Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ, రోహిత్ కాదు.. ఆ భారత బ్యాటర్‌కు బౌలింగ్ చేయడం నరకం: పాట్ కమిన్స్

టీమిండియా మాజీ క్రికెటర్, టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారాకు బౌలింగ్ చేయడం నరకమని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అన్నాడు. తాను ఎదుర్కొన్న కఠినమైన భారత బ్యాటర్ పుజారేనని స్పష్టం చేశాడు. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడని, ఒక్క పరుగు చేయకుండా 100 పరుగులు ఆడగలిగే సామర్థ్యం అతనికి ఉందని అభిప్రాయపడ్డాడు.

ఆస్ట్రేలియా కెప్టెన్‌గా చిరస్మరణీయమైన విజయాలు అందించిన పాట్ కమిన్స్.. భారత్‌కు పీడ కలలు మిగిల్చాడు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌తో పాటు డబ్ల్యూటీసీ 2023 ఫైనల్లో భారత్‌ను కమిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు ఓడించింది. ఓ బౌలర్‌గా పాట్ కమిన్స్ దిగ్గజ బ్యాటర్లను ఎదుర్కొన్నాడు. టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో కూడా ఎన్నో మ్యాచ్‌లు ఆడాడు.

యువరాజ్ సింగ్ సలహాతోనే ఈ విధ్వంసకర శతకం: అభిషేక్ శర్మ

యువరాజ్ సింగ్ సలహాతోనే ఈ విధ్వంసకర శతకం: అభిషేక్ శర్మ

పుజారాకు బౌలింగ్ చేయడం నరకం..

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న టఫెస్ట్ బ్యాటర్ పేరు చెప్పమంటే కమిన్స్.. రోహిత్, కోహ్లీ పేరు చెప్పకుండా పుజారా పేరు వెల్లడించాడు. 'నేను ఎదుర్కొన్న టఫెస్ట్ భారత బ్యాటర్ చతేశ్వర్ పుజారా. అతన్ని ఔట్ చేయడం చాలా కష్టం. ఒక రకంగా అతనికి బౌలింగ్ వేయాలంటే ప్రత్యక్షంగా నరకం చూసినట్లే ఉంటుంది. అవసరమైతే అతను ఒక్క పరుగు కూడా చేయకుండా 100 బంతులు ఆడటానికి కూడా సిద్దంగా ఉంటాడు. వికెట్ తీయడానికి చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా విసిగిస్తాడు.

Not Kohli or Rohit Pat Cummins Calls Cheteshwar Pujara the Hardest Indian Batter He Has Faced

పుజారతో పాటు అలిస్టర్ కుక్(ఇంగ్లండ్), ఏబీ డివిలియర్స్(సౌతాఫ్రికా), బ్రెండన్ మెకల్లమ్(న్యూజిలాండ్), తిలకరత్నె దిల్షాన్(శ్రీలంక), క్రిస్ గేల్(వెస్టిండీస్) నేను ఎదుర్కొన్న టఫెస్ట్ బ్యాటర్లు.'అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.

ఆ పాక్ స్పిన్నర్ ప్రత్యేకం..

తాను ఎదుర్కొన్న బౌలర్లలో పాకిస్థాన్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ చాలా యూనిక్ బౌలర్ అని చెప్పాడు. 'పాకిస్తాన్ విషయానికొస్తే.. సయీద్ అజ్మల్. ఓ మ్యాచ్‌లో ఓవర్ ఆఖరి బంతికి నేను బ్యాటింగ్ చేయడానికి క్రీజులోకి వచ్చాను. అజ్మల్ ఒక బంతి వేసాడు.. అంతే.. నాకు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. క్లీన్ బౌల్డ్ అయ్యాను. నా జీవితంలో ఎప్పుడూ అలాంటి బౌలింగ్ చూడలేదు.'అని కమిన్స్ గుర్తుచేసుకున్నాడు.

గుజరాత్‌కు చెందిన చతేశ్వర్ పుజారా.. 2011లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అవకాశాలు అందుకోకపోయినా.. టెస్ట్‌ల్లో 100 మ్యాచ్‌ల మైలురాయి అందుకున్నాడు. తన 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 103 టెస్ట్‌లు ఆడి 7195 పరుగులు చేశాడు. ఇందులో 35 హాఫ్ సెంచరీలు, 19 సెంచరీలు, మూడు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి.

IND vs WI: వన్డేల్లోకి ఆ ముంబై ఆటగాడా? ఏం చూసి ఎంపిక చేశారు?: హనుమ విహారి

Also Read

IND vs WI: వన్డేల్లోకి ఆ ముంబై ఆటగాడా? ఏం చూసి ఎంపిక చేశారు?: హనుమ విహారి

జిడ్డు బ్యాటింగ్‌తో బౌలర్లకు సవాల్ విసరడం పుజారా ప్రత్యేకత. ఆసీస్ గడ్డపై 2018-19, 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోపీ గెలిచిన భారత జట్టులో పుజారా కీలక పాత్ర పోషించాడు. ఆసీస్‌తోనే కెరీర్ ప్రారంభించిన పుజారా.. ఆ జట్టుతోనే ఆఖరి మ్యాచ్‌ ఆడాడు. డబ్ల్యూటీసీ 2023 ఫైనల్ అతని కెరీర్‌లో చివరి మ్యాచ్.

Story first published: Saturday, September 19, 2026, 16:27 [IST]
Other articles published on Sep 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+