Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SA vs AUS: 10 ఏళ్ల తర్వాత పునరాగమనం.. డకౌట్‌తో చెత్త రికార్డ్!

ఆస్ట్రేలియా ఓపెనర్ నిక్ మాడిసన్ చెత్త రికార్డ్ నమోదు చేశాడు. 10 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జట్టులోకి పునరాగమనం చేసిన అతను డకౌట్‌గా వెనుదిరిగి నిరాశపర్చాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ 33 బంతులు ఆడిన నిక్ మాడిసన్ ఒక్క పరుగు చేయకుండానే మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

దాంతో అత్యధిక బంతులాడి డకౌట్ అయిన తొలి ఆసీస్ బ్యాటర్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఓపెనర్‌గా అత్యధిక బాల్స్ ఆడి డకౌట్ అయిన రికార్డ్ న్యూజిలాండ్ క్రికెటర్ డారిన్ ముర్రే పేరిట ఉంది. అతను 39 బంతులు ఆడి డకౌటయ్యాడు. 1995లో శ్రీలంకపై ఈ చెత్త ఫీట్ నమోదు చేశాడు. ఈ జాబితాలో నిక్ మాడిసన్ మూడో స్థానంలో నిలిచాడు.

అగార్కర్‌ తప్పుకోవడంతో వారికి తలుపులు తెరుచుకున్నాయి: అశ్విన్

అగార్కర్‌ తప్పుకోవడంతో వారికి తలుపులు తెరుచుకున్నాయి: అశ్విన్

2016లో సౌతాఫ్రికాపైనే అరంగేట్రం చేసిన నిక్ మాడిసన్ అదే ఏడాది పాకిస్థాన్‌తో ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అతనికి అవకాశాలే రాలేదు. ఇన్నాళ్లకు మళ్లీ సఫారీ గడ్డపైనే పునరాగమనం చేయగా.. తీవ్రంగా నిరాశపర్చాడు. ఇప్పటి వరకు నాలుగు టెస్ట్‌లు ఆడిన అతను 27 పరుగులు మాత్రమే చేశాడు.

Nic Maddinson Test Comeback Ends in 33-Ball Duck After a Decade Creates Unwanted Record

అత్యధిక బంతులాడి డకౌట్ అయిన ఆసీస్ బ్యాటర్లు..

నిక్ మాడిన్సన్: 33 బంతులు vs SA (2026)
డేవిడ్ వార్నర్: 22 బంతులు vs ENG (2022)
షాన్ మార్ష్: 21 బంతులు vs IND (2017)
సామీ జోన్స్: 20 బంతులు vs ENG (1888)
ఉస్మాన్ ఖవాజా: 20 బంతులు (20 బంతులు vs20)

అత్యధిక బంతాలాడి డకౌట్ అయిన ఓపెనర్లు

డారిన్ ముర్రే (NZ): శ్రీలంకపై 39 బంతులు (1995)
ట్రెవర్ గ్రిప్పర్ (ZIM): వెస్టిండీస్‌పై 36 బంతులు (2000)
నిక్ మాడిన్సన్ (AUS): దక్షిణాఫ్రికాపై 33 బంతులు (2026)*
మార్క్ డెక్కర్ (ZIM): శ్రీలంకపై 30 బంతులు (1994)
బ్రియాన్ లక్‌హర్స్ట్ (ENG): ఆస్ట్రేలియాపై 29 బంతులు (1971)

IND vs WI 4th T20I: ఉప్పల్ మ్యాచ్ టికెట్లు కావాలా.. అందుబాటులో 22 వేల టికెట్లు!

Also Read

IND vs WI 4th T20I: ఉప్పల్ మ్యాచ్ టికెట్లు కావాలా.. అందుబాటులో 22 వేల టికెట్లు!

ఆలౌట్ దిశగా ఆసీస్..

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 124 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఆలౌట్ దిశగా కొనసాగుతోంది. మార్కో జాన్సెన్, వియాన్ మల్డర్, అన్రిచ్ నోర్జ్ రెండేసి వికెట్లతో నిప్పులు చెరిగారు. ఆసీస్ బ్యాటర్లలో మార్నస్ లబుషేన్(37), స్టీవ్ స్మిత్(25)తో సహా ట్రావిస్ హెడ్(9), అలెక్స్ క్యారీ(14), బ్యూ వెబ్ స్టార్(4) విఫలమయ్యారు.

Story first published: Friday, October 9, 2026, 17:27 [IST]
Other articles published on Oct 9, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+