Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్-న్యూజిలాండ్ రెండో వన్డేలో ఇది గమనించారా? క్రికెట్ హిస్టరీలోనే చాలా రేర్ ఘటన!!

New Zealand fielding coach fields against India in 2nd ODI due to lack of fit players

ఆక్లాండ్ : న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 22 పరుగులతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను ఒక మ్యాచ్ మిగిలుండగానే ఆతిథ్య జట్టు 2-0తో సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. ఇది క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన సంఘటన.

సహాయ కోచ్ ఫీల్డింగ్..

ఫీల్డర్ గాయపడితే రిజర్వ్ బెంచ్‌లోని ఎక్స్‌ట్రా ప్లేయర్ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా మైదానంలోకి వస్తాడనే విషయం తెలుసు. కానీ శనివారం జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ కోచ్ ఫీల్డర్‌గా మైదానంలోకి రావడం అభిమానులను ఆశ్చర్యానికీ గురిచేసింది.

కివీస్‌ జట్టులోని ఆటగాళ్లు ఫిట్‌గా లేకపోవడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ సందర్భంగా రోంచి సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌గా ఈడెన్‌ పార్క్‌ మైదానంలోకి అడుగుపెట్టాడు. పేస‌ర్ టిమ్ సౌథి స్థానంలో రోంచి సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చాడు.

రిజర్వ్ బెంచ్ అంతా..

రిజర్వ్ బెంచ్ అంతా..

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ భుజం గాయం కారణంగా తొలి రెండు వన్డేలకు దూరమైన విషయం తెలిసిందే. అతనితో పాటు రిజర్వ్‌బెంచ్‌లోని ఆటగాళ్లు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కుగెలీన్‌ జ్వరంతో ఇబ్బందిపడుతుండగా.. మిచెల్‌ సాంట్నర్‌ కడుపునొప్పితో బాధపడుతున్నాడు. వీరిద్దరూ రెండో వన్డే మ్యాచ్‌ ఆడలేదు. సాంట్నర్‌ స్థానంలో చాప్‌మన్‌ జట్టులోకి రాగా.. జేమీసన్‌ వన్డేలకు అరంగేట్రం చేసి ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టాడు.

అనారోగ్యం కారణంగా సౌథి తన కోటా ఓవర్లు పూర్తి చేసిన తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లాడు. రిజర్వ్‌ ఆటగాళ్లు ఫిట్‌గా లేకపోవడంతో 37వ ఓవర్లో రోంచి ఫీల్డింగ్‌కు రాకతప్పలేదు. మూడేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోంచి కివీస్‌ తరఫున చివరిసారిగా 2017లో ఆడాడు.

ఇదే తొలిసారి కాదు..

ఇదే తొలిసారి కాదు..

ఇక న్యూజిలాండ్ కోచ్‌ ఫీల్డింగ్ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ టెస్ట్‌లో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురవ్వగా.. అప్పటి బ్యాటింగ్ కోచ్, మాజీ ఓపెనర్ పీటర్, ఫల్టన్ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా మైదానంలో వచ్చి ఫీల్డింగ్ చేశాడు. ఆ మ్యాచ్‌లో కూడా కివీస్ ఆటగాళ్లు చాలా మంది గాయాలు, అస్వస్థతతో బాధపడ్డారు.

అప్పుడు ధోని.. ఇప్పుడు జడేజా మిగతాదంతా సేమ్ టూ సేమ్!!

అరంగేట్ర ఆటగాడి ఆల్‌రౌండ్ షో..

అరంగేట్ర ఆటగాడి ఆల్‌రౌండ్ షో..

ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. మార్టిన్‌ గప్టిల్‌ (79; 79 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), నికోలస్‌ (41; 59 బంతుల్లో 5 ఫోర్లు), రాస్‌ టేలర్‌ (73 నాటౌట్‌; 74 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు రాణించగా.. బ్లండెల్‌ (22), జెమీసన్‌ (25 నాటౌట్‌; 24 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. టీమిండియా బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌ 2, యుజువేంద్ర చాహల్ 3 వికెట్లు తీశారు.

వన్డే సిరీస్ విజయానందంలో ఉన్న న్యూజిలాండ్‌కు ఐసీసీ షాక్ !!

అనంతరం 274 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 48.3 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటై 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రవీంద్ర జడేజా (73 బంతుల్లో 55; 2 ఫోర్లు, 1 సిక్స్‌), శ్రేయస్‌ అయ్యర్‌ (57 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్‌), నవదీప్‌ సైనీ (49 బంతుల్లో 45; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. 6 అడుగుల 8 అంగుళాల పొడగరి, ఈ మ్యాచ్‌తోనే అరంగేట్రం చేసిన కివీస్‌ బౌలర్‌ కైల్‌ జేమీసన్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనకుగాను ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా నిలిచాడు. చివరి వన్డే మంగళవారం మౌంట్‌ మాంగనీలో జరుగుతుంది.

Story first published: Sunday, February 9, 2020, 13:21 [IST]
Other articles published on Feb 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+