For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ vs న్యూజిలాండ్ తొలి వన్డేలో రాస్ టేలర్ రికార్డుల మోత

New Zealand vs India, 2020: List of records Ross Taylor created with his unbeaten 109

హమిల్టన్: భారత్‌తో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ నిర్ధేశించిన 348 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు 11 బంతులు మిగిలుండగానే అలవోకగా ఛేదించింది. రాస్ టేలర్(109 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. తాత్కలిక కెప్టెన్ టామ్ లాథమ్(69), నికోలస్ (78) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇక సెంచరీతో చెలరేగిన రాస్ టేలర్ అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నాడు.

హమిల్టన్‌లోనే నాలుగు వన్డే సెంచరీలు.. మొత్తం 10 శతకాలు..

హమిల్టన్‌లోనే నాలుగు వన్డే సెంచరీలు.. మొత్తం 10 శతకాలు..

హమిల్టన్‌లోని సెడన్ పార్క్‌ మైదానంలో 17 ఇన్నింగ్స్‌ల్లో టేలర్‌కు ఇది నాలుగో వన్డే సెంచరీ. ఇక న్యూజిలాండ్‌లో ఒక వేదికపై ఎక్కువ వన్డే సెంచరీలు చేసిన క్రికెటర్‌గా తనపేరిట ఉన్న రికార్డును తానే అధిగమించాడు. నపియర్‌లోని మెక్‌లీన్ పార్క్‌లో టేలర్ మూడు సెంచరీలు చేశాడు.

ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో హమిల్టన్‌ వేదికగా టేల‌ర్‌కు ఇది 10వ సెంచరీ. ఒకే వేదికపై అత్యధిక సెంచరీలు చేసిన తొలి న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ కాగా.. ఓవరాల్‌గా 5వ క్రికెటర్. ఈ జాబితాలో మహేల జయవర్ధనే (కొలంబో-11), రికీ పాంటింగ్ ( ఎంసీజీ-11), హషీమ్ ఆమ్లా (సెంచూరియన్-11) జాక్వస్ కల్లీస్ (కేప్ టౌన్-10) ముందున్నారు.

2015- హమిల్టన్ మైదానంలో టేలర్ చేసిన మొత్తం పరుగులు. న్యూజిలాండ్ తరఫున ఈ ఫీట్ అందుకున్న తొలి క్రికెటర్ టేలర్. ఈ వేదికపై వన్డేల్లో 871 పరుగులు చేసి నపియర్‌ వేదికగా ఉన్న 779 పరుగుల రికార్డు అధిగమించాడు.

పానీపూరి అమ్మినోడు.. పాక్‌ను పాతరేశాడు

కోహ్లీ, జాసన తర్వాత టేలరే..

కోహ్లీ, జాసన తర్వాత టేలరే..

300+ స్కోర్ ఛేజింగ్‌లో ఎక్కువ సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా టేలర్ గుర్తింపు పొందాడు. 300కు పైగా పరుగుల ఛేజింగ్‌లో అతనికిది నాలుగో సెంచరీ. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ(7), జాసన్ రాయ్(5) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

1300-భారత్‌పై టేలర్ చేసిన పరుగులు. న్యూజిలాండ్ తరఫున ఈ ఘనతనందుకున్న బ్యాట్స్‌మన్‌గా టేలర్ గుర్తింపు పొందాడు. తాజా సెంచరీతో నాథన్ అస్ల్టే(1207) పేరిట ఉన్న రికార్డును టేలర్ అధిగమించాడు. భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డేల్లో సచిన్ (1750) అగ్రస్థానంలో ఉండగా.. కోహ్లి (1354) టేలర్ కన్నా ముందున్నాడు.

ఛేజింగ్‌లో 20వ గెలుపు..

ఛేజింగ్‌లో 20వ గెలుపు..

ఇక వన్డే క్రికెట్‌లో న్యూజిలాండ్‌కు 21 చేజింగ్‌ల్లో ఇది 20వ గెలుపు. 2013లో వర్షం అంతరాయం కలిగించిన వన్డే మ్యాచ్‌లో టేలర్ అజేయంగా నిలిచినప్పటికీ విజయాన్నందుకోలేకపోయింది.

3986-ఇక న్యూజిలాండ్ గడ్డపై వన్డేల్లో టేలర్ చేసిన పరుగులు. మార్టిన్ గప్టిల్ (3942) పరుగులను టేలర్ ఈ మ్యాచ్‌తో అధిగమించాడు.

అందుకే అంబటి రాయుడిపై వేటు.. చాలా బాధపడ్డా : ఎమ్మెస్కే

 రాస్ టేలర్ అజేయ సెంచరీ

రాస్ టేలర్ అజేయ సెంచరీ

ఇక ఈ మ్యాచ్‌లో రాస్ టేలర్(109 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగడంతో న్యూజిలాండ్ 4 వికెట్లతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయాస్ అయ్యర్ (107 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌) కెరీర్‌లో తొలి సెంచరీ‌తో సాధించగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (51; 63 బంతుల్లో 6 ఫోర్లు), లోకేష్ రాహుల్ (88 నాటౌట్) హాఫ్ సెంచరీలతో మెరిసారు. కివీస్ బౌలర్లలో టీమ్ సౌథీ రెండు వికెట్లు తీయగా.. గ్రాండ్ హోమ్, ఇష్ సోదీ చెరొక వికెట్ తీశారు.

అనంతరం 348 పరుగులతో దిగిన కివీస్.. 48.1 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 348 పరుగులు చేసి విజయాన్నందుకుంది. టేలర్ అజేయ సెంచరీకి తోడు నికోలస్(78), స్టాండ్ కెప్టెన్ టామ్ లాథమ్(69) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ రెండు వికెట్లు తీయగా.. షమీ, ఠాకుర్ చెరొక వికెట్ తీశారు.

Story first published: Wednesday, February 5, 2020, 19:14 [IST]
Other articles published on Feb 5, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+