోటు దక్కలేదని ఈ వైభవ్ బయట నిరసన తెలుపుతున్నాడు!" అంటూ అక్షర్ పటేల్ సరదాగా కామెంట్ చేశాడు. అక్షర్ వేసిన ఈ ఫన్ని పంచ్ వినగానే గదిలోని భారత ఆటగాళ్లందరూ ఒక్కసారిగా నవ్వేశారు.

 IND vs NZ: సంజూ శాంసన్ మళ్లీ ఫ్లాప్.. టపటపా రెండు వికెట్లు డౌన్!

Also Read

IND vs NZ: సంజూ శాంసన్ మళ్లీ ఫ్లాప్.. టపటపా రెండు వికెట్లు డౌన్!

వైరల్ అవుతున్న వీడియో
బయట ఉన్న గుంపు, సంగీతానికి గల అసలు కారణం స్పష్టంగా తెలియనప్పటికీ.. అక్షర్ పటేల్ చాకచక్యంగా వేసిన చమత్కారం భారత డ్రెస్సింగ్ రూమ్ లోని తేలికపాటి వాతావరణాన్ని, ప్లేయర్ల మధ్య ఉన్న సత్సంబంధాలను చాటిచెప్పింది. సోషల్ మీడియాలో నెటిజన్లు, క్రికెట్ అభిమానులు ఈ ఫన్నీ వీడియోను లైక్స్, కామెంట్లతో విపరీతంగా షేర్ చేస్తున్నారు.

Story first published: Sunday, November 1, 2026, 14:18 [IST]
Other articles published on Nov 1, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+